
తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు అతిగా ప్రవర్తించారు. వారి దుందుడుకు వ్యవహారం పోలీసులు లాఠీఛార్జి చేసుకునేవరకు వెళ్లింది. తెలుగు తమ్ముళ్లు మూకుమ్మడిగా నామినేషన్ కేంద్రంలోకి చొచ్చుకువెళ్లడానికి ప్రయత్నించారు.
పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో తెలుగు తమ్ముళ్లు పోలీసులపై చెప్పులు విసిరారు. దాంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు.