
చల్తే చల్తే మేరే యే గీత్ యాద్ రఖ్‌నా...
ఎవరికీ ఆ సినిమా తెలియదు. ఎవరూ దానిని చూడలేదు. కాని ఈ పాట మాత్రం కొన్ని వేల లక్షల సార్లు రేడియోలో ప్లే అయ్యింది. ప్లే అవుతూనే ఉంటుంది. ఈ పాట వెనుక ఇద్దరు ఉన్నారు. ఒకరు బప్పి లాహిరి. రెండు అమిత్ ఖన్నా. ఆ రోజుల్లో ఇద్దరూ కొత్తవాళ్లే. దేవ్ ఆనంద్ కుటుంబంలో అతడిలాగే ఉండే కొంచెం దూరపు బంధువు విశాల్ ఆనంద్ తీసిన సినిమా ‘చల్తే చల్తే’ (1976). ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేసి ఆ తర్వాత దేవ్ ఆనంద్ సినిమాల వ్యూహకర్తగా పని చేసిన అమిత్ ఖన్నా చేత ఇందులో పాటలు రాయించాడు.
ఈ అమిత్ ఖన్నా ఆ తర్వాత దూర దర్శన్‌లో, రిలయన్స్‌లో చాలా కీలక బాధ్యతతలు పోషించాడు. ‘బాలీవుడ్’ అనే పేరు కాయిన్ చేసింది కూడా ఇతనే అంటారు. అప్పటికి సంగీత దర్శకుడిగా ఇంకా బ్రేక్ దక్కని బప్పి లాహిరి ఈ సినిమాతోనే హిట్ మ్యూజిక్ డెరైక్టర్‌గా జనం దృష్టిలో పడ్డాడు. ఆ తర్వాత డిస్కో డాన్సర్ అతణ్ణి ఎక్కడికో తీసుకెళ్లింది. అన్నట్టు ‘చల్తే చల్తే’... అనే పాటను మీరు తెలుగులో విన్నారా? లేదా? విన్నారు. 1980లో వచ్చిన ‘పున్నమినాగు’ సినిమాలో ‘పున్నమి రాత్రి’... పాట వినండి. అది ఇదే.
హిట్ సాంగ్