jupudi prabakar rao
-
బడి లేదు.. భవిష్యత్తూ లేదు.. కూటమి ప్రభుత్వంపై జూపూడి ఫైర్
సాక్షి, తాడేపల్లి : బడి లేదు.. భవిష్యత్తూ లేదు. ఆరు నెలల కూటమి పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు. కూటమి ప్రభుత్వ వైఫల్య పాలనపై వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాయలంలో జూపూడి ప్రభాకర్‌రావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కేసింది. 2004కి ముందు ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో పాదయాత్రలో చూసిన పరిస్థితులతో చలించిపోయి మొదటి సంతకం రైతులకు ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకారం చుట్టారు.మరోవైపు ఫీజులు చెల్లించలేక పిల్లలు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా విద్యా విప్లవం తీసుకొచ్చారు. ఆ పథకం ఎందరో విద్యార్థుల జీవితం మార్చింది. ఎందరో సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మళ్లీ 2004కి ముందు పరిస్థితులను తీసుకొచ్చారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో..:2019లో జగన్ సీఎం అయ్యాక, రాష్ట్రంలో మళ్లీ విద్యావిప్లవం మొదలైంది. ప్రభుత్వ స్కూళ్లు సమూలంగా మార్చేశారు. వాటిలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి కొత్త ఒరవడికి నాంది పలికారు. మంచి పౌష్టికాహారం, రోజుకో మెనూతో మధ్యాహ్న భోజన పథకం గోరుముద్దను అమలు చేశారు. అంగన్వాడీల్లో సంపూర్ణ పోషణ అమలు చేశారు. పిల్లలకు పూర్తి ఫీజు చెల్లిస్తూ విద్యాదీవెన అమలు చేశారు. బిడ్డ చదువుల కోసం తల్లి ఫీజులు కట్టే విధంగా మహిళా సాధికారతకు అర్థం తెచ్చేలా, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆ మొత్తం నేరుగా జమ చేశారు.మళ్లీ అంతా అస్తవ్యస్తం:కూటమి ప్రభుత్వం రాగానే విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేసేశారు. గోరుముద్ద పథకాన్ని మూలన పడేశారు. ఇంగ్లిష్ మీడియం ఆగిపోయింది. అమ్మ ఒడి లేదు. విద్యావ్యవస్థను పూర్తిగా తొక్కేశారు. ఆరు నెలలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైంది.ఉదా: ప్రకాశం జిల్లా జె.పంగులూరులో ఫీజు కట్టలేదని ఓ విద్యార్థిని కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపేసింది.పిల్లలు ఫీజు బకాయిలు కట్టలేదంటూ చాలాచోట్ల వారికి టీసీ ఇవ్వడం లేదు. ఇంకా చాలా మంది పిల్లలు ఫీజులు కట్టలేక, విద్యార్థులు కూలీ పనులకు పోతున్నారు.జగన్‌పై కక్ష పిల్లలపై చూపొద్దు:జగన్ మార్క్ విధానాలు ఎక్కడా కనిపించకూడదనే అక్కసుతోనే కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును పథకం ప్రకారం కాలరాస్తోంది. తల్లిదండ్రుల ఆశలు చిదిమేస్తోంది. మీకేదైనా కక్ష ఉంటే మా మీద తీర్చుకోండి. అమాయక, పేద ప్రజల భవిష్యత్తును నాశనం చేయొద్దు. విద్యను నమ్ముకుని జీవితాలను బాగు చేసుకోవాలని కలలు కంటున్న వారి నమ్మకాన్ని కాలరాయొద్దు. నిజానికి 2019లో చంద్రబాబు దిగిపోతూ పెట్టిన రూ.2,800 కోట్ల ఫీజు బకాయిలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించింది. ఆరు నెలల కూటమి పాలనలో విద్య, వైద్య రంగాలు మూలన పడ్డాయి. పేకాట క్లబ్‌లు, మద్యం షాపులు విచ్చలవిడిగా వెలిశాయి.2019–24. విద్యారంగం వ్యయం:అయిదేళ్లలో ఫీజు రీయింబర్స్మెంట్ వ్యయం రూ.12,609 కోట్లు.మనబడి నాడు–నేడు మొదటి దశలో రూ. 3,669 కోట్లతో 15,715 బడుల్లో సమూల మార్పులు. రెండో విడతలో రూ.8వేల కోట్ల వ్యయంతో 22,344 స్కూళ్ల సమగ్ర అభివృద్ధి.అమ్మ ఒడి పథకంలో 44,48,865 మంది తల్లుల ఖాతాల్లో రూ.26,067 కోట్లు జమ.విద్యాదీవెనలో 29,65,930 మంది మంది పిల్లలకు మేలు చేస్తూ, రూ.12,609 కోట్ల ఫీజు చెల్లింపు.వసతి దీవెన కింద 25,17,245 మందికి రూ.4,275 కోట్లు.జగనన్న విదేశీ విద్యాదీవెనలో దాదాపు 408 మందికి రూ.107 కోట్లువిద్యాకానుక కిట్లు. 47,40,421 మంది పిల్లలకు లబ్ధి. వ్యయం రూ.3,366 కోట్లు.8వ తరగతి పిల్లలకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లు.గోరుమద్దు పథకంలో 43,26782 మంది పిల్లలకు మేలు చేస్తూ రూ.6,568 కోట్లు ఖర్చు.అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు, చిన్నారుల పౌష్టికాహారం కోసం సంపూర్ణ పోషణ కింద రూ.9,894 కోట్లు ఖర్చు.శానిటరీ న్యాప్కిన్స్ కోసం రూ.32 కోట్లు.6వ తరగతి నుంచే టోఫెల్ శిక్షణ.2024–25లో టీచర్ల టీచింగ్ సామర్థ్యం పెంచేందుకు ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పిల్లలకు ఐబీలో విద్యాబోధన మొదలు. అలా 2035 నాటికి పదో తరగతి పిల్లలకు సర్టిఫికెట్.అలా గత ఐదేళ్లలో కేవలం విద్యారంగంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం రూ.73 వేల కోట్లు. జగన్ ఒక్కరే అంత ఖర్చు చేస్తే, మీ మూడు పార్టీలు కలిసి చేసే ఖర్చెంతో చూపించాలని జూపూడి ప్రభాకర్‌రావు డిమాండ్ చేశారు.ఫీజు బకాయిలు చెల్లించాలి: రవిచంద్ర, వైస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా విద్యాదీవెన, వసతి దీవెనకి ఒక్క రూపాయి కేటాయించలేదు. పైగా మంత్రి నారా లోకేశ్ గత ప్రభుత్వం రూ.6500 కోట్లు బకాయిలు పెట్టిపోయిందని మాట్లాడుతున్నారు. నిజానికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి రూ.502 కోట్లు మాత్రమే. ఎన్నికల కోడ్ వల్ల ఆ చెల్లింపు కోసం అనుమతి తీసుకున్నా, ఇవ్వకుండా చంద్రబాబే అడ్డుకున్నారు. ఫలితంగా చివరి క్వార్టర్ ఫీజు చెల్లింపు ఆగిపోయింది. కాలేజీల యాజమాన్యాలు లోకేశ్‌ని కలిసి రీయింబర్స్మెంట్ డబ్బులు గురించి అడిగినా వారిని పట్టించుకోలేదు. ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ విద్యార్థుల నుంచి ఆయా విద్యాసంస్థలు అండర్‌టేకింగ్ లెటర్లు తీసుకుంటున్నాయి. ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడంతో, అవి విద్యార్థులే చెల్లించేలా వారితో ఒప్పందాలు చేసుకుంటున్న దుస్థితి.విద్యా రంగంలో ఏ పథకానికి ఎంత నిధులు కేటాయించారో కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారు. కానీ అదే చంద్రబాబు పెట్టిన బకాయిలను వైఎస్ జగన్ సీఎంగా ఉండగా చెల్లించి పెద్ద మనసు చాటుకున్నారు. -
తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు.. జూపూడి ప్రభాకర్ రావు రియాక్షన్..
-
కోనేటి ఆదిమూలం, పవన్ కు జూపూడి పంచ్
-
KSR Live Show: బాబు కాకి లెక్కలపై జూపూడి కామెంట్స్
-
మహానేత పథకాలే వైఎస్సార్ సీపీకి పట్టుకొమ్మలు
కొండపి అసెంబ్లీ అభ్యర్థి జూపూడి ప్రభాకరరావు కొండపి, న్యూస్‌లైన్ : దివంగత సీఎం వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే వైఎస్సార్ సీపీకి పట్టుకొమ్మలని ఆ పార్టీ కొండపి అసెంబ్లీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు పేర్కొన్నారు. పాలకుల నిర్లక్ష్యంతో నీరుగారిన వైఎస్సార్ పథకాలు ఊపిరిపోసుకోవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యం రాష్ట్రానికి అవసరమన్నారు. కొండపిలోని పార్టీ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగావైఎస్సార్ సీపీ కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి పోతుల రామారావు హాజరయ్యారు. ఈ సంద ర్భంగా జూపూడి మాట్లాడుతూ.. ఎన్నికలకు కేవలం 18 రోజులే సమయం ఉందని, ప్రతి నాయకుడు, కార్యకర్త గ్రామాల్లో ఓటర్లను కలసి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే జరిగే మేలు గురించి వివరించాలని సూచించారు. అందరం సమష్టిగా కృషి చేసి పార్టీ విజయానికి దోహదపడదామన్నారు. ప్రతి కార్యకర్త కష్టాన్ని పార్టీ గుర్తిస్తుందని చెప్పారు. కార్యకర్తలు, నాయకులకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని, ఎప్పుడైనా తనను కలవచ్చన్నారు. గతంలో కొండపి ఎమ్మెల్యే పని చేసిన పోతుల రామారావు సహకారం మనకు అన్నివేళలా ఉంటుందని తెలిపారు. పోతుల రామారావు మాట్లాడుతూ.. పార్టీ పథకాల గురించి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సూచించారు. విద్యావంతుడైన జూపూడిని గెలిపించుకోవడం ద్వారా నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందన్నారు. సమావేవంలో పొగాకు బోర్డు సభ్యుడు రావూరి అయ్యవారయ్య, కృష్ణారెడ్డి, మండల కన్వీనర్ బీ ఉపేంద్ర, నాయకులు ఆరికట్ల వెంకటేశ్వర్లు, రావెళ్ల కోటేశ్వరరావు, వల్లంరెడ్డి రమణారెడ్డి, పోకూరి కోటేశ్వరరావు, వాకా ఆదిరెడ్డి, పూనాటి శ్రీనివాసులు, గోవిందు కృష్ణమూర్తి, భువనగిరి సత్యనారాయణ, గుమ్మళ్ల రమణయ్య, కొండయ్య, పల్లె శివరావు, రంగయ్య, కోటిరెడ్డి, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతానికి ఐక్యత అవసరం
వల్లూరు(టంగుటూరు),న్యూస్‌లైన్: తమ పార్టీలో పాతవారికి సముచిత స్థానం ఇస్తామని.. అలాగే కొత్తవారినీ ఆహ్వానిస్తున్నామని వైఎస్ఆర్సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు తెలిపారు. వల్లూరులో గురువారం నిర్వహించిన గడపగడపకూ వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా పనిచేస్తేనే పార్టీ బలోపేతం అవుతుందని సూచించారు. పార్టీని ఆదుకునేవారికి ప్రత్యేక గుర్తింపు ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పారు. దివంగత నేత వైఎస్ఆర్ ఆశయ సాధనకోసం వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందన్నారు. ప్రజల విశ్వాసం నుంచి వైఎస్ కుటుంబాన్ని వేరుచేయడం ఎవరితరమూ కాదని తెలిపారు. ఆ కుటుంబంపై చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టాలని కోరారు. చంద్రబాబును ఎవరూ విశ్వసించడంలేదన్నారు. 9ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదని చెప్పారు. నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జగన్ న్యాయకత్వాన్ని కోరుకుంటున్నారని, వైఎస్ సంక్షేమ పథకాలను తిరిగి సమర్థవంతంగా కొనసాగించగల నాయకుడు జగన్ మాత్రమేనన్నారు. అందుకే ఆయన సీఎం కావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. వైఎస్ తమ మనిషని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఆయన పథకాలను ఎందుకు మూలన పెడుతోందని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్‌లకు దీటుగా జగన్ పనిచేయగలరని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని, బూత్‌కమిటీలు ఏర్పాటు చే సి.. సమర్థులైన వారిని సభ్యులుగా నియమించాలని కోరారు. పార్టీ తీర్థం పుచ్చుకున్న హనుమారెడ్డి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ కుందం హనుమారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తమ గ్రామానికి దివంగత నేత వైఎస్ చేసిన సేవలకు కృతజ్ఞతగా పార్టీలో చేరినట్లు హనుమారెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్న ఓకే ఒక నాయకుడు జగన్ మాత్రమేనని అభినందించారు. మండల కన్వీనర్ బొట్లా రామారావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి తాటితోటి నరిసింగరావు, వల్లూరమ్మ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ ఉప్పలపాటి నర్సరాజు, పొందూరు సర్పంచ్ చిట్నీడి రంగారావు, ఎస్సీసెల్ రాష్ట్ర సభ్యుడు చెక్కా రాజేశ్వరరావు, మండల కన్వీనర్ దాసరి సుబ్బారావు, కుందం మోహనరెడ్డి, యువజన నాయకుడు కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
రాష్ట్ర విభజనపై టీడీపీ వైఖరి ప్రకటించాలి
పర్చూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన విషయంలో నిర్ణయాన్ని వెల్లడించకుండా రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ వెంటనే తన వైఖరి ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు డిమాండ్ చేశారు. సోమవారం పర్చూరు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిగా మారిందన్నారు. వైఎస్ఆర్ కుటుంబంపై కేంద్రం చేస్తున్న కుట్రలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు భాగస్వాములయ్యారని ఆరోపించారు. కేవలం కేంద్రానికి గులాంగిరీ చేయలేదన్న సాకుతో రాష్ట్రాన్ని విభజించాలన్న కేంద్రం నిర్ణయాన్ని వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. టీడీపీ విధానం చెప్పకుండా చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, రామోజీరావుల ఆస్తులను పరిరక్షించేందుకు కేసీఆర్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజనను వైఎస్సార్ సీపీ ప్రజాస్వామ్య పద్ధతిలో అడ్డుకుంటుందని చెప్పారు. ప్రజలు వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారని సర్వేలు సైతం చెబుతున్నాయన్నారు. ఒకవేళ రాష్ట్రం విడిపోయినా సీమాంధ్రలోని 175 స్థానాల్లో 150 స్థానాలు కచ్చితంగా గెలిచే శక్తి వైఎస్సార్ సీపీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అమలవుతాయన్నారు. ముందుగా స్థానిక బొమ్మల సెంటర్లోని అంబేద్కర్, వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి జూపూడి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మనుబోతు వెంకటరెడ్డి, దళిత నేతలు జూపూడి మార్కు, జంగా అనిల్, నలిగల కిషోర్, గేరా స్వరాజ్‌కుమార్, బండి రాంబాబు, బిళ్లా బాబురావు, రేగులగడ్డ దయారావు, విష్ణుమూర్తి, వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు యద్దనపూడి హరిప్రసాద్, కొసనా రాంప్రసాద్, గాజుల రమేష్, తమ్మా అమ్మిరెడ్డి, దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కొల్లా శ్రీహరిరావు, ఆకుల మధుబాబు, పొదిలి రాఘవ తదితరులు పాల్గొన్నారు.