
మళ్లీ మళ్లీ పెళ్లికూతురు...
తిక్క లెక్క
ఈ ఫొటోలోని అమెరికన్ పెద్దావిడ పేరు లిండా టేలర్. వయసు 69 ఏళ్లే. ‘యమలీల’లో తోటరాముడు ‘పెళ్లి... జరగాలి మళ్లీ మళ్లీ...’ అని కవిత రాస్తే జనాలు కామెడీగా తీసుకున్నారు గానీ, లిండా టేలర్ మాత్రం మళ్లీ మళ్లీ పెళ్లిళ్లు చేసుకోవడంలో గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది.
ఇప్పటి వరకు ఈమెకు 23 పెళ్లిళ్లయ్యాయి మరి. విశేషం ఏమిటంటే, ఈమె పన్నెండేళ్లుగా ఒంటరిగానే ఉంటోంది. తగిన వరుడు దొరకాలే గానీ, మళ్లీ పెళ్లి చేసుకుంటానని ముసిముసి నవ్వులు నవ్వుతూ చెబుతోంది.