ఫలితాలు మంచి ఊపునిచ్చాయి: అంబటి | Local body polls results give relief to YSRCP, says Ambati Rambabu | Sakshi
Sakshi News home page

ఫలితాలు మంచి ఊపునిచ్చాయి: అంబటి

Published Wed, May 14 2014 3:17 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

ఫలితాలు మంచి ఊపునిచ్చాయి: అంబటి - Sakshi

ఫలితాలు మంచి ఊపునిచ్చాయి: అంబటి

* తొలిసారి ఎన్నికల్లోనే గ్రామీణ ఓటర్లలో పట్టు సాధించాం
* ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై అంబటి
* జనభేరీ ప్రారంభించే నాటికే స్థానిక పోరు ముగిసింది
* అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలు మాకు అను కూలంగా ఉంటాయి

 
 సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల బరిలో తొలిసారి రంగప్రవేశం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు తాజా జడ్పీటీసీ, ఎంపీటీసీల ఫలితాలపట్ల ఆ పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ నిర్మాణం పూర్తిగా జరక్కముందే తొలిసారి ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ గ్రామీణ ఓటర్లలో పార్టీ పట్టు సాధించడం పార్టీలో మ రింత ఆత్మస్థయిర్యాన్ని పెంచిందని తెలిపారు. సీమాం ధ్రలోని మొత్తం 653 జడ్పీటీసీల్లో 50 నుంచి 60 జడ్పీటీసీల వ్యత్యాసంతో ఏడెనిమిది జిల్లా పరిషత్‌లు వైఎస్సార్‌సీపీ చేజారాయని పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించేవి కావని, వీటికి సాధారణ ఎన్నికలకు ఎంతో వ్య త్యాసం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
 
 ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజులకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, ఈ నెల రోజుల వ్యత్యాసంలో వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్రలో విస్తృతంగా వ్యాప్తి చెంది పుంజుకున్నదని మంగళవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విశ్లేషిం చారు. మరో రెండు రోజుల్లో వెలువడే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయన్న విశ్వాసం తమకుందని ధీమా వ్యక్తంచేశారు. ఇంకా ఆయనేమన్నారంటే...
 
  పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన సమయంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఒకటిరెండు రోజుల్లోనే అకస్మాత్తుగా స్థానిక సంస్థల ఎ న్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అయినప్పటికీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసి ఈ స్థాయిలో ఫలితాలు సాధించడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. 10,092 ఎంపీటీసీల్లో 44 శాతం సీట్లను మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పార్టీ దక్కించుకుంటే... మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన మా పార్టీ 37 శాతం సీట్లు సాధించుకుంది. 19 శాతం ఇతర పార్టీలు గెలుచుకున్నాయి.
 
  పార్టీ నిర్మాణమే లేని దశలో వచ్చి పడిన ఎన్నికలను ఎదుర్కొనడం ఏ పార్టీకైనా కత్తిమీద సాము లాంటిదే. అలాంటిది 653 జడ్పీటీసీల్లో దాదాపు సగభాగం స్థానాలు గెలుచుకోవడం సాధారణ విషయం కాదు. మంగళవారం అర్ధరాత్రి వరకు అందిన ఫలితాలను బట్టి మొత్తం జడ్పీటీసీల్లో టీడీపీ 53 శాతం సీట్లను సాధించగా... వైఎస్సార్ సీపీ 46 శాతం సీట్లు సాధించింది. మాకన్నా 50 జడ్పీటీసీ స్థానాలను అదనంగా గెల్చుకున్న టీడీపీ 9 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్నప్పటికీ... ఓట్ల పరంగా, సీట్ల పరంగా మా పార్టీది గొప్ప విజయంగా చెప్పుకోవాలి.
 
  సాధారణ ఎన్నికల ఘట్టం ఊపందుకోవడానికి ముందుగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలపై ఉండబోవు. ఏప్రిల్ 6, 11 వ తేదీల్లో రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఆ తర్వాత నెల రోజులకు సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ నెల రోజుల్లోపు సీమాంధ్ర ఓటర్లలో ఎంతో వ్యత్యాసం క నిపించింది. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాల ప్రభావం పెద్దగా ఉండదు. స్థానికంగా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల ప్రభావం ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుంది.
 
  పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత 12 వ తేదీన లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. 14 వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో పాటు పార్టీ అధ్యక్షుడు జగన్ జనభేరీ పేరుతో ప్రచారం ప్రారంభించారు. జగన్‌తో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సోదరి షర్మిల మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సామాజిక సమతూకం పాటిస్తూ పార్టీ టికెట్లను ఖరారు చేయడం, పార్టీ ముఖ్య ప్రచారకర్తల విస్తృత ప్రచారం, పార్టీ శ్రేణుల ంతా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొనడం వంటి అంశాలు వైఎస్సార్‌సీపీ గెలుపు ధీమాను పెంచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement