లక్ష్మణ రేఖ @ 100 మీటర్లు
ఎన్నికలు వచ్చాయంటే చాలు హద్దులు గుర్తుకు వస్తాయి. ఇందులో ప్రధానమైనది వంద మీటర్లు. పోలింగ్ కేంద్రాల పరిధిలో వంద మీటర్ల దూరంలో హద్దు నిర్ణయిస్తారు. ఈ హద్దు మీరితే ఆ వ్యక్తిపై వేటువేసే అధికారం పోలీసులకు ఉంటుంది. వంద మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారాలు చేయకూడదు.
పార్టీ కార్యాలయాలు, పార్టీ రంగులు, పోస్టర్లు, జెండాలు ఉండరాదు. దీని లోపలికి ఓటర్లు గుంపులు, గుంపులుగా రాకూడదు. ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు ఓటర్లను వాహనాల్లో పెద్ద ఎత్తున హద్దు వరకు తీసుకు రాకూడదు. ఓటరుకు పార్టీ స్లిప్పులు ఇవ్వరాదు, హద్దులోపు అభ్యర్థులు ఎలాంటి గుర్తులతో కూడిన బ్యాడ్జీలు, పార్టీ తెలిపే రంగుల దుస్తులు ధరించి ప్రచారాలు చేయరాదు. అలా చేసిన వారిపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటారు.