
'సీమాంధ్ర ప్రజల మనసులతో ఆటలాడున్నాయి'
సీమాంధ్ర ప్రజల మనుసులతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆటలాడుతున్నాయని రాష్ట్ర మంత్రి కె.పార్థసారథి ఆరోపించారు. శనివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. కోట్లాది మంది ప్రజలకు అన్యాయం చేస్తున్న తెలంగాణ బిల్లును తక్షణం నిలిపివేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోక్సభలో గురువారం జరిగిన ఘటనను సాకుగా చూపి సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని పక్కదారి పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పార్థసారథి వ్యాఖ్యానించారు.