బార్‌కోడ్ ఎలా పని చేస్తుంది? | Barcode how does it work? | Sakshi
Sakshi News home page

బార్‌కోడ్ ఎలా పని చేస్తుంది?

Published Tue, Feb 9 2016 10:45 PM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM

బార్‌కోడ్ ఎలా పని చేస్తుంది?

బార్‌కోడ్ ఎలా పని చేస్తుంది?

 హౌ ఇట్ వర్క్స్

దుకాణానికి వెళ్లి మీరు కొనే ప్రతి ప్యాకేజీ వెనుక వైపు నిలువు గీతలు ఉండటం మీరు గమనించే ఉంటారు. సూపర్ మార్కెట్లలో ఈ గీతలున్న ప్రాంతాన్ని ఓ పరికరం ముందు ఉంచితే దాని ధర వివరాలన్నీ కంప్యూటర్‌పై కనిపిస్తాయి. బిల్లింగ్ సులువు చేసే ఈ గీతల పట్టీలో ధర వివరాలు ఎలా నిక్షిప్తమవుతాయో మీకు తెలుసా? దానికన్నా ముందు ఓ విషయం. బార్‌కోడ్‌లకు సంబంధించిన పేటెంట్ 1951లోనే బెర్నార్డ్ సిల్వర్, జోసెఫ్ వుడ్‌ల్యాండ్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలకు లభించినా... 1970లో ఐబీఎం ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన యూనివర్సల్ ప్రాడక్ట్ కోడ్ ప్రస్తుతం విసృ్తత వినియోగంలో ఉంది. ఈ కోడ్ ఎలా పనిచేస్తుందంటే...  బార్‌కోడ్‌లో నలుపు రంగు పట్టీలు వేర్వేరు వెడల్పుల్లో ఉండటం మీరు గమనించే ఉంటారు.  కొన్ని గీతలు దగ్గరగా ఉంటే మరికొన్ని కొంచెం ఎడంగా ఉంటాయి. ఈ పట్టీల దిగువనే కొన్ని అంకెలు కూడా ఉంటాయి.  ఒక్కో అంకెకు ప్రత్యేకమైన గీతల అమరిక ఉంటుంది. (ఫొటో చూడండి)  అన్ని రకాల వస్తువులకు ప్రత్యేకమైన నెంబరు ఇస్తారు. ఉదాహరణకు ఉప్పు... 389120, కందిపప్పు... 546988 ఇలా అన్న మాట.     ఆయా అంకెల గీతల అమరికను వరుసగా ప్రింట్ చేస్తే బార్‌కోడ్ సిద్ధమవుతుంది.
     
స్కానర్ ముందు ఉంచినప్పుడు లేజర్, లేదా ఎల్‌ఈడీ కాంతి బార్‌కోడ్‌పై పడుతుంది.ఈ కాంతి తిరిగి స్కానర్‌లోని ఫొటో ఎలక్ట్రిక్ సెల్‌పైకి ప్రతిఫలిస్తుంది. తెలుపు రంగు ఉన్న ప్రాంతం నుంచి ఎక్కువ కాంతి, మిగిలిన నలుపు పట్టీల నుంచి తక్కువ కాంతి పడుతుందన్నమాట ఈ తేడాను బట్టి దాంట్లోని అంకెలను గుర్తిస్తారు. (అధిక వెలుతురును ఆన్‌గా, తక్కువ వెలుతురును ఆఫ్‌గా గుర్తిస్తుందన్నమాట) అంకెల రీడింగ్ పూర్తి కాగానే.... స్కానర్‌లోని సర్క్యూట్ బోర్డులో ఆ అంకెలకు అనుసంధానమై ఉన్న వివరాలు కంప్యూటర్ తెరపై ప్రత్యక్షమవుతాయి.

Advertisement
Advertisement