తోటపల్లిగూడూరు, న్యూస్‌లైన్: తోటపల్లిగూడూరు పంచాయతీ గమళ్లపాళేనికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు సోమవారం రాత్రి వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో మన్నెం రాముగౌడ్, వెంకటరమణయ్య, పుట్టయ్య, ఎంపులూరు రామాంజనేయులు, శీనయ్య, ఉప్పలనారాయణతోపాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు.
వీరందరూ నెల్లూరులోని పార్టీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి నివాసంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చిల్లకూరు సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ టంగుటూరు శ్రీనివాసులరెడ్డి, నాయకులు మన్నెం చిరంజీవి, పెళ్లూరు శ్రీరాములు, మన్నెం సుబ్రహ్మణ్యం, అన్నంహరి ప్రసాద్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీలోకి కాంగ్రెస్, టీడీపీ నాయకులు
Published Tue, Apr 15 2014 3:27 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement