హైదరాబాద్: పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించి బీసీల నాయకత్వాన్ని అణచివేసేం దుకు కేసీఆర్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్ (ప్రెస్‌క్లబ్)లో 12 బీసీ సంఘాల ప్రతినిధులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 2010లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సాకు గా చూపిస్తూ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయాలని చూస్తోందన్నారు. పంచాయతీరాజ్ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తగ్గించిన బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచి ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఈ నెల 28న అన్ని జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో, ఎమ్మార్వో ఆఫీసుల ఎదుట ధర్నాలు చేయాలన్నారు. అదేరోజు అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో కుల, బీసీ సం ఘాలతో రౌండ్‌టేబుల్ సదస్సులు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, బీసీ, ఉద్యోగ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment