
మోడీ ప్రధాని అవుతారు: అద్వానీ
గాంధీనగర్: బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో విబేధాలు పక్కనపెట్టి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, మోడీ ప్రధాని అవుతారని అద్వానీ చెప్పారు. గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన శనివారం నామినేషన్ దాఖలు చేశారు. 1998 నుంచి అద్వానీ ఈ స్థానం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
అద్వానీ నామినేషన్ కార్యక్రమంలో మోడీ పాల్గొన్నారు. గాంధీనగర్ నుంచి పోటీ చేసేందుకు అద్వానీ విముఖంగా ఉన్నారంటూ ఇటీవల వచ్చిన వార్తలను ఖండించారు. గాంధీనగర్కు దూరం కావాలని తానెప్పుడు కోరుకోలేదని చెప్పారు. మోడీ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అద్వానీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గాంధీనగర్లో జరిగిన ర్యాలీలో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.