కొండపి అసెంబ్లీ అభ్యర్థి జూపూడి ప్రభాకరరావు
కొండపి, న్యూస్‌లైన్ : దివంగత సీఎం వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే వైఎస్సార్ సీపీకి పట్టుకొమ్మలని ఆ పార్టీ కొండపి అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు పేర్కొన్నారు. పాలకుల నిర్లక్ష్యంతో నీరుగారిన వైఎస్సార్ పథకాలు ఊపిరిపోసుకోవాలంటే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సారథ్యం రాష్ట్రానికి అవసరమన్నారు. కొండపిలోని పార్టీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
సమావేశానికి ముఖ్య అతిథిగావైఎస్సార్ సీపీ కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి పోతుల రామారావు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా జూపూడి మాట్లాడుతూ.. ఎన్నికలకు కేవలం 18 రోజులే సమయం ఉందని, ప్రతి నాయకుడు, కార్యకర్త గ్రామాల్లో ఓటర్లను కలసి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే జరిగే మేలు గురించి వివరించాలని సూచించారు. అందరం సమష్టిగా కృషి చేసి పార్టీ విజయానికి దోహదపడదామన్నారు. ప్రతి కార్యకర్త కష్టాన్ని పార్టీ గుర్తిస్తుందని చెప్పారు. కార్యకర్తలు, నాయకులకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఎప్పుడైనా తనను కలవచ్చన్నారు. గతంలో కొండపి ఎమ్మెల్యే పని చేసిన పోతుల రామారావు సహకారం మనకు అన్నివేళలా ఉంటుందని తెలిపారు.
పోతుల రామారావు మాట్లాడుతూ.. పార్టీ పథకాల గురించి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. విద్యావంతుడైన జూపూడిని గెలిపించుకోవడం ద్వారా నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. సమావేవంలో పొగాకు బోర్డు సభ్యుడు రావూరి అయ్యవారయ్య, కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ బీ ఉపేంద్ర, నాయకులు ఆరికట్ల వెంకటేశ్వర్లు, రావెళ్ల కోటేశ్వరరావు, వల్లంరెడ్డి రమణారెడ్డి, పోకూరి కోటేశ్వరరావు, వాకా ఆదిరెడ్డి, పూనాటి శ్రీనివాసులు, గోవిందు కృష్ణమూర్తి, భువనగిరి సత్యనారాయణ, గుమ్మళ్ల రమణయ్య, కొండయ్య, పల్లె శివరావు, రంగయ్య, కోటిరెడ్డి, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.
మహానేత పథకాలే వైఎస్సార్ సీపీకి పట్టుకొమ్మలు
Published Sat, Apr 19 2014 4:20 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement