హైదరాబాద్: సీమాంధ్రలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆరు గంటల వరకు క్యూలో ఉన్నవారందరికీ ఓటువేసే అవకాశం కల్పిస్తారు. సీమాంధ్రలో మొత్తం 25 లోక్‌సభ, 175 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
లోక్సభకు మొత్తం 333 మంది బరిలో ఉన్నారు. శాసనసభకు 2,241 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకోవలసినవారు మొత్తం 3 కోట్ల 67లక్షల 62 వేల 975 మంది ఉన్నారు. మొత్తం 40,709 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎండాకాలం కావడంతో ఉదయం ఏడు గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటు వేయడానికి బారులుతీరారు. గ్రామీణ ప్రాంతాలలో ఓటర్లు ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉన్నారు.