తొలి ప్రచారానికి నేడు తెర | mptc zptc Elections Campaign end | Sakshi
Sakshi News home page

తొలి ప్రచారానికి నేడు తెర

Published Fri, Apr 4 2014 3:23 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

mptc zptc  Elections Campaign end

శ్రీకాకుళం, న్యూస్‌లైన్ :జిల్లాలో తొలి విడతలో ఎన్నికలు జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీలలో ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలతో తెర పడనుంది. గత నెల 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ప్రాదేశిక ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓటర్లతో మమేకం అవటంలో తొలినుంచి ముందంజలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ మరింత ఉత్సాహంతో సాగుతోంది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహనరెడ్డి పర్యటనకు విశేష ప్రజాదరణ లభిస్తుండడంతో అభ్యర్థులు, నాయకులు మరింత ఆత్మస్థైర్యం తో దూసుకుపోతున్నారు. టీడీపీ నాయకులు మాత్రం ప్రలోభాల రాజకీయంపై ఆధారపడుతున్నారు. తాయిలాలతో ఓటర్లను లోబరుచుకోవాలని చూస్తున్నారు. గార మండలంలో మద్యం పంచుతున్న ఇద్దరు టీడీపీ కార్యకర్తలను ఇటీవల పోలీసులు అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనం. కొందరు అభ్యర్థులు మహిళలకు చీరలు పంచి తమవైపు తిప్పుకోవాలని చూస్తున్నా ఫలితం లేకపోతోంది. దీంతో డీలా పడిన టీడీపీ శ్రేణులు ఎలాగోలా ఓటర్లను మభ్యపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. చంద్రబాబునాయుడు తొమ్మిదేళ్లపాటు అందించిన దారుణ పాలనను ఇప్పటికీ మరిచిపోని ప్రజలు ఆ పార్టీ నేతలు చెబుతున్న మాటలను నమ్మడం లేదు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పథకాలను పటిష్టంగా అమలు చేయడం ఒక్క వైఎస్‌ఆర్ సీపీకే సాధ్యమని గట్టి గా విశ్వసిస్తున్న ప్రజలు ఆ పార్టీని అధికారంలో కి తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్నారు.
 
 ప్రశాంత పోలింగ్‌కు ఏర్పాట్లు
 తొలి విడతలో ఈ నెల 6న పోలింగ్ జరగనున్న శ్రీకాకుళం, గార, పోలాకి, జలుమూరు, సారవకోట, రాజాం, వంగర, సంతకవిటి, రేగిడి, పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, మెళియాపుట్టి, కొత్తూరు, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో ఎలాంటి అవాం ఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వాస్తవానికి 18 మండలాల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ నరసన్నపేట జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కావడంతో మిగిలిన 17 మండలాల్లో 1042 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఈ మండలాల పరిధిలో 7,92,214 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,98,927 మంది పురుషులు, 3,96,280 మంది మహిళలు ఉన్నారు. మిగిలిన ఏడుగురు ఇతరులు. పురుషులు, మహిళల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా రు. 1139 మంది పోలింగ్ అధికారులు, 1150 మంది అసిస్టెంట్ పోలింగ్ అధికారులు, 3,518 మంది ఓపీవోలను నియమించారు. సమస్యాత్మక గ్రామాల్లో పటి ష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ తీరును వెబ్‌కాస్టింగ్ సిస్టమ్ ద్వారా వీడియో తీయించనున్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement