విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గన్నవరం టీడీపీ అభ్యర్థి వంశీమోహన్‌కు నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తోంది. నియోజకవర్గంలో నాలుగు రోజులుగా మారిన సమీకరణాలు, పరిణామాలతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. టీడీపీకి నామినేషన్ల ప్రక్రియకు ముందు ఉన్నంత ఊపులో సగానికి సగం తగ్గిందని పరిశీలకులు భావిస్తున్నారు. దశాబ్ధ కాలంగా ఎడమొఖం పెడముఖంగా ఉన్న దాసరి, వంశీ వర్గాల నాయకుల మధ్య మనసులు కలవలేదని చెబుతున్నారు.
వంశీ ప్రచారంలో దాసరి వర్గీయులు మొక్కుబడిగా పాల్గొంటున్నారనే వార్తలు వినవస్తున్నాయి. వంశీకి వెన్నుపోటు పొడిచేందుకు దాసరి వ ర్గీయులు తెరవెనుక పొంచి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. దీనికితోడు దాసరి కూడా ప్రచారంలో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. మైన్స్, వైన్స్ వ్యాపారంలో పాతుకుపోయిన తెలుగుతమ్ముళ్లు వంశీ వస్తే తమ ఆధిపత్యం కోల్పోవలసి వస్తుందనే ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారు సిండికేట్ అయి సెలైంట్‌గా టీడీపీ అభ్యర్థికి గోతులు తవ్వుతున్నట్లు చెబుతున్నారు. టీడీపీ ప్రచారంలోనూ అంత స్పందన ఉండటం లేదని అంటున్నారు. వంశీ వెనుక ప్రచారంలో కుర్రకారు మినహా పెద్దతలకాయలు లేకపోవడటంతో గన్నవరం ప్రాంత ప్రజలు టీడీపీ అభ్యర్థిపై ఆసక్తి చూపటం లేదంటున్నారు.
సారథిరాకతో టీడీపీకి బీసీల్లో గండి ...
మాజీ మంత్రి కె. పార్థసారథి వైసీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో టీడీపీకి గన్నవరం నియోజకవర్గంలో బీసీ ఓట్లలో భారీగా గండి పడిందంటున్నారు. సామాజికంగా బీసీలు తమ ఆధిపత్యం కోసం సారథి అండతో వైసీపీలో చేరుతున్నారు. పార్థసారథి కూడా గన్నవరంపై ప్రత్యేక దృష్టి సారించి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులను వైసీపీలో చేరుస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా పలువురు మాజీ సర్పంచులు ముఖ్య నాయకులపై మాజీ మంత్రి గురిపెట్టారు.
సీపీఎంతో భారీ నష్టం ...
ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న గన్నవరం నియోజకవర్గంలో చాలా కాలం తర్వాత సీపీఎం పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. సీపీఎం అభ్యర్థిగా కాట్రగడ్డ స్వరూపరాణి భారీ ఎత్తున నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు సీపీఎం, సీపీఐతో కలిసి పోరాడుతోంది. గన్నవరం నియోజకవ వర్గంలో వామపక్షాలకు టీడీపీతో పొత్తులుండేవి. ఈ క్రమంలో సీపీఎం అభిమానులు దాదాపు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసేవారు. ఒక దశలో సీపీఎం అభిమానులు టీడీపీలో మమేకమయ్యారు.
సింబల్ సెంటిమెంట్‌తో సీపీఎం ఎన్నికల బరిలో ప్రచారం చేస్తోంది. ఈ ధపా ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేయటంతో టీడీపీకి భారీగా నష్టం వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీపీఎం గన్నవరం మండలంలో గన్నవరం, దావాజిగూడెం, బుద్దవరం, ముస్తాబాద, సూరంపల్లి, సావరగూడెం, గొల్లనపల్లి, ప్రాంతాల్లో టీడీపీ ఓటింగ్‌కు భారీగా గండి కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఉంగుటూరు మండలంలో ఈ ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, ఉంగుటూరు వెన్నూతల, పెదావుటపల్లి, ఆత్కూరు, తేలప్రోలు, సీతారామపురం, ఆరుగోలను, తదితర గ్రామాల్లో ఎంతోకొంత టీడీపీకి సీపీఎం నష్టం చేస్తుందని అంచనా. అదే విధంగా బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో సీపీఎం ప్రభావం అంతగా లేనప్పటికీ కొంతమేర ఆపార్టీ అభ్యర్థివల్ల టీడీపీ ఓట్లు పోతాయని చెబుతున్నారు.
ఉధృతంగా ైవె ఎస్ గాలి...
నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పేద వర్గాల్లో దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి గాలి ఉధృతంగా వీస్తోంది. ప్రతి గ్రామంలో వైఎస్సార్ పార్టీ అభ్యర్థుల ప్రచారానికి ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఎంపీ అభ్యర్థి కె. పార్థసార థి, ఎమ్మెల్యే అభ్యర్థి దుట్టా రామచంద్రరావుకు ప్రజలు మద్దతు పలుకుతున్నారు. వారిద్దరూ గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని, ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్‌మోహనరెడ్డి బాటలో దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు కృషిచేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. దాంతో గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.
వంశీకి ఎదురు ‘గాలి’
Published Wed, Apr 23 2014 4:46 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement