తెలుగు జాతికి ప్రమాదకరంగా మారిన టి.బిల్లు ఆమో దం పొందకుండా, వెనక్కి తీసుకునేలా పోరాడాలని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు తిరుపతి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిం ది.
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: తెలుగు జాతికి ప్రమాదకరంగా మారిన టి.బిల్లు ఆమో దం పొందకుండా, వెనక్కి తీసుకునేలా పోరాడాలని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలకు తిరుపతి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చిం ది. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర విభజనకు కారకులైన రాజకీయ నాయకుల దిష్టిబొమ్మలను ఆర్టీసీ జేఏసీ నాయకులు శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విభజన చిచ్చు పెట్టిన కేంద్ర ప్రభుత్వం, వేర్పాటువాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం జేఏసీ నాయకుడు ముని సుబ్రమణ్యం మాట్లాడుతూ అన్నదమ్ము ల్లా కలిసి మెలసి జీవిస్తున్న తెలంగాణ, సీమాంధ్రులను విభజించాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా విభజన కోసమని రాష్ట్రానికి వచ్చిన దిగ్విజయ్ తక్షణమే రాష్ట్రం వదిలి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే తెలుగు జాతి ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్లు జలదంకి ప్రకాష్, లతారెడ్డి, విజయకుమార్ పాల్గొన్నారు.