'చంద్రబాబు 24 గంటలు ప్రజల్ని మోసం చేస్తాడు'
'చంద్రబాబు 24 గంటలు ప్రజల్ని మోసం చేస్తాడు'
Published Sun, Apr 27 2014 1:46 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
ప్రకాశం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం 20 గంటలు కష్టపడే నాయకుడు అని ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అయితే చంద్రబాబు ప్రజలను 24గంటలు మోసం చేసే నాయకుడని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి విశ్వసనీయతను వైఎస్ జగన్ కుంటే చంద్రబాబు నుంచి లోకేష్ నేర్చుకున్నది గ్లోబెల్స్ ప్రచారమని వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు.
ప్రకాశం జిల్లాలోని మర్రిపూడి, పొన్నలూరు, జరుగుమల్లి మండలాల్లో వైవీ సుబ్బారెడ్డి ప్రచారం నిర్వహించారు. మర్రిపూడిలో మండల కన్వీనర్ రమణా రెడ్డి ఆధ్వర్యంలో వైవీ సుబ్బారెడ్డికి భారీ బైక్ ర్యాలీతో కార్యకర్తలు స్వాగతం పలికారు.
Advertisement
Advertisement