Panchayat Raj elections
-
రిజర్వేషన్లు తగ్గిస్తే ‘పంచాయితే’
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గిస్తే ఊరుకోబోమని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. తక్షణమే బీసీల రిజర్వేషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు యథావిధిగా 34 శాతంగా అమలు చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండాలంటే రాష్ట్ర కేబినెట్ తీర్మానం ప్రకారం వెంటనే బీసీ జనగణన నిర్వహించి బీసీల జనాభా లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషిని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కాంగ్రెస్ మాజీ ఎంపీ వీహెచ్, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, కాసాని జ్ఞానేశ్వర్, లెఫ్ట్, ఇంటిపార్టీ నేతలు కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో లక్ష్మణ్ మాట్లాడుతూ బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి బీసీలను రాజకీయంగా అణచివేసే ప్రక్రియను టీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిందని ఆరోపించారు. బీసీ జనగణన లెక్కలు లేకపోవడంతో కోర్టు తీర్పులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వస్తున్నాయని, సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లను యథావిధిగా అమలు చేయాలని అన్నారు. ఎల్.రమణ మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు రావడంతో తెలంగాణలో దొరల, పటేళ్ల రాజ్యం తగ్గిందని, ఇప్పుడు ఆ రిజర్వేషన్లు తగ్గించి మళ్లీ పెత్తందారీ వ్యవస్థ పెరిగేలా చూస్తున్నారని వాపోయారు. దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. రిజర్వేషన్లు తగ్గిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీసీల రిజర్వేషన్లు ఎందుకు తగ్గించారు... పొన్నాల, వీహెచ్ మాట్లాడుతూ బీసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఎవరికీ రిజర్వేషన్లు తగ్గించకుండా బీసీల మాత్రమే ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు. గొర్రెలు, బర్రెలు కాయడానికే బీసీలుండాలని కేసీఆర్ భావిస్తున్నారా.. అని ప్రశ్నించారు. కలెక్టరేట్ల ముట్టడికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ మద్దతు ప్రకటించారని తెలిపారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ రెండో సారి సీఎం అయ్యాక ప్రధాని నరేంద్రమోదీని కలసి 16 డిమాండ్లు అడిగినప్పుడు బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. దీనిపై కనీసం చర్చకు రాకపోవడం బీసీలను మోసం చేయడమేనన్నారు. శనివారం జరిగే రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ల ముట్టడి యథా తథంగా ఉంటుందన్నారు. జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు దామాషా ప్రకారం పెంచేదిపోయి తగ్గించడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు పాండురంగాచారి, టీజేపీ నేత ప్రకాశ్, బీసీ నేతలు ఎస్. దుర్గయ్య, తాటికొండ విక్రంగౌడ్, గొడుగు మహేశ్, కొటికే రాము, కొప్పుల చందు, లక్ష్మణ్, రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీల అణచివేతకు ప్రభుత్వం కుట్ర’
హైదరాబాద్: పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి బీసీల నాయకత్వాన్ని అణచివేసేం దుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్ (ప్రెస్‌క్లబ్)లో 12 బీసీ సంఘాల ప్రతినిధులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 2010లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాకు గా చూపిస్తూ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయాలని చూస్తోందన్నారు. పంచాయతీరాజ్ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగ్గించిన బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఈ నెల 28న అన్ని జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎమ్మార్వో ఆఫీసుల ఎదుట ధర్నాలు చేయాలన్నారు. అదేరోజు అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో కుల, బీసీ సం ఘాలతో రౌండ్‌టేబుల్ సదస్సులు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బీసీల వినతులను సీఎం తిరస్కరించారు: జాజుల
హైదరాబాద్: పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అంశంపై సీఎం కేసీఆర్‌కు అఖిలపక్ష పార్టీలు, న్యాయనిపుణులు, బీసీ సంఘాల నేతలు వినతి పత్రాలను సమర్పిస్తే వాటిని పెడచెవిన పెట్టి ఫెడ రల్ ఫ్రంట్ అంటూ విమానం ఎక్కారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బీసీల వినతులను సీఎం తిరస్కరించారని ఆరోపించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఈ నెల 26న అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, న్యాయ నిపుణులతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29న 31 జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి మొదటి వారంలో లక్ష మందితో హైదరాబాద్‌లో ఆత్మగౌరవసభ నిర్వహిస్తామని, అప్పుడు కూడా ప్రభుత్వం దిగిరాకపోతే జనవరి రెండో వారంలో రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్.దుర్గయ్య గౌడ్, తాటికొండ విక్రం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల తగ్గింపు చరిత్రాత్మక తప్పిదం.. బీసీల రిజర్వేషన్లను 34 శా తం నుంచి 23 శాతానికి తగ్గించడం ప్రభుత్వం చేస్తు న్న చరిత్రాత్మక తప్పిదం అని జాజుల విమర్శించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సబ్‌ప్లాన్ కమిటీ, ఎంబీసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో జాజుల మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఇచ్చే గిఫ్ట్‌ను సీఎం కేసీఆర్ బీసీలకు ఇచ్చాడా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇదేనన్నారు. బీసీల రిజర్వేషన్లకు గండికొడితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో బీసీ సబ్‌ప్లాన్ సాధన కమిటీ చైర్మన్ ప్రొఫె సర్ కె.మురళీమనోహర్, ఎంబీసీ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పైళ్ల ఆశయ్య, సామాజికవేత్త ఉ.సాంబశివరావు, బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి గ్రేటర్ నేత కిల్లే గోపాల్, ఎంబీసీ సంఘం నేత ప్రొ. సుదర్శన్‌రావు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
పంచాయతీ తేలేనా?
-
ఫలితాలు మంచి ఊపునిచ్చాయి: అంబటి
* తొలిసారి ఎన్నికల్లోనే గ్రామీణ ఓటర్లలో పట్టు సాధించాం * ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై అంబటి * జనభేరీ ప్రారంభించే నాటికే స్థానిక పోరు ముగిసింది * అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలు మాకు అను కూలంగా ఉంటాయి సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల బరిలో తొలిసారి రంగప్రవేశం చేసిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు తాజా జడ్పీటీసీ, ఎంపీటీసీల ఫలితాలపట్ల ఆ పార్టీ నేతలు సంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ నిర్మాణం పూర్తిగా జరక్కముందే తొలిసారి ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ గ్రామీణ ఓటర్లలో పార్టీ పట్టు సాధించడం పార్టీలో మ రింత ఆత్మస్థయిర్యాన్ని పెంచిందని తెలిపారు. సీమాం ధ్రలోని మొత్తం 653 జడ్పీటీసీల్లో 50 నుంచి 60 జడ్పీటీసీల వ్యత్యాసంతో ఏడెనిమిది జిల్లా పరిషత్‌లు వైఎస్సార్సీపీ చేజారాయని పేర్కొన్నారు. మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు ముఖ్యమంత్రి ఎవరన్నది నిర్ణయించేవి కావని, వీటికి సాధారణ ఎన్నికలకు ఎంతో వ్య త్యాసం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజులకు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని, ఈ నెల రోజుల వ్యత్యాసంలో వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్రలో విస్తృతంగా వ్యాప్తి చెంది పుంజుకున్నదని మంగళవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విశ్లేషిం చారు. మరో రెండు రోజుల్లో వెలువడే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయన్న విశ్వాసం తమకుందని ధీమా వ్యక్తంచేశారు. ఇంకా ఆయనేమన్నారంటే... పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన సమయంలో సుప్రీంకోర్టు తీర్పుతో ఒకటిరెండు రోజుల్లోనే అకస్మాత్తుగా స్థానిక సంస్థల ఎ న్నికల నోటిఫికేషన్ జారీ అయింది. అయినప్పటికీ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసి ఈ స్థాయిలో ఫలితాలు సాధించడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. 10,092 ఎంపీటీసీల్లో 44 శాతం సీట్లను మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పార్టీ దక్కించుకుంటే... మొదటిసారి ఎన్నికల బరిలో దిగిన మా పార్టీ 37 శాతం సీట్లు సాధించుకుంది. 19 శాతం ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. పార్టీ నిర్మాణమే లేని దశలో వచ్చి పడిన ఎన్నికలను ఎదుర్కొనడం ఏ పార్టీకైనా కత్తిమీద సాము లాంటిదే. అలాంటిది 653 జడ్పీటీసీల్లో దాదాపు సగభాగం స్థానాలు గెలుచుకోవడం సాధారణ విషయం కాదు. మంగళవారం అర్ధరాత్రి వరకు అందిన ఫలితాలను బట్టి మొత్తం జడ్పీటీసీల్లో టీడీపీ 53 శాతం సీట్లను సాధించగా... వైఎస్సార్ సీపీ 46 శాతం సీట్లు సాధించింది. మాకన్నా 50 జడ్పీటీసీ స్థానాలను అదనంగా గెల్చుకున్న టీడీపీ 9 జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకున్నప్పటికీ... ఓట్ల పరంగా, సీట్ల పరంగా మా పార్టీది గొప్ప విజయంగా చెప్పుకోవాలి. సాధారణ ఎన్నికల ఘట్టం ఊపందుకోవడానికి ముందుగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలపై ఉండబోవు. ఏప్రిల్ 6, 11 వ తేదీల్లో రెండు విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఆ తర్వాత నెల రోజులకు సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ నెల రోజుల్లోపు సీమాంధ్ర ఓటర్లలో ఎంతో వ్యత్యాసం క నిపించింది. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాల ప్రభావం పెద్దగా ఉండదు. స్థానికంగా ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల ప్రభావం ఈ ఎన్నికల్లో ఎక్కువగా ఉంటుంది. పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత 12 వ తేదీన లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. 14 వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో పాటు పార్టీ అధ్యక్షుడు జగన్ జనభేరీ పేరుతో ప్రచారం ప్రారంభించారు. జగన్‌తో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, సోదరి షర్మిల మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సామాజిక సమతూకం పాటిస్తూ పార్టీ టికెట్లను ఖరారు చేయడం, పార్టీ ముఖ్య ప్రచారకర్తల విస్తృత ప్రచారం, పార్టీ శ్రేణుల ంతా ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొనడం వంటి అంశాలు వైఎస్సార్సీపీ గెలుపు ధీమాను పెంచాయి. -
అన్యాయానికి జవాబు చెబుదాం!: విజయమ్మ
* వైఎస్సార్సీపీ 3వ ఆవిర్భావ దినోత్సవంలో శ్రేణులకు విజయమ్మ పిలుపు * వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆశీర్వదించండి * సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో ఘన విజయం సాధిద్దాం.. సువర్ణయుగం తీసుకొద్దాం * ఎన్నో పార్టీలు పుట్టుకొస్తున్నా.. వైఎస్సార్ సీపీ ఒక్కటే ప్రజల తరఫున పోరాడుతోంది * ఏ ప్రాంతంలో ఉన్నా అంతా తెలుగువారమే.. రెండు ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం పార్టీ పాటుపడుతుంది సాక్షి, హైదరాబాద్: ‘‘నాలుగున్నరేళ్లుగా మనం ఎన్నో అవమానాలకు, అన్యాయాలకు గురయ్యాం. వాటన్నింటికీ ఈరోజు జవాబు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌కు అఖండ విజయాన్ని చేకూర్చడం ఈరోజు మన ముందున్న కర్తవ్యం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ముందుండి కృషి చేయాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఆవిర్భవించి మూడేళ్లయిన సందర్భంగా బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవంలో ఆమె మాట్లాడారు. ‘శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు సమయం ఇక రెండు నెలలే ఉంది, మీ మనిషిగా, జగన్ తల్లిగా, మహానేత వైఎస్ భార్యగా ఇవాళ ప్రజలందరికీ ఒకే ఒక మాట చెబుతున్నా... వైఎస్ గుణాలను పుణికిపుచ్చుకుని తన తండ్రి కలలను నెరవేర్చడానికి ముందుకు వస్తున్న జగన్‌ను ఆశీర్వదించండి’ అని కోరారు. వైఎస్లోని దీక్ష, పట్టుదల జగన్‌లో ఉన్నాయని, నాలుగున్నరే ళ్ల పోరాటంలో జగన్‌ను చూసినపుడల్లా వైఎస్‌ను చూసినట్లే అనిపిస్తూ ఉందని ఆమె అన్నారు. ఇవాళ ఎన్నో పార్టీలు పుట్టుకొస్తున్నాయని, కానీ వైఎస్సార్ సీపీ ఒక్కటే విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి చిత్తశుద్ధితో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతోందని అన్నారు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పోరాడాలి.. అందరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలు ఒకేసారి తెచ్చినా మొక్కవోని విశ్వాసంతో ఘన విజయం సాధించేందుకు పోరాడాలని విజయమ్మ పిలుపునిచ్చారు. విభేదాలుంటే తాత్కాలికంగా పక్కనబెట్టి పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. ఎన్నికల వల్లనే వ్యవస్థాపక దినోత్సవాన్ని నిరాడంబరంగా జరుపుకొంటున్నామని, ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చేది వైఎస్సార్ సీపీయే కనుక ఆరోజు ప్రజల మధ్య ఘనంగా ప్రమాణస్వీకారోత్సవం జరుపుకొందామని విజయమ్మ పార్టీ శ్రేణులను ఉత్సాహ పరిచారు. ఎన్నో ఇబ్బందులు పడ్డాం.. వైఎస్ మరణించిన నాలుగున్నరేళ్లలో లెక్కలేనన్ని ఇబ్బందులు పడి ఎన్నో పోరాటాలు చేశామని విజయమ్మ అన్నారు. జైల్లో ఉండి కూడా జగన్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన చేత యాత్రలు, దీక్షలు, షర్మిల చేత పాదయాత్రలు చేయించారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటం చేశామన్నారు. పోరాటాల్లోనే పుట్టిన వైఎస్సార్ సీపీ ఇప్పటికీ అదే బాటలో నడుస్తోందని విజయమ్మ అన్నారు. పార్టీ పెట్టినపుడు తనతో వచ్చే వారికి మూడేళ్లు కష్టాలు తప్పవని జగన్ అన్నారని, ఆ తరువాత 30 ఏళ్ల పాటు సువర్ణయుగాన్ని తెచ్చుకుందామని కూడా పేర్కొన్నారని, దాన్ని సాకారం చేసుకుందామని అన్నారు. వైఎస్ రెక్కల కష్టంతో తెచ్చిన అధికారాన్ని అనుభవించిన ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లుగా ప్రజలను విస్మరించి, ఇపుడు డిపాజిట్ కోల్పోయే స్థితి తెచ్చుకుందన్నారు. బాబు ప్రజలకు ఒక్క మంచి పనైనా చేశారా? తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు తన పాలనలో ప్రజలకు పనికి వచ్చే ఒక్క మంచి పనైనా చేశారా అని విజయమ్మ ప్రశ్నించారు. ఒక ప్రాజెక్టుగాని, ఒక్క ఫ్యాక్టరీగాని ఆయన నిర్మించలేదన్నారు. తన పాలన ను తిరిగి తెస్తానని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబు చేయలేకపోతున్నారని విజయమ్మ విమర్శించారు. ఎఫ్‌డీఐలపై ఓటింగ్ , అవిశ్వాసం వంటి విషయాల్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై పనిచేశారన్నారు. ఇది చాలక లేఖను ఇచ్చి రాష్ట్ర విభజనకు సహకరించారని ఆమె దుయ్యబట్టారు. చివరి వరకూ పదవిని అంటిపెట్టుకున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇపుడు తాను సమైక్య చాంపియన్ అని చెబుతున్నారన్నారు. విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఎన్ని పోరాటాలు చేసినా కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయి విడదీశాయన్నారు. విభజనకు వ్యతిరేకంగా మనం సుప్రీంకోర్టులో పోరాడుతున్నామన్నారు. భూభాగాన్ని విడదీసినా తెలుగువారిని వేరు చేయలేరని ఏ ప్రాంతం వారికి కష్టం వచ్చినా మరో ప్రాంతం వారు ఆదుకుంటారని జగన్ చెప్పారని ఆమె గుర్తు చేశారు. అలాగే ఇరు ప్రాంతాల ప్రజల హృదయాల నుంచి వైఎస్‌ను తుడిచి వేయలేరన్నారు. ‘‘ఈరోజు నేను నా కుమారుడి తరఫున మీ అందరికీ మాట ఇస్తున్నా.. రెండు ప్రాంతాల్లో ఉన్నా అందరమూ తెలుగు వారమే.. మనదంతా తెలుగుజాతి. ఏరోజు కూడా మనంతట మనం విడిపోలేదు. జర్మనీ, బ్రిటిష్ వారికి యుద్ధం వస్తే వారి కోసం మనల్ని ఒకప్పుడు విడదీశారు. ఈరోజు అదే ఇటలీ వాళ్లు ఓట్లు, సీట్ల కోసం విడగొట్టారు. అయినా రెండు ప్రాంతాల ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ సీపీ పాటుపడుతుంది.’’ - వైఎస్ విజయమ్మ -
మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలకు వైఎస్సార్సీపీ పరిశీలకులు వీరే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగనున్న మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికల పర్యవేక్షణకుగాను లోక్‌సభ నియోజకవర్గాలవారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదలైంది. వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళం-కొయ్య ప్రసాద్‌రెడ్డి, విజయనగరం-ఎం.వి.కృష్ణారావు, అరకు-బొగ్గు లక్ష్మణరావు, విశాఖపట్నం-పిరియా సాయిరాజ్, అనకాపల్లి-సుజయ్‌కృష్ణ రంగారావు, ఏలూరు-దొరబాబు(విశాఖ), నర్సాపురం-జి.ఎస్.రావు, అమలాపురం-ఐ.రామకృష్ణంరాజు, కాకినాడ-ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి-దాడి వీరభద్రరావు, మచిలీపట్నం-జ్యోతుల నెహ్రూ, విజయవాడ-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు- జహీర్ అహ్మద్, నర్సారావుపేట-బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల-గుదిబండ చిన వెంకటరెడ్డి, ఒంగోలు-మేకపాటి గౌతమ్‌రెడ్డి, నెల్లూరు-జ్ఞానేంద్రరెడ్డి, తిరుపతి-కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, చిత్తూరు-వైఎస్ వివేకానందరెడ్డి, కడప-వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట-బి.కరుణాకర్‌రెడ్డి, అనంతపురం-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హిందూపూర్-పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు-దేశాయి తిప్పారెడ్డి(ఎమ్మెల్సీ), నంద్యాల-దేవగుడి నారాయణరెడ్డి(ఎమ్మెల్సీ), ఖమ్మం-పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్-గున్నం నాగిరెడ్డి, నల్లగొండ-వి.బాలమణెమ్మ, రంగారెడ్డి-గాదె నిరంజన్‌రెడ్డి, వరంగల్-జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మెదక్-శ్రవణ్ కుమార్‌రెడ్డి, నిజామాబాద్-నాయుడు ప్రకాష్, కరీంనగర్-కొండా రాఘవరెడ్డి, ఆదిలాబాద్-వినాయక్‌రెడ్డి నియమితులయ్యారు.