
వచ్చేది వైఎస్ జగన్ ప్రభుత్వమే: మైసూరారెడ్డి
హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎంవీ మైసూరా రెడ్డి అన్నారు. ప్రజలు.. జగన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేది వైఎస్ జగన్ ప్రభుత్వమేనని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ-టీడీపీ మధ్య ఓట్లశాతంలో తేడా 4 మాత్రమేనని తెలిపారు. జడ్పీటీసీ-ఎంటీసీ ఎన్నికల్లో ఈ తేడా 2.9 శాతంగా ఉందన్నారు.
లోక్సభ, శాసనస ఎన్నికల సమయానికి రాజకీయంగా చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు. రాజకీయ సన్యాసం పుచ్చుకున్న లగడపాటికి సర్వేలతో పనేంటని ప్రశ్నించారు. ఆయన సర్వేలు బెట్టింగ్ల కోసమే అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తమ పార్టీకి 110 నుంచి 125 అసెంబ్లీ సీట్లు వస్తాయని తెలిపారు. మొత్తం 20 పైగా ఎంపీ సీట్లు వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.