T Bill
-
విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
-
'కాంగ్రెస్‌ను నిందించాల్సిన అవసరం లేదు'
-
అనూహ్యంగా తెరపైకి రేణుకా చౌదరి
-
'రాజ్యసభలో సవరణలను ప్రతిపాధిస్తాం'
-
మ. 3 గంటలకు రాజ్యసభకు 'టి' బిల్లు
-
ముగిసిన కేంద్ర క్యాబినెట్ భేటీ
-
నేడు రాజ్యసభ ముందుకు 'టి' బిల్లు
-
'రెండు కళ్ల సిద్ధాంతంతో కొంపముంచిన చంద్రబాబు'
-
కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుమ్మక్కయాయి : అంబటి
-
'విభజన దురదృష్టకరం, నేను కాంగ్రెస్ వాదిని'
-
నేడు సా. 4గంటలకు రాజ్యసభలో 'టి' బిల్లు
-
బాబు-కిరణ్ భాయ్ భాయ్
-
కాంగ్రెస్ హైకమాండ్ ఏజెంట్ కిరణ్ : భూమన
-
'కిరణ్ రాజీనామా దురదృష్టకరం'
-
'విభజన విషయంలో కాంగ్రెస్ ఎలాంటి తప్పూ చేయలేదు'
-
'కిరణ్ రాజీనామా కాంగ్రెస్ గేమ్‌ప్లాన్‌లో భాగం'
-
'రాజకీయ కుట్రతోనే విభజన'
-
మాటలు ఘనం...చేతలు శూన్యం
-
మ. 2 గంటల వరకు రాజ్యసభ వాయిదా
-
సీమాంధ్ర సంగతేంటి ?
-
అన్నీ సాఫీగా సాగితే నెలాఖరుకు రెండు రాష్ట్రాలు
-
క్యాబినేట్ బిల్లే...కొంచెం అటూ ఇటూ
-
లాస్ట్బాల్ ఏమైందో ?
-
డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
-
సంబురాల తెలంగాణ
టీ-బిల్లు ఆమోదంతో ఆనందోత్సాహాలు ఉప్పొంగిన ఉత్సాహంతో నృత్యాలు చేసిన జనం పార్టీల రాష్ట్ర కార్యాలయాల్లో వేడుకలు బాణసంచా పేల్చుతూ, మిఠాయిలు పంచుకున్న తెలంగాణవాదులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రజలంతా తెలంగాణ జెండాలు చేబూని స్వరాష్ట్ర ఏర్పాటును స్వాగ తించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని జెతైలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఆనందంతో నృత్యాలు చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ, టీఆర్ఎల్డీ, ఎంఎస్పీ, వివిధ ఉద్యోగ, న్యాయవాద, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజాఫ్రంట్, టీఎన్ఎస్, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. కళాకారుల ఆటాపాటలతో కుంకమలు చల్లుకొని ఆనందాన్ని పంచుకున్నారు. అమరవీరుల స్తూపాలు, తెలంగాణ తల్లి విగ్రహాల వద్ద అమరులకు నివాళులు అర్పించారు. పలుచోట్ల పాలాభి షేకం చేశారు. సాక్షి, నెట్వర్క్: తెలంగాణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించడంతో... ఆ ప్రాం తంలో సంబరాలు అంబరాన్నంటాయి. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీల నేతలు, కార్యకర్తలు వేడుకల్లో మునిగితేలగా, సచివాలయం లో తెలంగాణ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నా రు. తెలంగాణ భవన్లో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నేతలు బాజాభజంత్రీల మధ్య నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర పరిధిలోని నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్చార్జిలు తమ అనుచరులతో ర్యాలీలుగా తెలంగాణభవన్‌కు చేరుకున్నారు. నృత్యం చేస్తూ, రంగులు చల్లుకున్నారు. స్వీట్లు పంచుకున్నారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి వేడుక నిర్వహించారు. పీసీసీ మహిళా అధ్యక్షురాలు ఆకుల లలిత నేతృత్వంలో పలువురు నేతలు, కార్యకర్తలు సోనియాగాంధీ చిత్రపటం చేతబూని డప్పు శబ్దాల మధ్య నృత్యాలు చేశారు. స్వీట్లు పంచుకున్నారు. కాగా.. తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు వ్యక్తిగత కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష కార్యాలయానికి వచ్చి స్వీట్లు పంచడం గమనార్హం. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ రాజేశ్వరరావు, ఎస్.కుమార్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, అశోక్‌కుమార్ యాదవ్ తదితరుల ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి చేరుకుని గులాం చల్లుకున్నారు. మిఠాయిలు పంచుకుని, బాణసంచా పేల్చారు. నృత్యాలతో హోరెత్తించారు. సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు నేతృత్వంలో రంగులు చల్లుకుంటూ జై తెలంగాణ నినాదాలతో సచివాలయం మొత్తం కలియదిరిగారు. రాజ్యసభలో బిల్లు పాస్ అయిన తరువాత పూర్తిస్థాయిలో సంబురాలు చేసుకుంటామని నరేందర్‌రావు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో కాకతీయ యూనివర్సీటీ విద్యార్థి జేఏసీ, అధ్యాపకులు, సిబ్బంది కేరింతలు కొడుతూ, నృత్యాలు చేశారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట, ములుగు, పరకాల, ఏటూరునాగారం, నర్సంపేట, మహబూబాద్, డోర్నకల్, తొర్రూరు, పాలకుర్తి, మరిపెడ సెంటర్లలో తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి చేరి ఆనందోత్సాహంతో ఆలింగనాలు చేసుకున్నారు. హన్మకొండ ఏకశిలా పార్కు వరకు తెలంగాణవాదులు ర్యాలీగా వచ్చి అక్కడున్న తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కిషన్ ఉద్యోగులతో కలిసి సంబరాల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ తెలంగాణచౌక్‌లో రహదారిపై టపాసులు కాల్చి, నృత్యాలు చేశారు. రంగులు చల్లుకుని మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు జరిగాయి. కలెక్టరేట్ ఉద్యోగులు మిఠాయిలు పంచుకున్నారు. కళాకారులు ఉద్యమ గీతాలు ఆలపిస్తూ నృత్యాలు చేశారు. మంచిర్యాల, కాగజ్‌నగర్, నిర్మల్, లక్సెట్టిపేట, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, ఊట్నూర్, భైంసాలో ర్యాలీలు జరిగాయి. సింగరేణి బొగ్గు గనులపై కార్మికులు సంబరాలు జరుపుకొన్నారు. కరీంనగర్లో వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు భారీ ప్రదర్శనలు నిర్వహించారు. నిజామాబాద్‌లో టీజేఎసీ ప్రతినిధులు, ఉద్యోగులు, యువకులు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు రోడ్లపైకి చేరి జయజయధ్వానాలు చేశారు. కామారెడ్డి, ఆర్మూరు, బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడతోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాలలోనూ ఘనంగా సంబురాలు జరిగాయి. ఖమ్మంలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన, కుల సంఘాలు, మైనార్టీలు, కార్మికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు ఇందుకు వేదికలయ్యాయి. మోటారుసైకిళ్ల ప్రదర్శనలు, బాణాసంచా పేలుళ్లు, స్వీట్లు పంచుకోవడం, విగ్రహాలకు అభిషేకాలతో జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున సంబరం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా ఆలేరులో ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, దేవరకొండలో ఎమ్మెల్యే బాలునాయక్ ర్యాలీల్లో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని అమరవీరులస్థూపం జెతైలంగాణ నినాదాలతో హోరెత్తింది. ఉపాధ్యాయ, విద్యార్థి, ఉద్యోగసంఘాలు కూడా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి. తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పలువురు తెలంగాణవాదులు పాలాభిషేకం చేశారు. పాలమూరు జిల్లాలో మంగళవారం అన్ని పట్టణాలు, గ్రామాల్లో సంబురాలు జరుపుకొన్నారు. రాజకీయ పక్షాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, వివిధ జేఏసీల ఆధ్వర్యంలో ఎవరికి వారుగా ర్యాలీలతో ముఖ్య కూడళ్లకు తరలివచ్చారు. బాణసంచా పేల్చుతూ ‘జై తెలంగాణ’ నినాదాలతో హోరెత్తించారు. డప్పు చప్పుళ్లతో ముఖ్య కూడళ్లు మార్మోగాయి. మహబూబ్‌నగర్‌లో వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుకుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఐఎంఎల్, కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మెదక్ జిల్లాలో తెలంగాణవాదుల సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ పార్టీల నాయకులు భారీఎత్తున టపాసులు కాలుస్తూ, రంగులు చల్లుకుంటూ నృత్యాలు చేశారు. మిఠాయిలు పంచుతూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. సంగారెడ్డిలో అమరవీరుల స్థూపానికి క్షీరాభిషేకం చేశారు. రంగారెడ్డి జిల్లాలో కూడా తెలంగాణ వాదులు పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాల్చారు. స్వీట్లు పంచుకున్నారు. రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో తెలంగాణ నాన్‌గెజిటెడ్ ఉద్యోగులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. జంట నగరాల పరిధిలోని అన్ని కోర్టులతోపాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల్లో న్యాయవాదులు మంగళవారం సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చడంతోపాటు మిఠాయిలు పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు నుంచి గన్‌పార్క్‌కు ప్రదర్శనగా వెళ్లి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరుల ఆశయం నెరవేరింది తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో తెలంగాణ మలిఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్‌చారితోపాటు వెయ్యి మంది అమరవీరుల ఆశయం నెరవేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారమవుతున్న వేళ శ్రీకాంత్‌చారి తల్లిదండ్రులుగా ఎంతో సంతృప్తి చెందుతున్నాం. మలి ఉద్యమానికి మా కొడుకు త్యాగం ఎంతో స్ఫూర్తినిచ్చింది. లక్ష బాధలు పడి తెలంగాణ లక్ష్యాన్ని కేసీఆర్ సాధించారు. రాష్ట్ర సాధనకోసం లెక్కలేని అభాండాలు, అపనిందలు తనపై మోపినా కేసీఆర్ భరించారు. తెలంగాణ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇప్పటికైనా సీమాంధ్రులు ఉద్యమాన్ని విరమించుకోవాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా హైదరాబాద్‌లో కలిసిమెలిసి బతకవచ్చు. - శ్రీకాంత్‌చారి తల్లిదండ్రులు శంకరమ్మ-వెంకటాచారి అమరుల త్యాగఫలితం ‘తెలంగాణ కోసం నా భర్త (కానిస్టేబుల్ కిష్టయ్య) తన జీవితాన్నే త్యాగం చేశారు. ఆయన లేకపోవడం మాకు ఎంతో నష్టం. ఆ బాధ ఉన్నా రాష్ట్రం రావడం ఆనందం కలిగిస్తోందన్నారు. ఆయనతోపాటు ఎందరో అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం. ఆయన స్వప్నం నెరవేరడం సంతోషం. సోనియమ్మకు కృతజ్ఞతలు. తెలంగాణ అమరుల కుటుంబాలను ఆదుకోవాలి’ - కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మ 25 నుంచి విజయోత్సవాలు: ఓయూ జేఏసీ హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆరు దశబ్దాల ఉద్యమ ఫలితంగా దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను విద్యార్థి అమరులకు అంకితమిస్తున్నామని ఉస్మానియాయూనివర్సిటీ (ఓయూ)లోని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థి జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే విద్యార్థులు ఆనందోత్సవాల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత రాజు మాట్లాడుతూ, ఈ నెల 25 నుంచి తెలంగాణ పది జిల్లాల్లో విజయోత్సవ ర్యాలీలను, మార్చి 5న ఓయూ ఆర్ట్స్ కళాశాలలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో 30 మంది యువకులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. బహిరంగ సభకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరుకానున్నట్లు బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బండారు వీరబాబు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి విద్యార్థి సంఘం, ఏబీవీపీ, బీజేవైఎం, టీఆర్ఎస్వీ, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం: షిండే
-
'చరిత్ర హీనురాలు సోనియా'
-
'ఇది ఒక చీకటి రోజు'
-
'దేశ చరిత్రకే చీకటి అధ్యాయం'
-
'కాంగ్రెస్, బీజేపీ లదే భాధ్యత'
-
'అన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే'
-
'విభజన విషయంలో ప్రధాన ముద్దాయి కిరణ్'
-
మ. ౩ గంటల వరకు లోక్‌సభ వాయిదా
-
తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభం
-
'పదవులు ముఖ్యం కాదు...తెలంగాణ అభివృద్ధే ముఖ్యం'
-
ముగిసిన బీజేపీ మీటింగ్
-
'సీమాంధ్ర ఎంపీలను సభనుంచి సస్పెండ్ చేయడం ఘోరం'
-
గంట పాటు లోక్‌సభ వాయిదా
-
'కాంగ్రెస్‌కు లిట్మస్ టెస్టే'
-
రేపే టీ బిల్లు ఆమోదం పొందే అవకాశం?
-
'సోనియా గాడ్సే అయితే...బాబు ఆమె చేతిలో తుపాకి'
-
'టి' బిల్లు..పార్టీల వైఖరిపై చర్చ
-
'టి' బిల్లు విషయంలో కేంద్రమంత్రుల్లో భిన్న అభిప్రాయాలు
-
ప్రకాష్ కారత్ను కలిసిన జగన్
-
'టి' బిల్లు విషయంలో కేంద్రమంత్రుల్లో భిన్నాభిప్రాయాలు
-
గాడ్సే సోనియా.. బొమ్మ ప్రధాని
-
'సీమాంధ్ర ప్రజల మనసులతో ఆటలాడున్నాయి'
సీమాంధ్ర ప్రజల మనుసులతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆటలాడుతున్నాయని రాష్ట్ర మంత్రి కె.పార్థసారథి ఆరోపించారు. శనివారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. కోట్లాది మంది ప్రజలకు అన్యాయం చేస్తున్న తెలంగాణ బిల్లును తక్షణం నిలిపివేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభలో గురువారం జరిగిన ఘటనను సాకుగా చూపి సీమాంధ్రకు జరిగిన అన్యాయాన్ని పక్కదారి పట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని పార్థసారథి వ్యాఖ్యానించారు. -
బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి : అశోక్ బాబు
-
బీజేపీ తెలంగాణకు కట్టుబడే ఉంది : రాజ్‌నాథ్ సింగ్
-
ఎంపీ కొనకళ్ల నారాయణ పరిస్థితి విషమం
-
'కాంగ్రెస్ అగ్రనేతలు దుష్ప్రచారం చేస్తున్నారు'
-
'ఓట్లూ, సీట్ల కోసమే'
-
కత్తితో పార్లమెంట్‌లోకి వెళ్లలేదు : మోదుగుల
-
'తెలంగాణ అంశంలో యూపీఏ దారుణ వైఫల్యం'
-
ప్రాణ రక్షణ కోసమే పెప్పర్ స్ప్రే : లగడపాటి
-
పార్లమెంట్లో జరిగినది విచారకరం : చంద్రబాబు
-
విపక్షమంతా ఒక్కటవ్వాలి: జగన్
-
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: వైఎస్ జగన్
-
ఇది కాంగ్రెస్ కుట్ర : సుష్మా స్వరాజ్
-
ఇది దేశానికి మంచిది కాదు : ఉండవల్లి
-
పార్లమెంట్ చరిత్రలో దుర్దినం : దిగ్విజయ్
-
విభజన బిల్లు పెట్టేశాం : షిండే
-
పార్లమెంట్లో జరిగిన పరిణామాలు శోచనీయం : బృందాకారత్
-
లోక్‌సభలో టీ బిల్లుకు నిరసనగా రహదారుల దిగ్బంధం
-
లోక్‌సభలో 16 మంది ఎంపీల సస్పెన్షన్
-
బిల్లు ఆమోదం సరికాదని చెప్పాం: సుష్మా
-
టి బిల్లుకు న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్
-
’8 కోట్ల మంది ప్రజల గుండెలపై కత్తులు పెట్టారు ’
-
’గత్యంతరం లేకే.... వెల్‌లోకి ’
-
తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం : కాంగ్రెస్
-
ఉభయ సభలు వాయిదా
-
'మేము సూచించిన సవరణలను జీఓఎం పట్టించుకోలేదు'
-
బీజేపీలో తెలంగాణ చిచ్చు
-
పార్టీల విశ్వసనీయతకు పరీక్ష
తెలంగాణ బిల్లుపై కిషన్‌రెడ్డి వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ బిల్లు రాజకీయ పార్టీల విశ్వసనీయతకు పెద్ద పరీక్ష అని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. టీ బిల్లును పార్లమెంట్లో గెలిపించి తమ విశ్వసనీయతను నిరూపించుకుంటామని చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ శైలేష్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. టీ బిల్లును ముందుగా రాజ్యసభలో ఎందుకు ప్రవేశపెట్టాలనుకుంటుందో చెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని తెలిసినప్పటికీ సీమాంధ్ర నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ప్రజల మధ్య విద్వేషాలు పెంచవద్దని సూచించారు. పదకొండు వందల మంది ఆత్మహత్యలకు కచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే కారణమని, సోనియాగాంధీ తమ పాలిట దెయ్యమేనని చెప్పారు. మోడీ పట్ల ఉన్న ఆదరణను ఓట్ల రూపంలో మలిచేందుకు కార్యకర్తలు వచ్చే 60రోజులను పార్టీకి పూర్తిగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ విధానాలు నచ్చే పార్టీలో చేరుతున్నానని, మోడీతోనే ఉత్తమ పాలన సాధ్యమని నమ్ముతున్నానని శైలేష్‌రెడ్డి చెప్పారు. రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు అంజన్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న టి బిల్లు?
-
‘టి’ బిల్లును పార్లమెంట్లో పెట్టకండి
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: అసెంబ్లీలో తిరస్కరించిన తెలంగాణ బిల్లును పార్లమెంట్లో పెట్టకూడదని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, ఎన్.రాజారెడ్డి డి మాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సాప్స్ ఆధ్వర్యంలో తిరుపతి ము న్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సర్కిల్లో గురువారం ఆందోళనకు దిగారు. విశ్వం విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులతో కలిసి ర్యాలీగా కార్పొరేషన్ కా ర్యాలయం సర్కిల్ వరకు చేరుకున్నా రు. అక్కడ మానవహారంగా ఏర్పడి కేం ద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదా లు చేశారు. కోడూరు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీలో తిరస్కరించారన్నారు. అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన చరిత్ర ఇప్పటివరకూ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త సంప్రదాయాన్ని తీసుకొస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. రాజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ, రాయలసీమ ప్రజలు తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్ తదితర సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడతారని తెలిపారు. మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి, విశ్వం విశ్వనాథరెడ్డి, వెంకటేశ్వర్లు, డాక్టర్ శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో రాజకీయ పార్టీలు ఆడుతున్న నాటకాలపై తీవ్ర స్థాయిలో మం డిపడ్డారు. ఏపీఎన్జీవో నాయకులు తాళ్లపాక సురేష్, మహేష్‌బాబు, ఐఎంఏ, తిరుపతి బార్ అసోసియేషన్ రమణ స్కూటర్లపై ర్యాలీగా వచ్చి మద్దతు ప్రకటించారు. మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి కుసుమకుమారి, గేట్, ఏటీఎన్ డిగ్రీ కళాశాల, చైతన్య, విజయవాడ నారాయణతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాల సర్కిల్లో ఏపీఎన్జీవోలు ఆందోళనకు దిగారు. సురేష్‌బాబు ఆధ్వర్యంలో నాయకులు హాజరయ్యారు. -
'కిరణ్ వేసిన తొలిబంతి తెలంగాణాకు అనుకూలంగానే ఉంది'
-
బిల్లుపై ఓటింగ్ జరగాల్సిందే: వైఎస్సాఆర్ సీపీ
-
విభజన బిల్లు పై ఓటింగ్ పెట్టాలని స్పీకర్‌ను కోరిన సీఎం
-
'కిరణ్ అభిప్రాయం వ్యక్తిగతమా? లేక పార్టీదా?'
-
విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నా
-
కిరణ్ ప్రసంగంపై మండిపడ్డ టీ నేతలు
-
పీఎం కార్యాలయంలో టీ-బిల్లు గడుపు పెంపు ఫైల్
-
గడువులోగా టిబిల్లుపై చర్చ ముగించాలి: శ్రీధర్ బాబు
-
చిత్తశుద్ధి ఏదీ!
-
అసెంబ్లీలో చర్చ జరక్కుంటే చాలా నష్టం: వెంకయ్య
పార్టీలు ప్రజల మనోగతాలను ఆవిష్కరించాలి ప్రధాని హోదానే మన్మోహన్ దిగజార్చారు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీలో కూలంకషంగా చర్చ జరగాలని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. నిర్మాణాత్మక చర్చ జరక్కపోతే నష్టమే ఎక్కువ ఉంటుందని, ప్రజల మనోగతాలను ఆవిష్కరించేందుకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాజకీయపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారమిక్కడ పార్టీ నేతలు ఇంద్రసేనారెడ్డి, సురేష్‌రెడ్డి, విష్ణువర్థన్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ వైఖరిలో మార్పు లేదని, తెలంగాణ ఏర్పాటు చేస్తూనే సీమాంధ్ర ప్రజల న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రంపై, పార్లమెంటుపై ఉందన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి తానూ చెప్పాల్సింది చాలా ఉందని, ఓ రోజు తప్పక చెప్తానని అన్నారు. పీఎం స్థాయిని దిగజార్చారు..: మన్మోహన్సింగ్ ప్రధాని పదవి స్థాయినే దిగజార్చారని వెంకయ్య మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ గెలిచే స్థితి లేకపోవడంతోనేమన్మోహన్ తప్పుకుంటానన్నారని ఎద్దేవా చేశారు. యూపీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని, వినాశనం తప్ప మన్మోహనం ఏమీ లేదని చెప్పారు. మోడీపై మన్మోహన్ వ్యాఖ్యలు రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనంగా అభివర్ణించారు. ఇందిరాగాంధీ హత్యకు గురయినప్పుడు జరిగిన వాటినే ఊచకోతలంటారని వివరించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొత్త పార్టీలకు కొరతేమీ ఉండదని, వాటివల్ల తమకొచ్చిన నష్టమేమీ లేదన్నారు. కొత్తవారు ప్రధాని కావాలని కలలు కనొచ్చని, అయితే వీళ్లెవ్వరూ మోడీకి సరితూగరని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 17,18 తేదీల్లో ఢిల్లీలో జాతీయ కార్యవర్గం, 19న జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ సమావేశాల్లో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని చెప్పారు. తమ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు గెలుస్తుందని, అయినా మిత్రపక్షాలతో కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెంకయ్య చెప్పారు. -
కాంగ్రెస్‌ను నమ్మలేం: కిషన్‌రెడ్డి
సోనియా దయాదాక్షిణ్యాల వల్ల తెలంగాణ రాలేదని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లు పార్లమెంటులో పాసయ్యేంత వరకు కాంగ్రెస్‌ను నమ్మలేమని, ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో పునర్వ్యవస్థీకరణ బిల్లుపై జరిగే చర్చలో తాము పాల్గొని, సీమాంధ్ర సహా అన్ని ప్రాంతాల సమస్యల్ని ప్రస్తావిస్తామని చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన టీడీపీ నాయకులు బోడ జనార్దన్, దేవిశెట్టి శ్రీనివాసరావు, నిట్టు వేణుగోపాలరావు, జేఏసీ నేతలు మహేష్ కుమార్, ఫణిందర్, శంకర్‌గౌడ్ తదితరులు పెద్దసంఖ్యలో శనివారమిక్కడ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటు 11 వందల మంది అమరవీరుల త్యాగఫలమని, సోనియా దయాదాక్షిణ్యాలతో రాలేదని చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసమే సీమాంధ్రలో కొన్ని పార్టీలు సమైక్యవాదాన్ని నెత్తికెత్తుకున్నాయని ధ్వజమెత్తారు. తెలంగాణపై తమ పార్టీ వెనక్కుపోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. 2002 గోద్రా అల్లర్ల కేసుతో సంబంధం లేదని అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే మరో కేసులో మోడీపై విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు యండల లక్ష్మీనారాయణ, సీహెచ్ విద్యాసాగరరావు, జి.రామకృష్ణారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మిషన్ 272 పక్కా! కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నిర్ణయించుకున్న ప్రజలు తమకు తప్పకుండా 272 లోక్‌సభ సీట్లు కట్టబెడతారని కిషన్‌రెడ్డి అంతకుముందు జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద బస్ దగ్ధమై మరణించిన 46 మంది కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా కొత్తచెరువు రైల్వే స్టేషన్ వద్ద జరిగిన దుర్ఘటనపై ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంఘటనాస్థలికి సీనియర్ నేత బండారు దత్తాత్రేయను పంపామన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారికీ ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీజేపీ వైపు కొమ్మూరి చూపు? వరంగల్ జిల్లా జనగాం నియోజకవర్గ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, కేంద్రమాజీ మంత్రి రవీంద్ర నాయక్ బీజేపీలో చేరనున్నారు. ఈమేరకు వీరిరువురూ శనివారమిక్కడ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఇతర సీనియర్లతో చర్చలు జరిపారు. వచ్చేనెల 5న వీరిద్దరూ జనగాంలో జరిగే సభలో కాషాయతీర్థం తీసుకోనున్నట్టు తెలిసింది. -
మా ఆకాంక్షలకు తగ్గట్టుగా లేదు
కొన్ని అంశాలను పునఃపరిశీలించండి టీ-బిల్లుపై రాష్ట్రపతి ప్రణబ్‌కు కేసీఆర్ వినతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లులోని పలు అంశాలను పునఃసమీక్షించాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేశారు. బిల్లులోని అంశాలు తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా లేవని తెలిపారు. శీతకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గురువారం రాత్రి టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం భేటీ అయింది. పార్టీ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సహా 28 మంది నేతలు రాష్ట్రపతిని కలిసి పది పేజీల వినతిపత్రం అందజేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అభిప్రాయాలను కోరుతూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013ను చాలా త్వరగా రాష్ట్ర అసెంబ్లీకి పంపినందుకు నాలుగు కోట్ల ప్రజల తరుఫున మీకు ధన్యవాదాలు. చిరకాల స్వప్నంగా ఉన్న తెలంగాణ త్వరలో సాకారం కాబోతు న్న ఈ సమయంలో మీ వంటి వ్యక్తి దేశానికి రాష్ట్రపతి కావడం మా ఆదృష్టం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే ముగింపునకు వస్తుందని విశ్వసిస్తున్నాం. బిల్లు ప్రస్తుతం అసెంబ్లీలో చర్చకు ఉంది. పలు రాజకీయ శక్తులు అడ్డుకుంటున్నా.. చర్చ పూర్తి చేసుకొని ఈ బిల్లు తిరిగి వీలైనంత త్వరగా మీకు చేరుతుందనే విశ్వా సంతో ఉన్నాం. తెలంగాణ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను గమనంలోకి తీసుకుంటే ప్రస్తుతం రూపొం దించిన బిల్లులోని కొన్ని అంశాలను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. సామాజిక, ఆర్థిక అంశాలలో తెలంగాణ ప్రజలు సమాన అవకాశాల కోసం దశాబ్దాల తరబడి పోరాడుతున్న సంగతి మీకూ తెలుసు. ముఖ్యం గా విద్య, ఉపాధి అవకాశాలతో పాటు నీరు, నిధుల కేటాయింపులో తగిన వాటా కోసం ఇక్కడి ప్రజలు పోరాడుతున్నారు. ప్రస్తుత బిల్లులో ఆయా అంశాలు ఇక్కడి ప్రజ ల ఆకాంక్షలకు తగిన విధంగా లేవు’’ అని రాష్ట్రపతికి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. బిల్లులో పొందిపరిచిన అంశాలలో ఆస్తులు, అప్పుల పంపిణీ, ఉద్యోగులు, పెన్షనర్లలను రెండు రాష్ట్రాలకు పంచిన తీరు, శాంతిభద్రత విషయంలో గవర్నర్‌కు పత్య్రేక అధికారాలు కల్పిం చడం, రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు, నదీ జలాలకు పంపిణీకి ఉద్దేశించి కమిటీల ఏర్పాటు, విద్యుత్ రంగంలో వాటా అంశాలలో తమకున్న అభ్యంతరాలను వినతిపత్రంలో పేర్కొన్నారు. భేటీ జరిగిన 15 నిమిషాలపాటు కేసీఆర్ ఒక్కరే వినతిపత్రంలోని అంశాలను రాష్ట్రపతికి వివరించారు. అభ్యంతరాలను పరిశీలిస్తామన్నారు : ఈటెల బిల్లుపై తమ పార్టీ లేవనెత్తిన పలు అభ్యంతరాలను పరిశీలిస్తానని రాష్ట్రపతి అన్నట్లు టీఆర్ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ తెలిపారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం ఈటెల విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై ఎలాంటి ఆంక్షలు విధించవద్దని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. హైదరాబాద్‌పై ఆంక్షలను పూర్తిస్థాయిలో తొలిగించాలని కోరామన్నారు. బిల్లుై పె అసెంబ్లీలో చర్చకు సీమాంధ్ర నేతలు మరింత గడువు కోరే అంశాన్ని కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చామని హరీష్‌రావు చెప్పారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలందరూ పట్టుపట్టినా చర్చ జరపకుండా పారిపోయిన వారికి గడువు పెంచాలని అడిగే అర్హత లేదన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని ఇంకా ఎవరైనా మాట్లాడితే మూర్ఖత్వమే అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆపుతామని ఎవరు మాట్లాడినా సీమాంధ్ర ప్రాంతంలో నాలుగు ఓట్లు సంపాదించుకోవడం కోసమేనని దుయ్యబట్టారు. బిల్లుపై చర్చకు రాష్ట్రపతి గడువు పెంచుతారని అనుకోవడం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
నేడు రాష్ట్రపతి వద్దకు టీఆర్ఎస్ బృందం
సాక్షి, హైదరాబాద్: సికిందరాబాద్‌లోని రాష్ట్రపతి నిల యంలో బసచేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని గురువా రం టీఆర్ఎస్ నేతల బృందం కలుసుకోనుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు రాష్ట్రపతిని కలుసుకుంటారు. రాష్ట్ర విభజన బిల్లు ముసాయిదాకు సంబంధించి టీఆర్ఎస్ అభ్యంతరాలను వారు రాష్ట్రపతి దృష్టికి తీసుకురానున్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చకు అదనపు గడువు ఇవ్వవద్దంటూ టీఆర్ఎస్ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. రాష్ట్రపతిని కలుసుకునేందుకు తెలంగాణ జేఏసీ కూడా అప్పాయింట్మెంట్ కోరినా, అందుకు అనుమతి రాలేదని సమాచారం. -
టీ- బిల్లుకు సవరణలు కోరుతాం: హరిబాబు
పార్లమెంటులో తెలంగాణ బిల్లు చర్చకు వచ్చిన సమయంలో సవరణలు, ఓటింగ్‌కు పట్టుబట్టాలని తమ పార్టీ అధినాయకత్వాన్ని కోరినట్టు బీజేపీ సీమాంధ్ర నేత హరిబాబు చెప్పారు. ఒక వేళ ఇప్పుడు సీమాంధ్రులకు న్యాయం జరగకుంటే తాము అధికారంలోకి వచ్చాక తగిన న్యాయం చేస్తామన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉంటూనే, విభజన వల్ల సీమాంధ్రకు కలిగే నష్టం విషయంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని తమ నాయకులతో మాట్లాడామన్నారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయడానికి బిల్లులో మార్పులు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌కు ఉందన్నారు. టీడీపీతో పొత్తుకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అడ్డుపడుతున్నారనే వార్తలు వస్తున్నాయని అడగ్గా.. ‘‘బీజేపీ ఒక జాతీయ పార్టీగా రాష్ట్ర శాఖ అభిప్రాయాన్ని తీసుకుంటుంది. అంతిమంగా జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర పార్టీ అమలు చేస్తుంది. విభేదాలకు తావులేదు’’ అని బదులిచ్చారు. సీమాంధ్ర ప్రజల పీకమీద కత్తి పెట్టి విభజన చేస్తున్నారని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నించగా ‘ మేము అలా అనుకోవడంలేదు. సీఎం కిరణ్ అనుకుంటున్నారు’’ అని బదులిచ్చారు. -
టీ బిల్లును అడ్డుకునే కుట్ర
అసెంబ్లీలో చర్చ జరగకుండా సీఎం అడ్డుకుంటున్నారు రాష్ట్రపతికి తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు సీఎం తీరుపై జానారెడ్డి, వీహెచ్ ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరనున్న తరుణంలో దాన్ని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ జరగకుండా కావాలనే జాప్యం చేయిస్తున్నారని.. సీమాంధ్ర నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని.. ప్రధానంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బిల్లుపై ఓటింగ్ అని, ఓడిస్తామని, తద్వారా రాష్ట్రపతి తెలంగాణ ప్రక్రియను నిలుపుచేయడానికి వీలుంటుందంటూ పదేపదే ప్రకటనలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈమేరకు తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ఇక్కడి రాష్ట్రపతి నిలయంలో కలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు కె.జానారెడ్డి, డి.శ్రీధర్‌బాబు, డి.కె.అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, సారయ్య, పొన్నాల లక్ష్మయ్య, చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, విప్ అనిల్, ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, సురేష్ షేట్కార్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, వి.హనుమంతరావు, ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, జగదీశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి, భానుప్రసాదరావు, మాజీ మంత్రి సబితారెడ్డి తదితరులు రాష్ట్రపతిని కలసి ఒక వినతిపత్రం సమర్పించారు. అదనపు గడువు అనటం.. వెన్నుపోటే! ‘‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర చట్టసభల అభిప్రాయం కోరుతూ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును అసెంబ్లీకి పంపించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చట్టసభలకు 11 రోజుల కిందటే బిల్లు చేరినా ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా అర్థవంతమైన చర్చకు అవకాశం లభించలేదు. ఉభయ సభల్లోనూ సీమాంధ్రకు చెందిన మా సోదర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభా కార్యక్రమాలను అడ్డుకోవటం తీవ్ర విచారకరం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలని, సకాలంలో పార్లమెంటుకు బిల్లు చేరకుండా ఉండాలని ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారు. పత్రికలు, మీడియాలో వస్తున్న వార్తల్లో బిల్లుపై చర్చించడానికి మీరిచ్చిన 42 రోజుల గడువు కాకుండా అదనపు గడువు కోసం వారు అలా చేస్తున్నట్లు తెలిసింది. చర్చ కోసం మీరిచ్చిన గడువు సవివర చర్చకు సరిపోతుంది. అదనపు గడువు కోరడం అంటే.. రాష్ట్రం ఏర్పాటు కాకుండా వెన్నుపోటు పొడవడానికి తప్ప మరే ఇతర కారణం లేదు. గడువు పొడిగించాలని విజ్ఞప్తులు వచ్చే పక్షంలో పై పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి’’ అని ఆ వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు. సీఎం కుట్రదారుడే: జానారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీఎం కిరణ్ కూడా కుట్రదారుడేనని మంత్రి జానారెడ్డి ధ్వజమెత్తారు. కిరణ్ ఒక వ్యక్తి మాత్రమేనని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చే కేంద్ర ప్రభుత్వమనే శక్తి తమ వెనుక ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిని కలసిన అనంతరం జానారెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్చే అధికారం ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉండదా..?’’ అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు మానుకోవాలని.. చర్చను అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడమేనని పేర్కొన్నారు. సీమాంధ్ర నాయకులు చేస్తున్న ఆందోళనకు హేతుబద్ధత లేదని, ఉద్దేశపూర్వకంగానే విభజనబిల్లుపై చర్చను అడ్డుకుంటున్నారని ఎంపీ రాజయ్య, మంత్రి సారయ్య, ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీలు ఆరోపించారు. సీఎం సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతూ గందరగోళానికి గురిచేస్తున్నారని.. గ్రౌండ్ లేనప్పుడు ఆఖరి బంతి ఎలా ఆడతారని వీహెచ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కిరణకుమార్రెడ్డా, అశోక్‌బాబా అనేది అర్ధం కావడంలేదన్నారు. విభజన బిల్లుపై అసెంబ్లీ అభిప్రాయ సేకరణకు 40 రోజుల గడువు ఇచ్చారని.. ఇంకా అదనంగా సమయం కేటాయించరాదని రాష్ట్రపతిని కోరామని మరో మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. -
బిల్లుపై బీజేపీ నిరసనలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏకపక్షంగా ఉందంటూ బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం ఆ ప్రాంతంలో నిరసనలు ప్రదర్శనలు జరిగాయి. ఈ సందర్భంగా ఎటువంటి అరెస్టులు జరగనప్పటికీ పలుచోట్ల పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాటలు జరిగాయి. సీమాంధ్రలోని జిల్లా కేంద్రాలతో పాటు రెవెన్యూ డివిజన్లలోనూ ర్యాలీలు నిర్వహించినట్టు ఉద్యమ కమిటీ చైర్మన్ రఘునాధ్ బాబు తెలిపారు. సీమాంధ్ర సమస్యల్ని పూర్తిగా విస్మరించిన పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించవద్దని, పోలవరం బహుళార్ధసాధక ప్రాజెక్టును యథావిధిగా నిర్మించాలని, భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని, హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయలాని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లు పూర్తిగా రాజ్యాంగవిరుద్ధంగా ఉందని బీజేపీ జాతీయ నేత కంభంపాటి హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులో ఉన్న 12 అంశాలూ సీమాంధ్ర ప్రాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. సీమాంధ్రులకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ ఆధ్వర్యంలో విశాఖపట్నం లోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికై ఆంధ్రప్రాంతానికి అన్యాయం చేస్తున్న కేంద్రమంత్రి జైరాం రమేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ర్ట విభజనకు సహకరిస్తే రాజీనామా రాష్ట్ర విభజనకు బీజేపీ ఆమోదం తెలిపితే రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ హెచ్చరించారు. తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ.. బిల్లు రూపొం దించిన జైరాం రమేష్ దిష్టిబొమ్మను భీమవరం ప్రకాశం చౌక్‌లో శుక్రవారం దహనం చేశారు. బీజేపీ ఏలూరు నగర శాఖ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద జైరాం రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జి.ఎస్.నాగరాజు మాట్లాడుతూ తాము విభజనకు మద్దతిస్తున్నా, సీమాంధ్రకు న్యాయం జరగనిదే పార్లమెంట్లో మద్దతు ఇవ్వబోమన్నారు. చిత్తూరు జిల్లా, మదనపల్లెలో సోనియా, దిగ్విజయ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేయగా, ములకలచెరువు బస్టాండ్ కూడలిలో రాస్తారోకో చేపట్టారు. బీజేపీ విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షుడు బవిరెడ్డి శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో కేంద్రమంత్రి జైరామ్ రమేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీస్‌స్టేషన్ సర్కిల్లో జైరాం రమేష్ ఫ్లెక్సీని దహనం చేశారు. అనంతపురంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ర్యాలీ తీయగా, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ఎదుట బీజేవైఎం నేతలు టీ-బిల్లు ప్రతులను చించివేశారు. కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు తెలంగాణ బిల్లు ప్రతులను దహనం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే వెనుకబడ్డ రాయలసీమకు రాజ్యాంగ పరమైన రక్షణ అవసరమన్నారు. అసెంబ్లీలో టీ బిల్లు ప్రవేశపెట్టినందుకు నిరసనగా బద్వేలులో సోనియా, జైరాంల చిత్రపటాలను దహనం చేశారు. -
విభజన బిల్లు సవరణకు ఒత్తిడి
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విభజన బిల్లు సీమాంధ్రులకు అన్యాయం చేసేదిగా ఉందని బీజేపీ నేత కంభంపాటి హరిబాబు అన్నారు. గురువారం విశాఖపట్నంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ బిల్లును సవరించేలా తమ పార్టీ జాతీయ నాయకులపై ఒత్తిడి తెస్తామన్నారు. శుక్రవారం సీమాంధ్రలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమంత్రి జీఓఎం సభ్యుడు జైరాం రమేష్ కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు తగిలించి బిల్లులో పెట్టారని మండిపడ్డారు. పోలవరానికి న్యాయం జరగాలంటే కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ప్రమేయం లేకుండా ప్రాజెక్టు డిజైన్ ఉండాలన్నారు. ముంపునకు గురైన గ్రామాలన్నీ భద్రాచలం డివిజన్లోనివేనన్నారు. రాష్ట్ర విభజన కావాలని కోరుతున్న తెలంగాణ వాదులు ఈ పరిస్థితుల్లో భద్రాచలం డివిజన్‌ను ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఇంతవరకూ ఏ రెండు రాష్ట్రాలకు ఒకే ప్రాంతం ఉమ్మడి రాజధానిగా లేదన్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ఆయా పార్టీల అవసరాల మేరకు పొత్తు పెట్టుకుంటాయని స్పష్టం చేశారు. -
ఇప్పుడు ఇంతటితో ముగిద్దాం!
-
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల ధర్నా.. అర్ధరాత్రి తరలింపు
అసెంబ్లీలో వైఎస్సార్సీపీ, సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా బలవంతంగా వాహనాలు ఎక్కించి పార్టీ కార్యాలయాల వద్ద వదిలేసిన పోలీసులు నియమాలకు నీళ్లొదిలి బిల్లును ప్రవేశపెట్టారని ఎమ్మెల్యేల మండిపాటు బీఏసీలో చర్చించకుండా సభలో ఎలా పెడతారు? బిల్లును సజావుగా నడిపించడం కోసమే సీఎం ముఖం చాటేశారు చంద్రబాబు, కిరణ్ చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారు రాష్ట్ర విభజన బిల్లుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. సమైక్యాంధ్ర నినాదాలతో సోమవారం అసెంబ్లీని హోరెత్తించింది. శాసనసభా నియమ నిబంధనలను, సంప్రదాయాలను పూర్తిగా ఉల్లంఘించి స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్లును ప్రవేశపెట్టడం, ఆ వెంటనే సభను వాయిదా వేయడం ఒక ఎత్తయితే.. ఆ తర్వాత స్పీకర్ స్థానంలోకి వచ్చిన డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క బిల్లుపై చర్చ ప్రారంభమైనట్లు ప్రకటించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. బిల్లును వ్యతిరేకిస్తూ శాసనసభలోనే నిరవధిక ధర్నాకు దిగారు. అర్ధరాత్రి వరకు సభలోనే బైఠాయించారు. రాత్రి 12.30 గంటల ప్రాంతంలో స్పీకర్ అనుమతితో పోలీసులు ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు తరలించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయం వద్ద, టీడీపీ ఎమ్మెల్యేలను ఎన్టీఆర్ భవన్ వద్ద వదిలేశారు. ఎమ్మెల్యేల తరలింపు కోసం పోలీసులు భారీ స్థాయిలో సిబ్బందిని మోహరించి, స్పీకర్ అనుమతి కోసం నాలుగైదు గంటలుగా ఎదురుచూశారు. చివరకు అర్ధరాత్రి దాటాక అరెస్టు చేశారు. సభ వాయిదా పడిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, భూమా శోభానాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, బి.గురునాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పినిపె విశ్వరూప్, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి, కాటసాని రామిరెడ్డి అసెంబ్లీలోనే కూర్చుండిపోయారు. పోలీసులు తరలించే దాకా తొమ్మిదన్నర గంటలు అలాగే సభలో నిరసన తెలిపారు. అంతకుముందు ధర్నాను విరమింప జేయడానికి శాసనసభ కార్యదర్శి ఎస్.రాజసదారాం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆయన ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి ధర్నాను విరమించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యేలు ససేమిరా అనడంతో వెనుదిరిగారు. విభజన బిల్లును బీఏసీలో చర్చించకుండా శాసనసభలో ప్రవేశ పెట్టబోమని స్పీకర్ నాదెండ్ల మనోహర్ తమకు హామీ ఇచ్చి ఇపుడు మాట తప్పారని ఎమ్మెల్యేలు దుయ్యబట్టారు. డిప్యూటీ స్పీకర్‌ను నిలదీసిన శోభ సాయంత్రం 6 గంటల సమయంలో శాసనసభ ఫ్లోర్‌లోకి వచ్చిన డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్కను శోభానాగిరెడ్డి నిలదీశారు. బీఏసీలో చర్చించనిదే శాసనసభకు బిల్లు రాదని చెప్పి ఇప్పుడు చర్చను ప్రారంభించినట్లుగా ఎలా ప్రకటిస్తారని ఆమె ప్రశ్నించారు. అందుకు ఆయన... బీఏసీలో అలాగని ఎవరు చెప్పారు, చెప్పలేదే అని అన్నారు. తాను సరిగ్గానే వ్యవహరించానని, చర్చ ప్రారంభమైనట్లేనన్నారు. ఉదయం సభలో జరిగిన గొడవ సందర్భంగా విరిగిన మైకులను, చెల్లాచెదురుగా పడి ఉన్న బిల్లు కాగితాలను చూడటానికి డిప్యూటీ స్పీకర్ అక్కడకు వచ్చారు. గొడవ సందర్భంగా ఫ్లోర్లో ఇంకా ఏమైనా నష్టం జరిగిందా అని ఆరా తీశారు. ఆ సమయంలో అక్కడ ఎమ్మెల్యేలు ధర్నా చేస్తున్నా ఆయన పట్టించుకోలేదు. ఇది అప్రజాస్వామిక చర్య: స్పీకర్ నాదెండ్ల మనోహర్ పూర్తి అప్రజాస్వామిక రీతిలో తెలంగాణ విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం ధ్వజమెత్తింది. సోమవారం శాసనసభ వాయిదా అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, కాపు రామచంద్రారెడ్డిలు అసెంబ్లీ మీడియాపాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘‘బీఏసీలో చర్చించకుండా, శాసనసభ అనుమతి లేకుండా చర్చకు అనుమతి ఇవ్వడమంటే ఇంతకంటే అప్రజాస్వామిక చర్య మరొకటి లేదు’’ అని భూమన దుయ్యబట్టారు. బీఏసీ సమావేశాన్ని జరపాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రాంతానికి చెందిన సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుతో చెప్పించి.. అదే ప్రాంతానికి చెందిన ఉపసభాపతి ఈ చర్చకు అనుమతి ఇవ్వడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఇంత ముఖ్యమైన బిల్లు శాసనసభలో ప్రవేశపెడుతుంటే ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగా సభకు హాజరు కాలేదన్నారు. తెలంగాణ బిల్లును సజావుగా నడిపించడం కోసమే ఆయన సభకు దూరంగా ఉన్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఎంతటి సమైక్య ద్రోహో దీన్ని బట్టే అర్ధమవుతోందన్నారు. ‘‘సీఎం, స్పీకర్ కలిసి కాంగ్రెస్ అధిష్టానం ఏమి చెబితే, అది గంగిరెద్దులా తల ఊపుతూ.. బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి కారణమయ్యారు. వీళ్లిద్దరూ విభజన ద్రోహులుగా చరిత్ర పుటలలోకి ఎక్కారు’’ అని అన్నారు. సమైక్యం కోసం పోరాడుతున్న సచివాలయ ఉద్యోగులపై కిరణ్ సర్కారు పోలీసులతో దాడి చేయించిందని, దీన్ని తమ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. అప్పుడు భాస్కరరావు.. ఇప్పుడు మనోహర్ స్పీకర్ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించారిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. గతంలో నాదెండ్ల భాస్కరరావు రాజ్యాంగ విరుద్ధంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారని, ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన మనోహర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారన్నారు. కలిసిరాని నేతలను నిలదీయండి: సమైక్య రాష్ట్రం కోసం అసెంబ్లీలో తాము ఆందోళన చేస్తూంటే కోస్తా, రాయలసీమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ స్థానాల్లో కూర్చుని చోద్యం చూశారే తప్ప కలిసి రావడం లేదని, అలాంటి వారిని నియోజకవర్గాల్లోని ప్రజలు నిలదీయాలని శోభా నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీఎల్పీ ముందు ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, పినిపె విశ్వరూప్‌తో కలిసి రాత్రి ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగానే సభకు రాలేదని విమర్శించారు. పైలీన్ తుపాను ఆపలేక పోయినా విభజన తుపానును ఆపుతానని ప్రగల్భాలు చెప్పిన కిరణ్.. తీరా బిల్లు వచ్చే సమయానికి తుర్రుమన్నారని విశ్వరూప్ అన్నారు. -
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల అరెస్ట్.. విడుదల
శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. తెలంగాణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న సీ బ్లాక్ ఎదుట ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ చేసిన ఉద్యోగులను వెంటనే విడుదల చేయాలని మిగిలిన ఉద్యోగులు సీఎం కార్యాలయం వద్ద మౌనదీక్షకు దిగారు. దీంతో పోలీసులు ఉద్యోగులను విడుదల చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సచివాలయ సీమాంధ్ర ఫోరం అధ్యక్షుడు యు. మురళీకృష్ణ, కేవీ కృష్ణయ్య, మురళీమోహన్, సుజాత తదితరులున్నారు. -
అసెంబ్లీలో ఓటింగ్ జరగాల్సిందే
మీ మొహం నచ్చలేదుగనుక విడగొడతానంటే కుదరదు న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశం ఉంది: జస్టిస్ పీసీ రావు అసెంబ్లీలో ఓటింగ్ జరగాల్సిందే సాక్షి, విజయవాడ : రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలో చర్చించి నిర్ణయం చెప్పాలంటే ఓటింగ్ జరగాల్సిందేనని ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ సీ (ఐ.టి.ఎల్.ఒ.ఎస్.)న్యాయమూర్తి జస్టిస్ పీసీరావు వ్యాఖ్యానించారు. ప్రతిష్టాత్మకమైన డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ అవార్డును ప్రముఖ న్యాయకోవిదుడు జస్టిస్ పాటిబండ్ల చంద్రశేఖర్‌రావు (పీసీరావు)కు సోమవారం విజయవాడలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘దేశంలో రాజ్యాంగం ప్రగతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన’ అంశాలపై ఉపన్యసించారు. ఒక తెలంగాణ మంత్రి, సీమాంధ్ర మంత్రిని మీరు మా ప్రాంతం మీదుగానే వెళ్లాలని బెదిరించే పరిస్థితులకు దిగజారిపోవడంపై ఆందోళన వ్యక్తంచేశారు. మీ మొహం నాకు ఇష్టం లేదు కాబట్టి రాష్ట్రాన్ని విడగొడతామంటే చెల్లదన్నారు. తెలంగాణ సెంటిమెంట్ అన్న కారణాలు న్యాయస్థానాల్లో చెల్లవని పేర్కొన్నారు. కేంద్రం తన విచక్షణాధికారాలను సక్రమంగా ఉపయోగించకపోతే దాన్ని కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉందన్నారు. ఓట్ల కోసం కాంగ్రెస్- టీఆర్ఎస్, తెలుగుదేశం- టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని, ఒకసారి చేతులు కలిపిన తర్వాత ఎక్కడో ఒకచోట ఈ డిమాండ్‌కు తలొగ్గాల్సి వస్తుందన్నారు. ముఖ్యమంత్రి నుంచి ఎంపీల వరకు వ్యతిరేకిస్తున్నా దీనిపై ఏకాభిప్రాయం వచ్చినందునే ముందుకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ చెప్పడం సరికాదన్నారు. అసలు ఉమ్మడి రాజధాని అంటే ఏమిటి? హైదరాబాద్ తెలంగాణలో రాజధానిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అద్దెదారులుగా ఉండాలా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అనే ప్రొవిజన్ లేదన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఓడిపోతే బిల్లులో ఇచ్చిన హామీలను ఎవరు అమలుపరుస్తారని ప్రశ్నించారు. బిల్లు అయిన తర్వాత కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందన్నారు. ఈ అడ్డగోలు విభజనను అడ్డుకునే అధికారాలు సుప్రీంకోర్టుకు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో పిన్నమనేని ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, డాక్టర్ సుధ, గోళ్లపల్లి నాగేశ్వరరావు, డాక్టర్ పట్టాభి రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘టీ’ బిల్లును వెనక్కి పంపేయాలి
పాలకొల్లు అర్బన్, న్యూస్‌లైన్ :తెలంగాణ రాష్ట్ర బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపించేయాలని, ఒకవేళ అసెంబ్లీలో తీర్మానానికి ప్రతిపాదిస్తే సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో బిల్లును వ్యతిరేకించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వ్యవహరిస్తే రాష్ట్రంలోని అన్ని పల్లెల్లో కాంగ్రె స్ జెండాలను తమ కార్యకర్తలు పీకిపారేస్తారని హెచ్చరించారు. పాలకొల్లులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లులో సీమాంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంతోపాటు, రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తి వ్యతిరేకంగా దానిని రూపొందించారని పేర్కొన్నా రు. రాష్ట్ర విభజనతో నీటి యుద్ధా లు జరుగుతాయని హెచ్చరించినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నా రు. 1991లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాలకోసం 13 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన జరిగితే కృష్ణా, గోదావరి జలాల కోసం ఈ రెండు రాష్ట్రాల ప్రజలు తగవులాడుకోవాలన్నారు. టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ పార్టీలు రాజకీయ జేఏసీగా ఏర్పడి బిల్లును వ్యతిరేకించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించి పోరాటం చేయాల్సిన అవసరం వుందన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టగానే ఏపీఎన్జీవోలంతా మెరుపు సమ్మెకు సిద్ధంకావాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు మైలాబత్తుల మైఖేల్‌రాజు, కోరం ముసలయ్య, రాష్ట్ర లీగల్ అడ్వయిజర్ డీకేవీ ప్రకాష్, పట్టణ అధ్యక్షుడు వర్థనపు మోహనరావు పాల్గొన్నారు. -
8 అంశాలను బిల్లులో తొలగించాలి
టీ రిసోర్స్ సెంటర్ చర్చలో వక్తలు తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకంగా ముసాయిదా బిల్లులో పొందుపరిచిన 8 అంశాలను పూర్తిగా తొలగించి.. ఎలాంటి ఆంక్షలూ లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ బిల్లు చట్టమయ్యే దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సీనియర్ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వర్రావు, టంకశాల అశోక్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ, ప్రొఫెసర్ గంటా చక్రపాణి, టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని 9 జిల్లాల్లో సెటిలర్స్‌కు లేని అభద్రతా భావం హైదరాబాద్‌లో ఉన్న వారికే ఎందుకని ప్రశ్నించారు. -
టీ-బిల్లు వెనక్కు తీసుకునే వరకు పోరు
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: తెలుగు జాతికి ప్రమాదకరంగా మారిన టి.బిల్లు ఆమో దం పొందకుండా, వెనక్కి తీసుకునేలా పోరాడాలని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు తిరుపతి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిం ది. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర విభజనకు కారకులైన రాజకీయ నాయకుల దిష్టిబొమ్మలను ఆర్టీసీ జేఏసీ నాయకులు శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విభజన చిచ్చు పెట్టిన కేంద్ర ప్రభుత్వం, వేర్పాటువాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జేఏసీ నాయకుడు ముని సుబ్రమణ్యం మాట్లాడుతూ అన్నదమ్ము ల్లా కలిసి మెలసి జీవిస్తున్న తెలంగాణ, సీమాంధ్రులను విభజించాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా విభజన కోసమని రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ తక్షణమే రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలుగు జాతి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్లు జలదంకి ప్రకాష్, లతారెడ్డి, విజయకుమార్ పాల్గొన్నారు. -
నోటీస్‌పై సంతకం చేసిన తెలంగాణ నేతలు
-
బిల్లుపై చర్చను బిఏసిలో నిర్ణయిస్తాం
-
దిగ్విజయ్ సింగ్ బిజీ బిజీ
-
టి. బిల్లు విమానంలో కాకుండా ఎడ్లబండిలో తీసుకు వస్తారా?
-
టి. బిల్లు విమానంలో కాకుండా ఎడ్లబండిలో తీసుకు వస్తారా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు తెలంగాణ బిల్లును యుద్ద విమానంలో తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం తెలుగువారిపై యుద్దం చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్ రావు శుక్రవారం హైదరాబాద్‌లో తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలంగాణ బిల్లును విమానంలో కాకపోతే ఎడ్లబండిలో తీసుకువస్తారా అంటూ చంద్రబాబును హరీష్ రావు ప్రశ్నించారు. మామ ఎన్టీఆర్‌కు వెన్ను పోటు పొడిచినప్పుడు అసెంబ్లీ స్పీకరుని తుని నుంచి హెలికాఫ్టర్‌లో తీసుకురాలేదా లేకుంటే ఆ సంగతి మరిచిపోయావా అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. చంద్రబాబుకు ఓ విధానం అంటూ లేదని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్ పార్టీ సమైక్యాంధ్ర అంటే చంద్రబాబు కూడా సమైక్యాంధ్ర అంటూ వారిని కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పార్టీ తోక పార్టీటా మారిందని వ్యాఖ్యానించారు. -
‘శీతాకాలం’లోనే టీ -బిల్లు
తెలంగాణ జేఏసీ నేతలతో దిగ్విజయ్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రక్రియను పూర్తిచేస్తామని, వాయిదాలుండవని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ స్పష్టంచేశారు. విభజనపై అనుమానాలొద్దని, ఆ ప్రక్రియ పూర్తరుునట్టేనని చెప్పారు. అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే జనవరి మొదటి వారంలోనే తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథిగృహంలో గురువారం తనను కలిసిన తెలంగాణ జేఏసీ నేతలతో సుమారు అరగంటకుపైగా ఆయన చర్చించారు. రాష్ట్ర విభజన గడువు, ముసాయిదా బిల్లులో సవరణలు, విభజన అనంతరం రాజకీయ పరిస్థితులు, జేఏసీ మద్దతు, జేఏసీలో ఆశావహులకు వచ్చే ఎన్నికల్లో అవకాశం వంటి అంశాలు ప్రస్తావనకొచ్చారుు. ఏఐసీసీ కార్యదర్శి తిరునావుక్కరసు, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, జేఏసీ చైర్మన్ ఎం. కోదండరాం, నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, సి. విఠల్, కత్తి వెంకటస్వామి, అద్దంకి దయాకర్, రాజేందర్‌రెడ్డి, వి. శ్రీనివాస్‌గౌడ్, వి. మమత, దేవీప్రసాద్, కారెం రవీందర్‌రెడ్డి, మాదు సత్యం, రసమయి బాలకిషన్, ఎం. మణిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీ.జేఏసీ నేతలు అందించిన సమాచారం ప్రకారం.. ‘అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలకు తక్కువ సమయమే ఉంది కదా? శీతాకాల సమావేశాల్లోనే విభజన ప్రక్రియ పూర్తి అవుతుందా?’ అని ప్రశ్నించగా.. ‘మీరు చూస్తున్నారు కదా.. వీలైనంత వేగంగా విభజన ప్రక్రియను పూర్తిచేయాలనుకుంటున్నాం. ఈ సమావేశాల్లోనే చర్చలు పూర్తవుతాయి. ఇతర ప్రాంతాల సమస్యలను కూడా పరిష్కరించాల్సి ఉంటుంది కదా. విభజన అంశాన్ని పక్కనబెట్టి వేరే ఇతర సమస్యలేమైనా ఉంటే చెప్పండి’ అని దిగ్విజయ్ అన్నారు. ఇప్పుడు మీ పనికోసం... తర్వాత మా పనికోసం వస్తా తెలంగాణ విభజన తర్వాత రాజకీయ పరిస్థితులపై, జేఏసీ నేతల భవిష్యత్తుపై దిగ్విజయ్ ఆరాతీశారు. విభజన వల్ల ఏ పార్టీకి లాభం అని, కాంగ్రెస్ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ‘ఇప్పుడు వచ్చింది మీ పనికోసం (తెలంగాణ ఏర్పాటుకోసం). భవిష్యత్తులో మా పనికోసం వస్తా. మీ మద్దతు కావాలి. మీరు మాతో ఉన్నారా? లేదా?’ అని అడిగారు. తెలంగాణ వచ్చిన తర్వాత తమతో పాటు తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్‌కు కృతజ్ఞులై ఉంటారని జేఏసీ నేతలు సమాధానం ఇచ్చారు. ‘ప్రజలు కోరుకున్నట్టుగా, శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ ఇస్తే వారు కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తారు. అయితే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరువల్ల నష్టం జరుగుతోంది. ఆయనను కట్టడి చేయండి’ అని కోరారు. ఎన్నికల్లో టికెట్టు కోసం తీవ్రస్థాయిలో పోరాడుతున్న ఒక జేఏసీ నాయకుడు.. ‘తెలంగాణపై నిర్ణయం తీసుకున్న తర్వాత కాంగ్రెస్ బలపడ్డది. ఇందిరాగాంధీ స్థాయిలో సోనియాగాంధీకి ప్రతిష్ట పెరిగిపోయింది’ అంటూ పొగిడారు. జేఏసీ నేతలు ఎవరికైనా రాజకీయంగా ఆసక్తి ఉంటే వచ్చే ఎన్నికల్లో తాము అవకాశాలు కల్పిస్తామని దిగ్విజయ్ చెప్పారు. బిల్లుకు సవరణలు కోరిన నేతలు ఉమ్మడి హైకోర్టు కుదరదని, ఉద్యోగుల విభజనపై స్పష్టత ఇచ్చే విధంగా ముసాయిదా బిల్లులో సవరణలు చేయాలని జేఏసీ నేతలు దిగ్విజయ్‌సింగ్‌ను కోరారు. నదీ జలాల పంపకం, నిర్వహణకు ప్రత్యేక బోర్డు ఉంటే అభ్యంతరంలేదని నివేదించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2 లేదా 3 ఏళ్లు చాలునన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకున్నందుకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు, కేంద్ర కేబినెట్‌కు, కాంగ్రెస్ పార్టీ నేతలకు జేఏసీ నాయకులు కృతజ్ఞత లు తెలిపారు. టీఆర్ఎస్ భవితవ్యమేమిటి?: తెలంగాణలో టీఆర్ఎస్ భవితవ్యం, కాంగ్రెస్‌తో ఆ పార్టీ సంబంధాలు ఎలా ఉంటాయంటూ తిరునావుక్కరసును జేఏసీ నేతలు ప్రశ్నించారు. ‘టీఆర్ఎస్ విలీనమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది సాధ్యం కాకుంటే విడిగానే పోటీచేస్తారు. పొత్తువల్ల అంతగా ప్రయోజనం ఉండకపోవచ్చు’ అని ఆయన చెప్పారు. కాగా, దిగ్విజయ్‌ను కలిసి బయటకు వస్తున్న జేఏసీ నేతలకు కేవీపీ రామచంద్రరావు ఎదురయ్యారు. ఆయనే కల్పించుకుని.. ‘పక్క రాష్ట్రానికి చెందిన మమ్ములను కూడా దృష్టిలో పెట్టుకోండి. తెలంగాణ వాళ్లతోనే మాట్లాడతామంటే ఎలా? భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు. ఏఐసీసీ కార్యదర్శులుగా మీ రాష్ట్రానికి ఇన్చార్జిలుగా మేమే రావొచ్చు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దామోదర, జానా, నారాయణతో జేఏసీ నేతల భేటీ తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో ఐక్యంగా ఉండాలని కోరేందుకుగాను సీపీఐ, కాంగ్రెస్ నేతలను గురువారం జేఏసీ నేతలు కలిశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రి కె.జానారెడ్డితో జేఏసీ నేతలు విడివిడిగా సమావేశమయ్యారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. బిల్లుపై త్వరగా చర్చలు ముగిసేందుకు, రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకుగాను తెలంగాణ ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలని కోరారు. తెలంగాణకు తాము మద్దతుగా ఉన్నామని, దీనిపై అసెంబ్లీలో అండగా ఉంటామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, శాసనసభాపక్ష నాయకులు గుండా మల్లేష్ హామీనిచ్చారు. సభలో అవసరమైన అన్ని వ్యూహాలను అమలుచేస్తామని, ఏమైనా సాంకేతిక అంశాలుంటే వెంటనే సలహాలు ఇచ్చి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మంత్రి జానారెడ్డి జేఏసీ నేతలను కోరారు. -
UPAలో ముసలం
-
రేపు అసెంబ్లీకి టి బిల్లు..?