k parthasarathy
-
‘కేఈకి ఆహ్వానం లేకపోవటం దారుణం!!’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తికి రాజధానిలో జరిగే శ్రీవారి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి ఆహ్వానం లేకపోవటం దారుణమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కే పార్థసారధి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీ వర్గానికి చెందిన కేఈ క్రిష్ణమూర్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్దేశపూర్వకంగానే అవమానించారని పేర్కొన్నారు. దేవాదాయశాఖ మంత్రికి అధికారులు ఆహ్వానం ఇవ్వలేకపోవటం వెనుక సీఎం ఆదేశాలే కారణమని తెలిపారు. గతంలో కూడా అమరావతి శంకుస్థాపన వేదికపై ఒక్క బీసీకి కూడా చోటు కల్పించలేదని మండిపడ్డారు. అమరావతి నిర్ణయాత్మక కమిటీలో కూడా రెవెన్యూ మంత్రిగా వున్న కేఈ క్రిష్ణమూర్తిని నియమించకుండా అవమానించారని చెప్పారు. బలహీన వర్గాలను చిన్నచూపు చూడటం మొదటి నుంచి సీఎం చంద్రబాబుకు అలవాటన్నారు. రానున్న ఎన్నికలలో బీసీలు చంద్రబాబుకు సరైన గుణపాఠం నేర్పుతారని వ్యాఖ్యానించారు. -
పేదోళ్ల మనోభావాలతో చెలగాటమా?
సాక్షి, విజయవాడ: పేదోళ్ల మనోభావాలతో టీడీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, బలహీనవర్గాల పట్ల దారుణంగా ప్రవర్తిస్తోందని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి కె. పార్థసారధి విమర్శించారు. కనీస వేతనాల కోసం విజయవాడ దుర్గగుడిలో ఆందోళన చేస్తున్న క్షురకులకు పార్టీ నాయకులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయాలకు మంచి ఆదాయం ఉన్నా క్షురకుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం నిన్న ప్రభుత్వ పెద్దలను కలిసి అభ్యర్థించినా కనీసం పట్టించుకోలేదని వాపోయారు. ఇది ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు కనీస వేతనం రూ.17 వేలు ఇవ్వాలని ఏపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దవటం యానాదయ్య డిమాండ్ చేశారు. గత మూడు రోజుల నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీస వేతనం లేకుండా ఎలా జీవించాలని ప్రశ్నించారు. సాయంత్రంలోగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు దిగొచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. -
వెన్నుపోటు పొడిచింది టీడీపీ, బీజేపీలే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచి 5 కోట్ల మంది ఆంధ్రులను దారుణంగా మోసగించింది తెలుగుదేశం, బీజేపీలేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఈ దారుణ మోసంలో ఎవరి పాత్ర ఎక్కువ అనేది మాత్రం ఆ పార్టీలే తేల్చుకోవాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరకుండా నాలుగేళ్ల పాటు స్వలాభం కోసం స్వార్థంతో బీజేపీతో అంటకాగి కుట్రలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు యూటర్న్ తీసుకుంటే జనం ఎలా నమ్ముతారనుకుంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్థసారథి మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లలో 29 సార్లు ఢిల్లీ వెళ్లివచ్చానని చెబుతున్న చంద్రబాబు రాష్ట్రానికి ఏమి సాధించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వీరి నటన ముందు ఆస్కార్ నటులూ సరిపోరు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అద్భుతంగా నటిస్తున్నారని, వీరి నటన ముందు ఆస్కార్ అవార్డు పొందిన సినీ నటులు కూడా సరిపోరేమోనని పార్థసారథి ఎద్దేవా చేశారు. వీరేదో ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేసినట్లు.. సాధించలేక ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లుగా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు అబ్బ సొత్తు కాదని, ఐదు కోట్ల మంది ప్రజల గడ్డని పార్థసారథి వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ మధ్య ఉన్న వివాదాన్ని చంద్రబాబు రాష్ట్రానికి ముడిపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. -
‘కేంద్రానికి చంద్రబాబు దాసోహం’
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు టీడీపీ-బీజేపీ చేసిన అన్యాయంపై ప్రజలు భగ్గుమంటున్నారని వైఎస్సార్సీపీ నాయకుడు కె. పార్థసారధి అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కులమతాలకు అతీతంగా ప్రజలంతా రోడెక్కితే సీఎం చంద్రబాబు మాత్రం విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, కేసులకు భయపడి కేంద్రానికి దాసోహమయ్యారని ఆరోపించారు. తన స్వార్థంకోసం రాజీపడ్డారని అన్నారు. టీడీపీ ఎంపీలు కనీస విచక్షణ కూడా లేకుండా పార్లమెంట్లో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ డ్రామాలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని దుయ్యబట్టారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చాయో చంద్రబాబు వెల్లడించాలని పార్థసారధి డిమాండ్ చేశారు. కాగా, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా విపక్షాలు బంద్ నిర్వహించాయి. ప్రజలు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్ సీపీ
-
గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించిన వైఎస్సార్ సీపీ
సాక్షి, హైదరాబాద్: వంగవీటి రంగాపై తమ పార్టీ నేత పూనూరు గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ ఖండించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. గౌతంరెడ్డి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కె. పార్థసారధి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పార్టీ నేతలు ఏ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి వంగవీటి రంగా మంచి స్నేహితుడని గుర్తు చేశారు. వంగవీటి రంగాను తాము ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటామన్నారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలపై తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని పార్థసారధి తెలిపారు. -
అన్న వస్తున్నాడంటే ఉలుకెందుకు?
విజయవాడ: అన్న వస్తున్నాడన్న వైఎస్ జగన్ నినాదాన్ని అందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్ సీపీ నాయకుడు కె. పార్థసారధి తెలిపారు. అన్ని వర్గాలకు తమ అధ్యక్షుడు పరిష్కారాన్ని చూపించారని అన్నారు. ముందున్నాయ్ మంచి రోజులు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్తామని చెప్పారు. పార్టీ నేతలు జోగి రమేశ్, మేరుగ నాగార్జునతో కలిసి ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్లీనరీ విజయవంతమవడంతో టీడీపీ నేతల బట్టలు తడిసిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్లీనరీతో ప్రజలకు భరోసాయిచ్చామని, టీడీపీ నాయకులు ఎందుకు కలవరపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పరిష్కరించే ధైర్యంలేక ప్లీనరీలో అభివృద్ధి కోసం ఏమీ మాట్లాడలేదని తమపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు సర్కారు అవినీతి, అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. ప్రభుత్వ భూములు, ఖనిజ సంపదను దోచుకున్నారని పేర్కొన్నారు. విశాఖలో కొన్ని వేల ఎకరాల భూముల రికార్డులను తారుమారు చేయడం ద్వారా అవినీతి జరిగిందని టీడీపీ వాళ్లే చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వంపై వచ్చిన అవినీతి ఆరోపణలను సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాయలసీమలో కరువు తాండవిస్తోందని మీ పేపర్లే రాస్తున్నాయని అన్నారు. ప్రశాంత్ కిశోర్‌ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోవడాన్ని టీడీపీ నాయకులు తప్పుబట్టడం సరికాదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రజాకర్షణ, మహానేత వైఎస్సార్ పథకాల ఆలంబనతో తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని పార్థసారధి విశ్వాసం వ్యక్తం చేశారు. -
కరువుపై మే 2న వైఎస్ఆర్సీపీ పోరుబాట
కరువు సహాయక చర్యల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ మే 2న పోరుబాట నిర్వహించనుంది. ఆరోజు గుంటూరు జిల్లా మాచర్లలో నిర్వహించే ధర్నాలో పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. ఈ వివరాలను వెల్లడిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె.పార్థసారథి నిప్పులు చెరిగారు. బాబు వస్తే జాబు కాదు కరువు వచ్చిందని ఎద్దేవా చేశారు. కరువు సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు మే2వ తేదీన ఆంధ్రప్రదేశ్-లో ధర్నాలు నిర్వహిస్తున్నట్లు పార్థసారథి తెలిపారు. కరువుపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పోరుబాట నిర్వహిస్తోందన్నారు. మే 2న అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గాల కేంద్రాల్లో ధర్నాలు ఉంటాయని ఆయన చెప్పారు. ఈ ధర్నాలలో పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. -
'కాల్ మనీ - సెక్స్ రాకెట్ పై అసెంబ్లీలో నిలదీస్తాం'
హైదరాబాద్ : కాల్ మనీ - సెక్స్ రాకెట్ అంశంపై తమ పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్ధసారథి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో కె.పార్థసారథి విలేకర్లతో మాట్లాడుతూ.... కాల్ మనీతో సంబంధమున్న వారిని ప్రభుత్వ పెద్దలు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాల్ మనీ నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. కాల్ మనీ వ్యవహారానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కె. పార్థసారథి స్పష్టం చేశారు. ప్రభుత్వం ముందుగానే మేల్కొని ఉంటే ఇలాంటివి జరిగేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. కాల్ మనీ వ్యవహారంపై నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు హామీల వల్లే బ్యాంకులు మహిళలకు రుణాలివ్వడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజలు గత్యంతరం లేక డబ్బులు కోసం కాల్ మనీ వంటి సంస్థలను ఆశ్రయిస్తున్నారని పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. బాక్సైట్ తవ్వకాలపై గిరిజనుల మనోభావాలను తెలియజేసిన తమ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీపై టీడీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని గుర్తు చేశారు. ఇదేనా మహిళలు, గిరిజనుల మీద ఉన్న ప్రేమా అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. -
'కాల్ మనీ - సెక్స్ రాకెట్ పై అసెంబ్లీలో నిలదీస్తాం'
-
'మున్సిపల్ కార్మికులనూ మోసం చేశారు'
-
'మున్సిపల్ కార్మికులనూ మోసం చేశారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు, మహిళలు, విద్యార్థులను నిలువునా ముంచారు... అదే విధంగా మున్సిపల్ కార్మికులను కూడా మోసగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారధి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో పార్థసారధి మాట్లాడుతూ....మున్సిపల్ కార్మికులపై దాడి హేయమైన చర్యగా పార్థసారధి అభివర్ణించారు. ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల ముందు ఒకలా తర్వాత మరోలా వ్యహరించడం చంద్రబాబు నైజం అని ఎద్దేవా చేశారు. తక్షణమే మున్సిపల్ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని చంద్రబాబును కె. పార్థసారధి డిమాండ్ చేశారు. -
దాడిని సీఎం సమర్థించడమా ?
హైదరాబాద్: కృష్ణాజిల్లాలో ఎమ్మార్వో వనజాక్షిపై అధికార పార్టీ ఎమ్మెల్యే దాడి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కె. పార్థసారధి ఖండించారు. ఈ అంశంలో చంద్రబాబు తీరు ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటుగా ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రే సెటిల్మెంట్కు దిగడం దారుణమన్నారు. వనజాక్షి పెట్టిన కేసును నీరుగార్చేందుకు సాక్షాత్తూ చంద్రబాబే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మహిళా అధికారి వనజాక్షిని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈడ్చి పారేసినా పట్టించుకోకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇలా సెటిల్మెంట్లు చేస్తే అధికారులు ఎలా ధైర్యంగా పని చేయగలగుతారని చంద్రబాబును పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. అవినీతిని అడ్డుకున్న ఎమ్మార్వోపై జరిగిన దాడిని సీఎం సమర్థించడమా ? అంటూ పార్థసారధి అశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఇసుక మాఫియాను చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారనేది స్పష్టమయిందన్నారు. వైఎస్ఆర్ సీపీకి చెందిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై దౌర్జన్యంగా కేసులు బనాయించి జైల్లో పెట్టారని గుర్తు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను మాత్రం చంద్రబాబు వెనకేసుకొస్తున్నారని పార్థసారధి విమర్శించారు. -
'ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడ లేదు'
విజయవాడ: తాను ఎలాంటి భూ కబ్జాలకు పాల్పడ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కె.పార్థసారధి స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో పార్థసారధి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మండలం జూపల్లిలో ఉన్న భూమిని 2012లో తన కుమారుడి పేరు మీద కొనుగోలు చేసినట్లు తెలిపారు. తాళ్లపల్లి సుబ్బారావు అనే వ్యక్తి నుంచి సదరు భూమిని కొనుగోలు చేశానని... అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని పార్థసారధి వెల్లడించారు. తాను భూ కబ్జాకు పాల్పడ్డానని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఆ వార్తలు అవాస్తవమన్నారు. సదరు భూమి విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తానని ఆయన చెప్పారు. తాను అక్రమంగా భూమి కొనుగోలు చేశానని కోర్టులో తేలితే సదరు భూమి వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పార్థసారధి ఈ సందర్భంగా ప్రకటించారు. -
‘ధర్నా’పై దాడులు
ప్రజావ్యతిరేక పాలనపై నేడు వైఎస్సార్సీపీ మహాధర్నా ధర్నాలను అడ్డుకునేందుకు దాడులకు తెగబడిన టీడీపీ నేతలను అరెస్టు చేసి నిర్బంధిస్తున్న పోలీసులు కృష్ణాలో పార్థసారథిపై రాళ్లు, ఆయన్నే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పశ్చిమలో కొత్తపల్లి సుబ్బారాయుడు అరెస్టు విశాఖలో జగన్ ధర్నాను అడ్డుకునేందుకు భారీగా పోలీసుల మోహరింపు.. అన్ని జిల్లాల్లోనూ వాహనాలను అడ్డుకోవాలని పోలీసులకు మౌఖిక ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం ప్రభుత్వంపై నిరసన గళం విప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రధానంగా అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోకపోవడం, బాబు వస్తే జాబు వస్తుందని, లేదంటేనిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న హామీ నిలబెట్టుకోకపోవడంపై ఆ పార్టీ సమరశంఖం పూరించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా విశాఖపట్టణం కేంద్రంగా నిర్వహించే మహాధర్నా కార్యక్రమంలో పాల్గొంటుండగా, అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు పార్టీ శ్రేణులు సంసిద్ధమయ్యాయి. ఈ మహాధర్నా ఆందోళన కార్యక్రమాలను అడ్డుకునేందుకు టీడీపీ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కలెక్టరేట్లకు వచ్చే వాహనాలను అడ్డుకుని జనాన్ని దించేయాలని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. మరోవైపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నేతలు రుణమాఫీ నెరవేరిందంటూ సంబరాలు చేసుకుని కవ్వింపులకు దిగారు. కొన్నిచోట్ల బరితెగించి వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు దిగారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికారపార్టీకే వంతపాడుతూ వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టులు చేస్తుండడంతో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా జిల్లా పోరంకిలో వైఎస్సార్సీపీ ధర్నాకు సంబంధించిన బ్యానర్‌ను టీడీపీ నాయకులు పీకేసి దగ్ధం చేశారు. ఆ బ్యానర్ స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛ భారత్ బ్యానర్‌ను కట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, మాజీ మంత్రి కే పార్థసారథి, ఇతర నాయకులు ఆందోళనకు దిగగా... టీడీపీ నాయకులు ఆయన వాహనంపై రాళ్లు రువ్వారు. దీంతో కారు అద్దాలు ధ్వంసం కాగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సమయంలోనే టీడీపీకి చెందిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అక్కడికి వచ్చి వైఎస్సార్సీపీ నేతలను దూషించారు. దీన్ని వైఎస్సార్సీపీ నాయకులు కూడా ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వైసీపీ నాయకులను మీడియాతో మాట్లాడనీయకుండా అదుపులోకి తీసుకుని వ్యానుల్లోకి ఎక్కించి కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ధర్నాకు కార్యకర్తలను తీసుకెళ్లేందుకు బస్సులు ఇస్తామని చెప్పిన ఆర్టీసీ చివరి నిమిషంలో ఇవ్వకుండా అడ్డం తిరగడంతో ఆయన డిపో ఎదుట ధర్నా చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. విశాఖలో భారీగా పోలీసుల మోహరింపు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి శుక్రవారం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్న నేపథ్యంలో ప్రజలనుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ధర్నాలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం 8గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఈ ధర్నా కోసం ఇప్పటికే జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోనూ పార్టీ నిర్వహించిన సన్నాహక సమావేశాలకు కార్యకర్తలతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. రుణమాఫీ అమలు, హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యంపై మండిపడుతున్నారు. తమ కోసం వై.ఎస్.జగన్ గురువారం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు భారీగా తరలివస్తామని స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నం నగరంతోపాటు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా భారీగా ప్రజలు తరలిరానున్నారని నిఘావర్గాలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. వై.ఎస్.జగన్ పాల్గొననున్న ఈ ధర్నా విజయవంతమైతే తమకు ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్న ప్రభుత్వం అడ్డుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది. విశాఖతోపాటు ఇతర జిల్లాల నుంచి వాహనాల్లో ధర్నాకు వచ్చేవారిని అడ్డుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలందినట్లు తెలిసింది. ‘నేవీ డే’ ఉత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా ఈ విషయంపై మాట్లాడినట్లు తెలిసింది. దీంతో ఉన్నట్టుండి రెండు వేలమంది పోలీసులను నగరమంతా మోహరించారు. మరోవైపు విశాఖపట్నంలో ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, ర్యాలీలు, ఇతరత్రా కార్యక్రమాలను నిషేధిస్తూ యాక్ట్ 30ను విధించింది. ఈమేరకు డిసెంబర్ 1వ తేదీతో విడుదల చేసినట్లుగా గురువారం రాత్రి (డిసెంబర్ 4న) ఓ ప్రకటన జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి 31వరకు ఈ నిషేధాజ్ఞలు అమలో ఉంటాయని పేర్కొంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నందున కలెక్టరేట్, జిల్లా పరిషత్తు, ఆంధ్రా విశ్వవిద్యాలయం, జీవీఎంసీ, బీచ్‌రోడ్ తదితర ప్రాంతాల్లో ఈ నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉంటాయని చెప్పింది. ఇంత హడావుడిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించే ధర్నాకు ఒక రోజు ముందే హడావుడిగా ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వ కుట్రను తిప్పికొడతాం ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రభుత్వ కుట్రను అడ్డుకుంటామని తేల్చిచెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పార్టీ రాష్ట్ర పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం స్పష్టం చేశారు. పోలీసు బలం, అధికార జులుంతో ప్రజాబలాన్ని అణచివేయలేరని చెప్పారు. పార్టీ నేతుల, కార్యకర్తలు, ప్రజలు విరివిగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు. -
'సీఎం వ్యాఖ్యలతో రైతుల్లో భయాందోళన'
-
'సీఎం వ్యాఖ్యలతో రైతుల్లో భయాందోళన'
హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి భూముల సేకరణ విషయంలో ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని టీడీపీ ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి ఆరోపించారు. తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. తమ జీవితాలు ఏమైపోవాలని నిలదీస్తున్నారని చెప్పారు. పచ్చటి పొలాలను ఎందుకు నాశనం చేయబోతున్నారని ప్రశ్నిస్తున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్ కు ఒప్పుకోకుంటే భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రైతులను భయాందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. రైతులకు న్యాయం జరగకపోతే వైఎస్సార్ సీపీ వారి తరపున పోరాటం చేస్తుందని హామీయిచ్చారు. తమ పార్టీ రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా కాదని, రైతులకు అండగా నిలబడాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని పార్థసారథి స్పష్టం చేశారు. -
ప్రజాపక్ష పోరాటమే లక్ష్యం
నరసరావుపేటవెస్ట్, న్యూస్‌లైన్ : రైతు రుణమాఫీతో సహా ఎన్నిక ల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వాగ్దానాలన్నీ పకడ్బందీగా అమలు చేసేలా ప్రజల పక్షాన పోరాడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి కె.పార్ధసారధి చెప్పారు. చంద్రబాబు వెంటనే హామీలన్నీ అమలు చేసి ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న రైతులకు పంట రుణాలు ఇప్పించాలని కోరారు. ైరె తు రుణ మాఫీ చేస్తామని ప్రకటించినందున ఎవరూ బకాయిలు చెల్లించాల్సిన పనిలేదన్నారు. నరసరావుపేట పట్టణంలో ఆదివారం నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షానంతరం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి, టీ డీపీ, బీజేపీల్లో చేరుతున్నారంటూ కొన్ని పత్రికలు, చానళ్లు, కొందరు టీడీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కార్యకర్తల మనో ధైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నార ని చెప్పారు. అయినా ఏ నాయకుడు, కార్యకర్త నైతిక స్థైర్యాన్ని కోల్పోలేదని సమీక్షలో స్పష్టమైందన్నారు. పార్టీ పనితీరు, కార్యకర్తల పనితీరు బాగున్నట్టు తేలిందన్నారు. రుణమాఫీపై టీడీపీ ప్రచారం చేయడం, మరికొన్ని ఇతర అంశాలు తమ పార్టీ అధికారంలోకి రాకుండా దెబ్బతీశాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. కార్యకర్తలకు అండగా ఉంటాం.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో మొదటిసారిగా గట్టి ప్రతిపక్షం ఏర్పడిందని పార్ధసారధి చెప్పారు. సుమారు 20 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన టీడీపీకి 2004లో 44 స్థానాలే వచ్చాయని గుర్తుచేశారు. ప్రతి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ దాడులు పెరిగాయని, వారికి ఏమాత్రం నష్టం జరిగినా తగిన మూల్యం చెల్లించాల్సివస్తుందని హెచ్చరించారు. తాము కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. పోలీసులు కూడా చట్టప్రకారం పని చేయాలని హితవు పలికారు. కార్యకర్తలను చంద్రబాబు అదుపులో పెట్టుకోవాలని కోరారు. నేడు గుంటూరులో సమీక్ష: మర్రి రాజశేఖర్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలన్నింటినీ సమీక్షించామని చెప్పారు. తండ్రి కర్మకాండలు నిర్వహించిన గురజాల నియోజకవర్గ కన్వీనర్ జంగా కృష్ణమూర్తి మినహా పోటీచేసిన అభ్యర్థులందరూ సమీక్షకు హాజరయ్యారన్నారు. సోమవారం బాపట్ల నియోజకవర్గంలోని మూడు అసెంబ్లీలు, గుంటూరు పార్లమెంటు స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై గుంటూరులో సమీక్ష జరుగుతుందని చెప్పారు. పార్టీ జయాపజయాలపై సమీక్ష సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు కొందరు ఓడిపోవటానికి, పార్టీ అధికారంలోకి రాలేకపోవటానికి గల కారణాలపై పార్టీ త్రిసభ్య కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి కె.పార్ధసారధి పట్టణంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటమికి కారణాలను కమిటీ దృష్టికి తెచ్చినట్టు తెలిసింది. పకాష్నగర్లోని శుభమ్ ఫంక్షన్ హాలులో మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరిగిన కార్యక్రమంలో తొలుత నరసరావుపేట శాసనసభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఓడిన కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ కన్వీనర్లు కమిటీ ముందు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు. వినుకొండ నుంచి నన్నపనేని సుధ, చిలకలూరిపేట నుంచి మర్రి రాజశేఖర్, పెదకూరపాడు నుంచి బొల్లా బ్రహ్మనాయుడు, నూతలపాటి హనుమయ్య, సత్తెనపల్లి నుంచి పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాచర్ల నుంచి ఎమ్మెల్యే పి.రామకృష్ణారెడ్డిల ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాల నాయకులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు సమీక్షకు హాజరయ్యారు. అందరూ తమ నియోజకవర్గాల వారీగా ప్రధానంగా ఐదు కారణాలు కమిటీ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. రైతు రుణమాఫీ పథకంపై టీడీపీ ప్రచారం, ఆపార్టీ నేతలు అధికంగా డబ్బు పంపిణీ చేయడం, మోడీ ప్రభావం, వైఎస్సార్ సీపీ ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం, మితిమీరిన ఆత్మవిశ్వాసం తదితర కారణాలతో ఓటమి చెందినట్లు చెప్పుకొచ్చారు. పేర్ల వారీగా చెప్పినవన్నీ నమోదు చేసుకున్న పార్ధసారధి పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో నరసరావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసిన ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, పార్టీ ఐటీ వింగ్ అధ్యక్షుడు హర్షవర్ధనరెడ్డి, పార్టీ చైర్మన్ అభ్యర్థి మిట్టపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వంశీకి ఎదురు ‘గాలి’
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గన్నవరం టీడీపీ అభ్యర్థి వంశీమోహన్‌కు నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తోంది. నియోజకవర్గంలో నాలుగు రోజులుగా మారిన సమీకరణాలు, పరిణామాలతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. టీడీపీకి నామినేషన్ల ప్రక్రియకు ముందు ఉన్నంత ఊపులో సగానికి సగం తగ్గిందని పరిశీలకులు భావిస్తున్నారు. దశాబ్ధ కాలంగా ఎడమొఖం పెడముఖంగా ఉన్న దాసరి, వంశీ వర్గాల నాయకుల మధ్య మనసులు కలవలేదని చెబుతున్నారు. వంశీ ప్రచారంలో దాసరి వర్గీయులు మొక్కుబడిగా పాల్గొంటున్నారనే వార్తలు వినవస్తున్నాయి. వంశీకి వెన్నుపోటు పొడిచేందుకు దాసరి వ ర్గీయులు తెరవెనుక పొంచి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. దీనికితోడు దాసరి కూడా ప్రచారంలో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. మైన్స్, వైన్స్ వ్యాపారంలో పాతుకుపోయిన తెలుగుతమ్ముళ్లు వంశీ వస్తే తమ ఆధిపత్యం కోల్పోవలసి వస్తుందనే ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో వారు సిండికేట్ అయి సెలైంట్‌గా టీడీపీ అభ్యర్థికి గోతులు తవ్వుతున్నట్లు చెబుతున్నారు. టీడీపీ ప్రచారంలోనూ అంత స్పందన ఉండటం లేదని అంటున్నారు. వంశీ వెనుక ప్రచారంలో కుర్రకారు మినహా పెద్దతలకాయలు లేకపోవడటంతో గన్నవరం ప్రాంత ప్రజలు టీడీపీ అభ్యర్థిపై ఆసక్తి చూపటం లేదంటున్నారు. సారథిరాకతో టీడీపీకి బీసీల్లో గండి ... మాజీ మంత్రి కె. పార్థసారథి వైసీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగడంతో టీడీపీకి గన్నవరం నియోజకవర్గంలో బీసీ ఓట్లలో భారీగా గండి పడిందంటున్నారు. సామాజికంగా బీసీలు తమ ఆధిపత్యం కోసం సారథి అండతో వైసీపీలో చేరుతున్నారు. పార్థసారథి కూడా గన్నవరంపై ప్రత్యేక దృష్టి సారించి కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులను వైసీపీలో చేరుస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా పలువురు మాజీ సర్పంచులు ముఖ్య నాయకులపై మాజీ మంత్రి గురిపెట్టారు. సీపీఎంతో భారీ నష్టం ... ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న గన్నవరం నియోజకవర్గంలో చాలా కాలం తర్వాత సీపీఎం పార్టీ తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. సీపీఎం అభ్యర్థిగా కాట్రగడ్డ స్వరూపరాణి భారీ ఎత్తున నామినేషన్ వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు సీపీఎం, సీపీఐతో కలిసి పోరాడుతోంది. గన్నవరం నియోజకవ వర్గంలో వామపక్షాలకు టీడీపీతో పొత్తులుండేవి. ఈ క్రమంలో సీపీఎం అభిమానులు దాదాపు సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేసేవారు. ఒక దశలో సీపీఎం అభిమానులు టీడీపీలో మమేకమయ్యారు. సింబల్ సెంటిమెంట్‌తో సీపీఎం ఎన్నికల బరిలో ప్రచారం చేస్తోంది. ఈ ధపా ఎన్నికల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేయటంతో టీడీపీకి భారీగా నష్టం వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సీపీఎం గన్నవరం మండలంలో గన్నవరం, దావాజిగూడెం, బుద్దవరం, ముస్తాబాద, సూరంపల్లి, సావరగూడెం, గొల్లనపల్లి, ప్రాంతాల్లో టీడీపీ ఓటింగ్‌కు భారీగా గండి కొడుతుందని అంచనా వేస్తున్నారు. ఉంగుటూరు మండలంలో ఈ ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ, ఉంగుటూరు వెన్నూతల, పెదావుటపల్లి, ఆత్కూరు, తేలప్రోలు, సీతారామపురం, ఆరుగోలను, తదితర గ్రామాల్లో ఎంతోకొంత టీడీపీకి సీపీఎం నష్టం చేస్తుందని అంచనా. అదే విధంగా బాపులపాడు, విజయవాడ రూరల్ మండలాల్లో సీపీఎం ప్రభావం అంతగా లేనప్పటికీ కొంతమేర ఆపార్టీ అభ్యర్థివల్ల టీడీపీ ఓట్లు పోతాయని చెబుతున్నారు. ఉధృతంగా ైవె ఎస్ గాలి... నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పేద వర్గాల్లో దివంగత నేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి గాలి ఉధృతంగా వీస్తోంది. ప్రతి గ్రామంలో వైఎస్సార్ పార్టీ అభ్యర్థుల ప్రచారానికి ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఎంపీ అభ్యర్థి కె. పార్థసార థి, ఎమ్మెల్యే అభ్యర్థి దుట్టా రామచంద్రరావుకు ప్రజలు మద్దతు పలుకుతున్నారు. వారిద్దరూ గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని, ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి బాటలో దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు కృషిచేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. దాంతో గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. -
'సీమాంధ్ర ప్రజల మనసులతో ఆటలాడున్నాయి'
సీమాంధ్ర ప్రజల మనుసులతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆటలాడుతున్నాయని రాష్ట్ర మంత్రి కె.పార్థసారథి ఆరోపించారు. శనివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. కోట్లాది మంది ప్రజలకు అన్యాయం చేస్తున్న తెలంగాణ బిల్లును తక్షణం నిలిపివేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభలో గురువారం జరిగిన ఘటనను సాకుగా చూపి సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని పక్కదారి పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పార్థసారథి వ్యాఖ్యానించారు.