'విజన్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్' | YS Jagan Mohan Reddy has vision on state development, says yv subba reddy | Sakshi
Sakshi News home page

'విజన్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్'

Published Wed, Apr 23 2014 1:42 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

'విజన్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్' - Sakshi

'విజన్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్'

ప్రకాశం: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్దిపై స్పష్టమైన విజన్ ఉన్న నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు. జగన్ సీఎం అయితే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇళ్లులేని వారందరికీ  పక్కాఇళ్ల నిర్మాణం చేపడతారని హామీయిచ్చారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే అమ్మ ఒడి పథకం, రైతులను ఆదుకునేందుకు 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారన్నారు. డ్వాక్రా మహిళల కోసం వారు తీసుకున్న రుణాలను రద్దు చేస్తారన్నారు.సంక్షేమ రాజ్యం జగన్‌తోనే సాధ్యమన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి వైఎస్సార్ సీపీని గెలిపించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement