తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకంగా ముసాయిదా బిల్లులో పొందుపరిచిన 8 అంశాలను పూర్తిగా తొలగించి.. ఎలాంటి ఆంక్షలూ లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.
టీ రిసోర్స్ సెంటర్ చర్చలో వక్తలు
తెలంగాణ ఆకాంక్షకు వ్యతిరేకంగా ముసాయిదా బిల్లులో పొందుపరిచిన 8 అంశాలను పూర్తిగా తొలగించి.. ఎలాంటి ఆంక్షలూ లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ బిల్లు చట్టమయ్యే దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సీనియర్ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వర్‌రావు, టంకశాల అశోక్, తెలంగాణ జర్నలిస్టు ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ, ప్రొఫెసర్ గంటా చక్రపాణి, టీఎన్జీవో అధ్యక్షుడు దేవిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని 9 జిల్లాల్లో సెటిలర్స్‌కు లేని అభద్రతా భావం హైదరాబాద్‌లో ఉన్న వారికే ఎందుకని ప్రశ్నించారు.