వైఎస్ఆర్ సీపీకి పట్టం కట్టిన పట్టణ జనం
హైదరాబాద్ : ఆవిర్భావించి నాలుగేళ్లే అయినా మున్సిపల్ ఎన్నికల్లో 30 ఏళ్ల టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై తమది చెరిగిపోని అభిమానమని సీమాంధ్ర పట్టణ ఓటర్లు నిరూపించారు. సంస్థాగత బలం, పటిష్టమైన కేడర్ లేకున్నా సీమాంధ్రలో అనేక మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది.
సాధారణంగా ఓ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పటిష్టమైన కేడర్ ఏర్పడుతుంది. సంస్థాగతంగా పార్టీ బలోపేతమవుతుంది. అధికారంలో ఉంటే ప్రజల్లోకి చొచ్చుకుపోయే అవకాశాలు అధికం. అయితే నాలుగేళ్ల క్రితం ఏర్పడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు అధికారంలోకి రాలేదు. కాని అంతులేని ప్రజాభిమానం సంపాదించడంలో మాత్రం మిగిలిన పార్టీలన్నింటి కంటే ముందుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం, మహానేత వైఎస్‌ఆర్ సంక్షేమ రాజ్యాన్ని కాంక్షిస్తున్న పట్టణ జనం వైఎస్ఆర్ సీపీకి పట్టం కట్టారు.