
'మున్సిపల్ కార్మికులనూ మోసం చేశారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు, మహిళలు, విద్యార్థులను నిలువునా ముంచారు... అదే విధంగా మున్సిపల్ కార్మికులను కూడా మోసగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారధి ఆరోపించారు. శనివారం హైదరాబాద్లో పార్థసారధి మాట్లాడుతూ....మున్సిపల్ కార్మికులపై దాడి హేయమైన చర్యగా పార్థసారధి అభివర్ణించారు.
ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎన్నికల ముందు ఒకలా తర్వాత మరోలా వ్యహరించడం చంద్రబాబు నైజం అని ఎద్దేవా చేశారు. తక్షణమే మున్సిపల్ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని చంద్రబాబును కె. పార్థసారధి డిమాండ్ చేశారు.