మర్పల్లి, న్యూస్‌లైన్: తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి రాగానే రైతుల రుణాలను మాఫీ చేస్తామని వికారాబాద్ అసెంబ్లీ టీఆర్‌ఎస్ అభ్యర్థి బి.సంజీవరావు పేర్కొన్నారు. మోమిన్‌పేట్ మండల పరిధిలోని ఎన్కతల, దేవరాంపల్లి, చీమలదరి, రాంనాథ్‌గుడుపల్లి, వనంపల్లి, అమ్రాదికుర్ధు, కోల్‌కుందా, రావులపల్లి, మోమిన్‌పేట్ గ్రా మాల్లో సోమవారం ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ రైతులు బ్యాంకుల్లో తీసుకున్న రూ.లక్షలోపు పంట రుణాలతోపాటు, పొదుపు సంఘాల్లో మహిళలు తీసుకున్న రుణాలు సైతం మాఫీ చేస్తామన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నేరవేరాలంటే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులను గెలిపించుకొనేందుకు కారు గుర్తుకే ఓట్లు వేయాలన్నారు. చెవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్‌రెడ్డికి, వికారాబాద్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేస్తున్న తనను గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజల ఆకాంక్ష మేరకు బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకొనేందుకు వీలుంటుందన్నారు. ఆదర్శంగా ఉండే విధంగా వికారాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మల్లారెడ్డి, మండల ఇన్‌చార్జి మహంత్‌స్వామి, నాయకులు నరేందర్‌రెడ్డి, విఠల్, నరోత్తంరెడ్డి, బుజంగ్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, ఆనందం, శంకరప్ప, మోహన్‌రెడ్డి, అంజిరెడ్డి, గోపాల్‌రెడ్డి, మమిపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మర్పల్లిలో...
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవా రం మర్పల్లిలో టీఆర్‌ఎస్ నాయకులు సుడిగాలి పర్యటన నిర్వహించారు. బూచన్‌పల్లి, కొత్లాపూర్, కల్‌ఖోడ, పట్లూర్, పంచలింగాల, తుమ్మలపల్లి. గుండ్లమర్పల్లి గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించి టీఆర్‌ఎస్ చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్‌రెడ్డికి, వికారాబాద్ అసెంబ్లీ అభ్యర్థి సంజీవరావులను గెలిపించేందుకు కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు మల్లయ్య, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, నాయకులు కొండల్‌రెడ్డి, నాయబ్‌గౌడ్, బాల్‌రెడ్డి, రవివర్మ, అబ్రహం, మల్లారెడ్డి, రాంరెడ్డి, మల్లేశం, సురేష్ తదితరులున్నారు. ఈ సందర్భంగా గుండ్ల మర్పల్లి గ్రామంలోని పలువురు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు టీఆర్‌ఎస్‌లో చేరినట్లు కొండల్‌రెడ్డి తెలిపారు.
అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ
Published Mon, Apr 28 2014 11:38 PM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM
Advertisement
Advertisement