
పెళ్లిలో అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?
అరుంధతి వశిష్టుడి భార్య. మహా పతివ్రత. వశిష్టుడంతటి వాడు తన నూరుగురు పిల్లల్నీ విశ్వామిత్రుడు చంపించడంతో తీవ్ర ఆవేదనకు
అరుంధతి వశిష్టుడి భార్య. మహా పతివ్రత. వశిష్టుడంతటి వాడు తన నూరుగురు పిల్లల్నీ విశ్వామిత్రుడు చంపించడంతో తీవ్ర ఆవేదనకు గురై, దానికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నదిలోకి దూకాడు. ఆ సందర్భంలో అరుంధతి అంటే ఆయన భార్య ఆయన్ని వెనక్కి లాగి ఇలా ఆత్మహత్య చేసుకోవడమనేది సమస్యకు పరిష్కారం కాదనీ, ఇలా ఆత్మహత్య చేసుకోవడం అవమానకరం అవుతుందనీ పైగా పిల్లలకీ తండ్రి కానీ, తల్లి కానీ ఎవరో ఒకరు లేని పక్షంలో వారికి సద్వర్తన అలవాటు కాదని చెబుతూ ఆయన ప్రాణాల్ని రక్షించింది.
కాబట్టి ఏదో వృత్తిలోనో, ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో భర్త నష్టపోయిన వేళ తాను నాలుగు తిట్టడం కాక, పది మందిలోనూ తన భర్తకి ఎవరూ హాని చేయకుండా, కాలం కలిసి రాలేదు కాబట్టి ఇలా జరిగిందని ప్రకటిస్తూ– భర్తకి ధైర్యం చెప్పడం భార్య లక్షణం. ఆ పనిని అరుంధతి చేసినట్లుగా పెళ్లి అయి ఈ ఇంటి కోడలికి చూపించడానికి కారణం– భర్త ఎప్పుడైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు మానసికంగా కుంగిపోకుండా, ఆ భర్తకి ధైర్యం చెప్పడం కోసం, ఆత్మహత్యా ప్రయత్నం చేసుకుంటున్నట్లయితే వారించడం కోసమూ, పాతివ్రత్యానికి మారు పేరు అయిన అరుంధతీ నక్షత్రాన్ని నవధువుకు చూపిస్తారు.