జైట్లీ కోసం సునీల్ షెట్టీ ప్రచారం | Sunil Shetty campaigns for Jaitley | Sakshi
Sakshi News home page

జైట్లీ కోసం సునీల్ షెట్టీ ప్రచారం

Published Fri, Apr 11 2014 2:49 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

జైట్లీ కోసం సునీల్ షెట్టీ ప్రచారం - Sakshi

జైట్లీ కోసం సునీల్ షెట్టీ ప్రచారం

ఎన్నికల వేళ ఒక వైపు ఓటర్లు రాజకీయనాయకులకు చుక్కలు చూపిస్తారు. నాయకుల కోసం తారలు దిగివస్తాయి. ఒక వైపు తన రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్న బిజెపి అగ్రనేతకు ఓటర్లు చుక్కలు చూపిస్తుంటే, ఆయనకు మద్దతుగా బాలీవుడ్ హీరో సునీల్ షెట్టి రంగంలోకి దిగారు. కాషాయ కండువాతో కమలనాథుని పక్కనే కూర్చున్నారు కూడా.


అమృత్ సర్ లోని ఒక గ్రామంలో జైట్లీ ప్రచారం చేస్తూండగా, సునీల్ షెట్టి నాటకీయంగా స్టేజీ మీదకు వచ్చారు. అంతే కాదు. మైకు లాక్కుని అరుణ్ జైట్లీ మంచి నేత. ఆయన్ని గెలిపిస్తే దేశానికి మేలు జరుగుతుంది. ఆయనకు ఓటేయండి' అని ప్రకటించాడు.


అంతేకాదు. నరేంద్ర మోడీకి ఓటేయమని ప్రజలను కోరారు సునీల్ షెట్టి. 'దేశం మార్పు కోరుతోంది. అందుకే అందరూ మోడీని కోరుకుంటున్నారు.' అన్నారు సునీల్ షెట్టి. జైట్లీ పక్కన కాషాయ కండువా వేసుకుని మరీ కూర్చున్నారు సునీల్ షెట్టి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement