తెలుగుదేశం పార్టీ జాబితా ఒక్కసారి చూస్తే చాలు.. అంతా నోళ్లు వెళ్లబెడుతున్నారు. నరసరావుపేట నుంచి రాయపాటి సాంబశివరావు, అనంతపురం లోక్సభ నుంచి జేసీ దివాకర్ రెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, పులివెందులలో సతీష్ రెడ్డి, చంద్రగిరి నుంచి గల్లా అరుణకుమారి.. ఈ జాబితా చూస్తుంటే కాంగ్రెస్ జాబితా అనిపిస్తోంది కదూ. కానీ, అచ్చంగా ఇదంతా ‘పచ్చ’ పార్టీ జాబితానే! తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన రెండో జాబితా దాదాపుగా కాంగ్రెస్ నాయకులతోనే నిండిపోయింది.
ఇక సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులన్నవాళ్లే దొరకడం లేదు. అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తయిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి చెప్పిన మర్నాడే శుక్రవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ పార్టీకి అభ్యర్థుల కొరత ఉందని ప్రకటించారు. సీమాంధ్ర ప్రాంతంలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే, వాటిలో 75 నియోజకవర్గాలకు కేవలం ఒక్కొక్క అభ్యర్థి మాత్రమే సిద్ధంగా ఉన్నారు. మరికొన్ని చోట్ల వాళ్లు కూడా లేరు. ఎలాగోలా, ఎక్కడో అక్కడ దొరికిన వాళ్లను తీసుకొచ్చి అభ్యర్థులుగా నిలబెట్టి అన్నిచోట్లా పోటీలో ఉన్నాం అనిపించుకోడానికి దిగ్విజయ్ సింగ్ అండ్ కో జుట్టు పీక్కుంటున్నారట.
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల దుస్థితి ఇది. అడ్డగోలుగా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన పాపంలో రెండు పార్టీలకు సమాన భాగస్వామ్యం ఉండటంతో ఈ రెండు పార్టీల వాళ్లు కనిపిస్తే జనం దాదాపు కొట్టేలా ఉన్నారు. దాంతో ఈ పార్టీల తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులు పెద్దగా ముందుకు రావట్లేదు. ఈ ఎఫెక్ట్ జాబితాల మీద స్పష్టంగా కనిపిస్తోంది.
టీడీపీ జాబితాలో అంతా కాంగ్రెసోళ్లే!!
Published Sat, Apr 12 2014 8:45 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement