
మారిన ఫలితాల సరళి
హైదరాబాద్: నిన్నటి మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈరోజు వెలువడే ఎంపిటిసి, జడ్పిటిసి ఫలితాల సరళిలో ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రప్రదేశ్లోనూ పూర్తిగా మార్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పెద్దగా శ్రమించకపోయినప్పటికీ ఏపిలో ఇప్పటివరకు తెలిసిని ప్రకారం వైఎస్ఆర్ సిపి మెరుగైన ఫలితాను సాధిస్తోంది.
చిత్తూరు జిల్లాలో మొత్తం 901 ఎంపిటిసి స్థానాల్లో వైఎస్ఆర్ సిపి 60 టిడిపి 48 స్థానాలను గెలుచుకున్నాయి.
ఇప్పటివరకు తెలిసిన ఎంపిటిసి ఫలితాలు ఏపిలో జిల్లాల వారీగా ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.
జిల్లాలు | ప్రకటించిన స్థానాలు | వైఎస్ఆర్ సిపి | టిడిపి |
శ్రీకాకుళం జిల్లా | 675 | 278 | 360 |
విజయనగం | 478 | 160 | 254 |
విశాఖపట్నం | 292 | 131 | 136 |
తూర్పు గోదావరి | 564 | 201 | 332 |
పశ్చిమగోదావరి | 710 | 191 | 476 |
కృష్ణా | 624 | 229 | 311 |
గుంటూరు | 888 | 399 | 460 |
ప్రకాశం | 784 | 401 | 346 |
కర్నూలు | 812 | 397 | 334 |
అనంతపురం | 601 | 227 | 364 |
వైఎస్ఆర్ జిల్లా | 500 | 300 | 184 |
నెల్లూరు | 528 | 278 | 212 |
చిత్తూరు | 788 | 331 | 406 |