ఒక్క ఏపీ నుంచే రూ.118 కోట్లు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) దేశవ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.195 కోట్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే రూ.118 కోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న నగదు, మద్యం వివరాల జాబితాను ఈసీ సోమవారం ఇక్కడ వెల్లడించింది. అదేవిధంగా ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలతో 11,469 కేసులను నమోదు చేసినట్టు పేర్కొంది. 70 కిలోల హెరాయిన్, 26.56 లక్షల లీటర్ల లిక్కర్‌ను కూడా సీజ్ చేసినట్టు వివరించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 659 మంది అధికారులతో కూడిన బృందాలు పటిష్ట తనిఖీలు నిర్వహించినట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.118 కోట్లు, తమిళనాడులో 18.31 కోట్లు, మహారాష్ట్రలో 14.40 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో 10.46 కోట్లు, పంజాబ్‌లో రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
దేశ వ్యాప్తంగా 195 కోట్లు స్వాధీనం
Published Tue, Apr 8 2014 2:59 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement