mptc results
-
ఫలితాలు మంచి ఊపునిచ్చాయి: అంబటి
* తొలిసారి ఎన్నికల్లోనే గ్రామీణ ఓటర్లలో పట్టు సాధించాం * ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై అంబటి * జనభేరీ ప్రారంభించే నాటికే స్థానిక పోరు ముగిసింది * అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలు మాకు అను కూలంగా ఉంటాయి సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల బరిలో తొలిసారి రంగప్రవేశం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు తాజా జడ్పీటీసీ, ఎంపీటీసీల ఫలితాలపట్ల ఆ పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ నిర్మాణం పూర్తిగా జరక్కముందే తొలిసారి ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ గ్రామీణ ఓటర్లలో పార్టీ పట్టు సాధించడం పార్టీలో మ రింత ఆత్మస్థయిర్యాన్ని పెంచిందని తెలిపారు. సీమాం ధ్రలోని మొత్తం 653 జడ్పీటీసీల్లో 50 నుంచి 60 జడ్పీటీసీల వ్యత్యాసంతో ఏడెనిమిది జిల్లా పరిషత్‌లు వైఎస్సార్సీపీ చేజారాయని పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించేవి కావని, వీటికి సాధారణ ఎన్నికలకు ఎంతో వ్య త్యాసం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజులకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, ఈ నెల రోజుల వ్యత్యాసంలో వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్రలో విస్తృతంగా వ్యాప్తి చెంది పుంజుకున్నదని మంగళవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విశ్లేషిం చారు. మరో రెండు రోజుల్లో వెలువడే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయన్న విశ్వాసం తమకుందని ధీమా వ్యక్తంచేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన సమయంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఒకటిరెండు రోజుల్లోనే అకస్మాత్తుగా స్థానిక సంస్థల ఎ న్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అయినప్పటికీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసి ఈ స్థాయిలో ఫలితాలు సాధించడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. 10,092 ఎంపీటీసీల్లో 44 శాతం సీట్లను మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పార్టీ దక్కించుకుంటే... మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన మా పార్టీ 37 శాతం సీట్లు సాధించుకుంది. 19 శాతం ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. పార్టీ నిర్మాణమే లేని దశలో వచ్చి పడిన ఎన్నికలను ఎదుర్కొనడం ఏ పార్టీకైనా కత్తిమీద సాము లాంటిదే. అలాంటిది 653 జడ్పీటీసీల్లో దాదాపు సగభాగం స్థానాలు గెలుచుకోవడం సాధారణ విషయం కాదు. మంగళవారం అర్ధరాత్రి వరకు అందిన ఫలితాలను బట్టి మొత్తం జడ్పీటీసీల్లో టీడీపీ 53 శాతం సీట్లను సాధించగా... వైఎస్సార్ సీపీ 46 శాతం సీట్లు సాధించింది. మాకన్నా 50 జడ్పీటీసీ స్థానాలను అదనంగా గెల్చుకున్న టీడీపీ 9 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్నప్పటికీ... ఓట్ల పరంగా, సీట్ల పరంగా మా పార్టీది గొప్ప విజయంగా చెప్పుకోవాలి. సాధారణ ఎన్నికల ఘట్టం ఊపందుకోవడానికి ముందుగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలపై ఉండబోవు. ఏప్రిల్ 6, 11 వ తేదీల్లో రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఆ తర్వాత నెల రోజులకు సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ నెల రోజుల్లోపు సీమాంధ్ర ఓటర్లలో ఎంతో వ్యత్యాసం క నిపించింది. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాల ప్రభావం పెద్దగా ఉండదు. స్థానికంగా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల ప్రభావం ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుంది. పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత 12 వ తేదీన లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. 14 వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో పాటు పార్టీ అధ్యక్షుడు జగన్ జనభేరీ పేరుతో ప్రచారం ప్రారంభించారు. జగన్‌తో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సోదరి షర్మిల మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సామాజిక సమతూకం పాటిస్తూ పార్టీ టికెట్లను ఖరారు చేయడం, పార్టీ ముఖ్య ప్రచారకర్తల విస్తృత ప్రచారం, పార్టీ శ్రేణుల ంతా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొనడం వంటి అంశాలు వైఎస్సార్సీపీ గెలుపు ధీమాను పెంచాయి. -
మారిన ఫలితాల సరళి
హైదరాబాద్: నిన్నటి మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈరోజు వెలువడే ఎంపిటిసి, జడ్పిటిసి ఫలితాల సరళిలో ఇటు తెలంగాణలోను, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ పూర్తిగా మార్పు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పెద్దగా శ్రమించకపోయినప్పటికీ ఏపిలో ఇప్పటివరకు తెలిసిని ప్రకారం వైఎస్ఆర్ సిపి మెరుగైన ఫలితాను సాధిస్తోంది. చిత్తూరు జిల్లాలో మొత్తం 901 ఎంపిటిసి స్థానాల్లో వైఎస్ఆర్ సిపి 60 టిడిపి 48 స్థానాలను గెలుచుకున్నాయి. ఇప్పటివరకు తెలిసిన ఎంపిటిసి ఫలితాలు ఏపిలో జిల్లాల వారీగా ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి. జిల్లాలు ప్రకటించిన స్థానాలు వైఎస్ఆర్ సిపి టిడిపి శ్రీకాకుళం జిల్లా 675 278 360 విజయనగం 478 160 254 విశాఖపట్నం 292 131 136 తూర్పు గోదావరి 564 201 332 పశ్చిమగోదావరి 710 191 476 కృష్ణా 624 229 311 గుంటూరు 888 399 460 ప్రకాశం 784 401 346 కర్నూలు 812 397 334 అనంతపురం 601 227 364 వైఎస్ఆర్ జిల్లా 500 300 184 నెల్లూరు 528 278 212 చిత్తూరు 788 331 406 -
తెలంగాణలో ఎంపిటిసి ఫలితాలు
హైదరాబాద్: నిన్నటి మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈరోజు వెలువడే ఎంపిటిసి, జడ్పిటిసి ఫలితాల సరళిలో తెలంగాణలో మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో తెలిసిన ఫలితాలు జిల్లాల వారీగా ఈ దిగువన ఇస్తున్నాం. జిల్లా ప్రకటించిన ఎంపిటిసిలు కాంగ్రెస్ టిఆర్ఎస్ టిడిపి ఇతరులు ఖమ్మం 396 55 170 171 కరీంనగర్ 817 281 346 35 154 వరంగల్ 274 108 87 51 18 మెదక్ 270 117 100 25 4 నిజామబాద్ 211 56 125 5 25 ఆదిలాబాద్ 636 161 289 63 72 నల్గొండ 520 252 86 83 56 రంగారెడ్డి 571 232 144 101 97 మహబూబ్ నగర్ 507 220 142 90 70 -
ప్రాదేశిక ఫలితాలు తేలేది నేడే
-
పరిషత్ ఫలితాలు నేడే
ఇందూరు, న్యూస్‌లైన్: అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఫలితాల సీజన్ రానే వచ్చింది. సోమవారం మున్సిపల్ ఫలితాలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. బ్యాలెట్ బాక్సులలో దాగున్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. జిల్లాలో 36 జడ్పీటీసీ, 583 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించేందుకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో లెక్కింపు ప్రారంభం కానుంది. నిజామాబాద్ డివిజన్లోని 14 మండలాలకు సంబంధించి డిచ్పల్లి మండలం ధర్మారంలోని తిరుమల నర్సింగ్ కళాశాలలో, బోధన్ డివిజన్ 12 మండలాల ఓట్లను ఆచన్‌పల్లి ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో, కామారెడ్డి డివిజన్లోని 10 మండలాల ఓట్లను సదాశివనగర్ మండలం మర్కల్‌లోని విజయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం ఈ మూడు కేంద్రాలలో 60 గదులను గుర్తించి కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. లెక్కింపు పక్రియ వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి ప్రతీ ఎంపీటీసీ స్థానానికి ఒక కౌంటింగ్ టేబుల్‌ను ఏర్పాటు చేశారు. లెక్కింపు ప్రక్రియను వీడియో కెమెరాలతో చిత్రీకరిస్తారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ఫలితాలు వెల్లడించడానికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఒక్కో ఎంపీటీసీ కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, ముగ్గురు అసిస్టెంట్లు, ఒక అటెండర్, ఆర్వోలు మొత్తం దాదాపు మూడు వేలకు పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. ప్రతీ రౌండ్‌కు సంబంధించిన ఓట్ల వివరాలు కౌంటింగ్ టేబుల్వారిగా షీట్లలో నమోదు చేసిన సిబ్బంది, అధికారులు ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేస్తారు. సెల్ఫోన్లతో నో ఎంట్రీ ఒక కౌంటింగ్ టేబుల్‌కు అభ్యర్థితోపాటు, ఒక ఏజెంటును మాత్రమే లోనికి అనుమతిస్తారు. రిటర్నింగ్ అధికారి తప్ప మిగతా కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు ఎవరు కూడా సెల్‌ఫోన్‌తో లోనికి వెళ్లరాదు. ఒక్కసారి లోపలికి వెళ్లిన వారు మళ్లీ బయటకు రావాలంటే రిటర్నింగ్ అధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. టీ, టిఫిన్, భోజనంలాంటివి లోపలికి అనుమతించరు. పోలీసు బందోబస్తు మూడు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసు శాఖ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. డీఎస్పీలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, ప్రత్యేక పోలీసు బలగాలు మొత్తంగా దాదాపు 260కి పైగా సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తారు. -
నేడు ప్రాదేశిక ఫలితాలు
డివిజన్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు - ఉదయం 10 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం - మధ్యాహ్నం 3గంటల్లోగా ఎంపీటీసీ ఫలితాలు - రాత్రి వరకు కొనసాగనున్న జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు - కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు - గెలుపు సంబరాలు, మద్యం దుకాణాలు బంద్ నల్లగొండ, న్యూస్‌లైన్, ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవి తవ్యం మంగళవారం తేలనుంది. ఈ ఓట్ల లెక్కింపు ఐదు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో చేపట్టనున్నారు. జిల్లావ్యాప్తంగా 59 జెడ్పీటీసీ స్థానాలకు 392 పోటీలో ఉండగా, 835 ఎంపీటీసీ స్థానాలకు ప్రధాన పార్టీలతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 3,311మంది పోటీ చేశారు. తొలి విడత ఎన్నికలు ఏప్రిల్ 6వ తేదీన సూర్యాపేట, మిర్యాలగూడ, దేవరకొండ డివిజన్లలో జరిగాయి. రెండో విడత 11వ తేదీన నల్లగొండ, భువనగిరి డివిజన్ పరిధిలోని మండలాలకు జరిగాయి. ఎన్నికల ఫలితాల కోసం ఎదరుచూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. ఉదయం 7.30 గంటలకు ఆయా డివిజన్ కేంద్రాల్లో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు ఆ తర్వాత 10గంటల నుంచి బ్యాలెట్ బాక్సులు తెరిచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఎన్నికల కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల్లో 484 టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ నిర్వహణకు రెండువేల మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు, ఇతర సిబ్బంది ఉన్నారు. లెక్కింపు ఇలా.. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఓట్ల లెక్కింపు కోసం ఐదు కేంద్రాల్లో ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ముందుగా ఆయా గ్రామాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను అభ్యర్థులకు చెందిన ఏజెంట్ల సమక్షంలో సీల్ తీస్తారు. ఇలా తీసిన బాక్సుల్లో ఓట్లను ఒక కుప్పగా వేసి అందులోంచి జెడ్పీటీసీకి కేటాయించిన తెల్లరంగు బ్యాలెట్, ఎంపీటీసీకి కేటాయించిన గులాబీ రంగు బ్యాలెట్లను వేరుచేస్తారు. వేరుచేసిన బ్యాలెట్ పేపర్లను ఆయా గుర్తులతో ముందుగానే సిద్ధం చేసిన ట్రేలల్లో వేస్తారు. ఇలా వేరు చేయడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది. పూర్తిస్థాయి లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభిస్తారు. ప్రతి ఎంపీటీసీ స్థానం లెక్కింపు మూడురౌండ్లుగా జరుగుతుంది. ఒక్కో రౌండ్‌కు సుమారు వెయ్యి ఓట్లను లెక్కపెడతారు. ప్రతి గంటకు ఒకసారి ఓట్ల లెక్కించిన వివరాలను ఏజెంట్లకు, మీడియాకు సమాచారం అందిస్తారు. మధ్యాహ్నం 3 గంటవరకు ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. జెడ్పీటీసీల లెక్కింపు రాత్రి వరకు పూర్తికావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 25ఓట్లను ఒక బండిల్‌గా కట్టి ఓట్లను లెక్కపెడతారు. ఇలా చేయడం వల్ల లెక్కింపు సులువుగా ఉండడమే గాకుండా, త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. పకడ్బందీ బందోబస్తు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలూ చోటుచేసుకోకుండా ఉండేందుకు జిల్లా పోలీస్ శాఖ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగానే మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మినహా మిగతా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. అలాగే ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు గెలుపు సంబరాలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధించారు.