గీత స్మరణం | Bhdrachalam konda sitammavari danda.. song from Gang Leader Movie | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Thu, Aug 22 2013 12:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

గీత స్మరణం

గీత స్మరణం

పల్లవి :
 
 అతడు: భద్రాచలం కొండ సీతమ్మవారి దండ
 కావాలా నీకండాదండ...
 టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి
 టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి
 ॥
 ఆమె: కొండవీటి దొంగ మోగించు వైభవంగా
 సన్నాయి డోలు సమ్మేళంగా
 టప్పు టప్పు టప్పోరా వేసేయ్ దండోరా
 టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారి
 ॥టప్పు టప్పోరా॥
 
 చరణం : 1
 
 ఆ: ధం ధమాధం లుక్కేశా ధన్ ధనాధన్ తొక్కేశా
   ఫట్ ఫటాఫట్ కొట్టేశారో
 అ: జం జమాజం ఝమ్మంటూ కస్ కసాకస్ కిస్సెట్టి
   ఛం ఛమాఛం వాటేశారో
 ఆ: ధం ధమాధం దుప్పట్లో ధన్ ధనాధన్ దూరేసి
   ఫట్ ఫటాఫట్ బజ్జోవమ్మో
 అ: జం జమాజం ఏ పిల్లో కస్ కసాకస్ ముద్దెట్టి
   ఛం ఛమాఛం పోతుందమ్మో
 ॥టప్పు టప్పోరా॥॥
 
 చరణం : 2
 
 అ: హొయ్... వెర్రికి కిర్రెక్కింది పిల్లకి పిచ్చెక్కింది
   నిమ్మరసం తాగించనా
 ఆ: వెన్నెల వేడెక్కింది పున్నమి ఈడొచ్చింది
   ఉన్న మతే పోయిందిరో
 అ: అరెరెరె... సిగ్గుపడే పిల్లందం దాస్తేనే
   ఆనందం వెంటపడి వేధించకే
 ఆ: నవ్వించే పువ్వందం కసిరే తుమ్మెద
   సొంతం కాదంటే ఎట్టాగయ్యో
 ॥॥టప్పు టప్పోరా॥
 
 ॥
 రచన : భువనచంద్ర
 
 పల్లవి :

అతడు: వయసు వయసు వయసు
         వరసగున్నది వాటం
 ఆమె: తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం
 అ: ప్రతిసారి వేసారి శ్రుతిమీరే
 ఆ: సుఖమయ ఋతువుల మధువునడిగిన
 ॥
 
 చరణం : 1  
 
 అ: ఉదయం చుంబన సేవనం
   మధ్యాహ్నం కౌగిలి భోజనం
 సాయంత్రం పుష్ప నివేదనం రాతిరివేళల మహనైవేద్యం
 ఆ: మనసు మనసుల సంగమం
   తనువుకు తనువే అర్పణం
 తొలి వలపుల సంతర్పణం...
 అ: మరెందుకాలస్యం  ఆ: నయమారా దరిచేరా బిగువేరా
 సరసకు రారా వీరా ధీరా    ॥
 
 చరణం : 2  
 
 ఆ: నీవేలేని నేనట నీరేలేని ఏరట
 కాలాలన్నీ కౌగిట మదనుని శరముల స్వరముల విరియగ
 అ: తారా తారా సందున ఆకాశాలే అందునా
 నీకు నాకు వంతెన...
 ఆ: అమాస వెన్నెలలో అ: పరువాన స్వరవీణ మృదుపాణి
 సరస మధురలయ లావణి పలికిన    
 ॥
 
 చిత్రం : గ్యాంగ్‌లీడర్ (1991), రచన : వేటూరి
 సంగీతం : బప్పీలహరి, గానం : ఎస్.పి.బాలు, చిత్ర

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement