
మీకు తెలుసా?
మహిళల కోసం ప్రత్యేక దినం ఉన్నట్లే పురుషుల కోసం కూడా ఒక రోజుంది. ప్రతి సంవత్సరం నవంబర్ 19న పురుష దినోత్సవ వేడుకలు సుమారు 60 దేశాల్లో ఘనంగా జరుగుతాయి. ఇంటర్నేషనల్ మెన్స్ డే (ఐయండి) వేడుకలు 1999లో తొలిసారిగా ప్రారంభమయ్యాయి. ‘‘లింగ వివక్షను రూపుమాపడానికి ఇలాంటి రోజు ఒకటి కావాలి’’ అని వక్తలు బల్లగుద్ది మరీ చెప్పారు.
లింగసమానత్వానికి ప్రచారం కల్పించడం, ఆదర్శప్రాయులైన పురుషుల గొప్పదనాన్ని వివరించడం, మగవారి పట్ల వివక్షను ఖండించడం, సమాజానికి పురుషులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం, సరికొత్త లక్ష్యాలను నిర్దేశించు కోవడంతో పాటు మగవారి ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే కార్యక్రమాలను రూపొందించడం కూడా ఈ ‘మెన్స్ డే’ ఉద్దేశం.