మరువలేని మహానేతకు చిత్రాంజలి...
కోటేశ్వరరావు ఇప్పటికి 25కి పైగా వైయస్ చిత్రాలను గీశారు. ఆ చిత్రాలలో వైయస్ జీవనరేఖలు కనిపిస్తాయి. రాజసంతో ఉట్టి పడే తేజస్సు, ఆయన ప్రవేశపెట్టిన పథకాల చల్లని వెలుగు కనిపిస్తుంది.
సమాజంలోని అట్టడుగు వర్గాల సమస్యలపై చిత్రాలు గీసి వాటి తీవ్రతను తెలియజేస్తున్నారు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన చింతలపల్లె కోటేశ్వరరావు. ఆయన కుంచె నుండి రూపుదాల్చుకున్న ప్రతీ చిత్రం సందే శాత్మకమే. అవి సామాన్యుడిని సైతం ఆలోచింపచేసి, సామాజిక బాధ్యతను గుర్తుచేస్తాయి. ప్రతీరోజూ కుంచెపట్టుకొని బొమ్మ గీయకపోతే ఏమీ తోచదు. ఇప్పటికీ కొన్ని వందలకు పైగా కళాఖండాలను గీశారు. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
కోట్లాది ప్రజల హృదయాల్లో కొలువైవున్న మహా నేత వైయస్ రాజశేఖరరెడ్డి అంటే కోటేశ్వరరావుకు ఎంతో అభిమానం. ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో లబ్ధిపొందిన వారిలో కోటేశ్వరరావు కూడా ఒకరు. ఆ మహానేత మర ణాంతరం రాష్ట్రం అల్లకల్లోలంగా మారిపోయింది. ఆయన లేరన్నది ఇప్పటికీ జీర్ణించుకోలేని వాస్తవంగా మిగిలింది. ఆ వాస్తవాన్ని తాను గీసిన కొన్ని చిత్రాల్లో చిత్రించారు కోటేశ్వరరావు.
‘‘ఆయనది రాజసం ఉట్టి పడే రూపం. ఒక్కసారి చూస్తే శాశ్వతంగా మనసులో ముద్రించికుపోయే చిత్రం’’ అంటున్న కోటేశ్వరరావు ఇప్పటికి 25కి పైగా వైయస్ చిత్రాలను గీశారు. ఆ చిత్రాలలో వైయస్ జీవనరేఖలు కనిపిస్తాయి. రాజసంతో ఉట్టి పడే తేజసు, ఆయన ప్రవేశపెట్టిన పథకాల చల్లని వెలుగు కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో ‘అమ్మ ఆర్ట్ అకాడ మీ’ నిర్వహించిన పోటీల్లో కోటేశ్వరరావు గీసిన వైయస్ చిత్రాలకు జాతీయ చాంపియన్‌షిప్ అవార్డు దక్కింది. వైయస్‌ఆర్ వర్థంతి సందర్భంగా కోటేశ్వరరావు ఘటిస్తున్న చిత్రాంజలి ఇది.
- నాగేష్