తన పార్టీకి ఓటేయని భార్యను కాల్చేసిన భర్త | Man shoots at wife for voting to rival party | Sakshi
Sakshi News home page

తన పార్టీకి ఓటేయని భార్యను కాల్చేసిన భర్త

Published Wed, May 7 2014 3:08 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM

Man shoots at wife for voting to rival party

తనకు నచ్చిన పార్టీకి ఓటేయలేదని ఓ ప్రబుద్ధుడు భార్యను కాల్చిపారేశాడు. ఈ సంఘటనలో భార్య తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులంటున్నారు.
 
ఈ సంఘటన బీహార్ లోని ఉజియార్ పూర్ నియోజకవర్గం లోని మొయినుద్దీన్ నగర్ లో జరిగింది. ఉజియార్ పూర్ లో బుధవారం ఎన్నికలు జరిగాయి. వినోద్ పాశ్వాన్ అనే వ్యక్తి భార్య తన మాట వినకుండా వేరే పార్టీకి ఓటేయడంతో మండిపడ్డాడు. పట్టలేని కోపంతో తుపాకీతో ఆమెను కాల్చేశాడు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేయడంతో ఇప్పుడు పాశ్వాన్ పారిపోయాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement