mens day
-
విమెన్స్ డేలు, ఉత్సవాలు మహిళలకేనా, మరి పురుషులకు?
సాక్షి, హైదరాబాద్: ఎపుడూ విమెన్స్ డేలు, విమెన్స్ ఎంపవర్మెంటేనా. మరి పురుషులకు? వారికి స్పెషల్ డేలు, ఉత్సవాలు గట్రా ఏవీ లేవా. ఈ ప్రశ్నలకు సమాధానంగా వచ్చిందే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. పురుషుల కష్టాలపై చర్చించుకోవడానికీ, కనిపించీ, కనిపించని వారి కన్నీళ్లను తుడుచుకోవడానికీ, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడానికి ఓ రోజుంది, అదే నవంబర్ 19. సమాజంలో ఆడా మగా ఇద్దరూ సమానమే. ఈ స్ఫూర్తిని, అవగాహనను కల్పించేందుకే ఈ డే. అయితే పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టుగా కాకుండా అందరూ మహానుభావులుగా మారాలనేదే దీని లక్ష్యం. వెల్.... ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా పురుషులందరికీ హ్యాపీ మెన్స్ డే. -
Men's Day 2021: మా కష్టాలు మీకేం తెలుసు?
International Mens Day: గనిలో, కార్ఖానాలో, కార్యాలయాల్లో, సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేయడమే తప్ప, తన బాధలు ఎవ్వరికీ చెప్పుకోలేడు! పేరుకే పురుషుడు! తీరుకేమో నిస్సహాయుడు! ఇలా అంటే చాలామంది అంగీకరించకపోచ్చు. కానీ పురుషుల కష్టాలపై చర్చించుకోవడానికి, వారి కన్నీళ్లను తుడుచుకోవడానికీ ఓ రోజుంది. అదే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. మార్చి 8న మహిళల దినోత్సవంలాగే.. నవంబర్ 19న పురుషుల దినోత్సవంగా జరుపుకొంటారు. భారత్‌లోనూ అనేక నగరాల్లో ఈ రోజును ఘనంగా జరుపుతున్నారు. ఏమని చెప్పాలి.. ‘పురుషాధిక్య సమాజం’పేరిట మగాళ్లలో బాధలు పెట్టేవారిని, బాధపడేవారిని ఒకే గాటన కట్టేస్తున్నారన్నది కొందరి వాదన. తప్పొప్పులతో నిమిత్తం లేకుండా సమాజం, చట్టాలు మహిళలపైనే సానుభూతి ప్రదర్శిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. ‘తప్పు మగాళ్లదే’అనే సాధారణ సూత్రీకరణ జరుగుతోందని పేర్కొంటున్నారు. పురుషులు–బాలల ఆరోగ్యం, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, సమస్యలపై ప్రత్యేకంగా చర్చించేందుకే ‘పురుషుల దినోత్సవం’పుట్టుకొచ్చింది. అలాగని తాము స్త్రీ ద్వేషులం కాదని, ఫెమినిస్టులు తమను అర్థం చేసుకుని సహకరించాలని కోరుతున్నారు. చాలా దేశాల్లో పురుష దినోత్సవాలకు మహిళలూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. మగాళ్లు సమస్యలను బయటికి చెప్పుకోలేక, లోపలే కుమిలిపోతూ తమను తాము చంపుకొంటున్నారు. భారత్‌లో మహిళలకంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అమెరికాలో ఈ సంఖ్య 3.5 రెట్లు ఎక్కువ. గుండెపోటు పురుషుల్లోనే అధికం. మహిళలతో పోలిస్తే.. పురుషుల్లో ఆయువు బాగా తక్కువ. యాచకులు, గూడులేక రోడ్లపై బతుకీడుస్తున్న వారిలోనూ పురుషులే ఎక్కువ. త్యాగాలు గుర్తించండి! ‘సంపాదించాలి. కుటుంబ ఉన్నతికి పాటుపడాలి. మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి అన్నగా, మంచి కుమారుడిగా ఉండాలి’.. పురుషులపై సమాజం పెట్టిన బాధ్యత ఇది. ఇందులో ఎక్కడ విఫలమైనా ఛీత్కారం తప్పదు. ఇంత చేసినా కీలక సమయంలో న్యాయం జరుగుతుందా అంటే అదీ లేదని పురుష బాధితులు వాపోతున్నారు. ‘భార్య విడాకులు కోరినప్పటికీ.. పిల్లలకు తండ్రే దూరం కావాలి. 90 శాతం కేసుల్లో ఇదే జరుగుతోంది. గృహ హింస కేసుల్లో అన్యాయంగా జైళ్లలో పెడుతున్నారు. ఇదంతా పురుషులపై వివక్షే’అని చెబుతున్నారు. ఒక వయసు వచ్చిన తర్వాత పురుషుల్లో అత్యధికులకు సొంత ఆకాంక్షలేవీ ఉండవు. ఉన్నా వదిలేసుకుంటారు. కష్టమైనా, నష్టమైనా, ఏం చేసినా, ఎంత సంపాదించినా కుటుంబం కోసమే! అలాంటప్పుడు పురుషుల త్యాగాలకు కనీస గుర్తింపు ఇవ్వడంలో తప్పేముంది? ‘పురుషుల దినోత్సవమంటే జోక్ కాదు. కుటుంబం, సమాజం కోసం పురుషులు చేస్తున్న త్యాగాలు, సాధించిన విజయాలు గుర్తు చేసుకోవడమే అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఉద్దేశం..’ పురుషులకు హెల్ప్‌లైన్.. భారత్‌లో సందర్భం, అవసరాన్ని బట్టి సాయం చేసేందుకు హెల్ప్‌లైన్ నంబర్లు అనేకం ఉన్నాయి. ఇటీవల మహిళల కోసం, చిన్న పిల్లల కోసం కూడా ఇలాంటి హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. కష్టాల్లో చిక్కుకున్న పురుషుల కోసం కూడా ఓ హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో వారే స్వయంగా ఒక హెల్ప్‌లైన్ నంబర్ (8882 498 498) ఏర్పాటు చేసుకున్నారు. మా కష్టాలు మీకేం తెలుసు? మహిళలకు అన్యాయం జరిగిందంటే అందరూ పెద్దమనుషులై తీర్పునిచ్చే ప్రయత్నం చేస్తారు. అదే పురుషులకు అన్యాయం జరిగితే అండగా నిలిచేవారు అంతంతమాత్రమే. పైగా, అన్యాయం జరిగిందన్న పురుషుడిని వెటకారంగా చూస్తారు. భర్త వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించే పోలీసులు.. భార్యాబాధితుల విషయంలో అంతగా స్పందించరని పురుష సంఘాలు వాపోతున్నాయి. నైతిక మద్దతు కూడా కూడగట్టుకోలేక, చెప్పుకోలేక తామే సంఘంగా ఏర్పడి ఒకరి బాధను మరొకరు పంచుకుంటున్నామంటున్నారు. ఒకప్పుడు ఇలాంటి సంఘాలు చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సైతం పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఇలాంటి బాధితులందరూ కలిసి పెట్టుకున్న ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ (ఎస్ఐఎఫ్)’.. మహిళా కమిషన్ లాగానే పురుష కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.. -
పాపం'మగ'నుభావులు
మగాళ్లకూ కష్టాలు ఉంటాయి. మగాళ్లకూ కన్నీళ్లు ఉంటాయి. మగాళ్లూ మనుషులే! మగాళ్లకూ అన్యాయాలు జరుగుతుంటాయి. మగాళ్లు కూడా వివక్షకు బాధితులవుతుంటారు. ‘మగా‘నుభావులు ఇప్పుడిప్పుడే వాస్తవాన్ని గుర్తిస్తున్నారు... అందుకని తమదైన రోజును సగర్వంగా జరుపుకొంటున్నారు... మగాళ్లకు సంబంధించి సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. చాలా భ్రమలు ఉన్నాయి. ప్రచారంలో ఉన్న అపోహలు, భ్రమలు మగ బతుకుల గురించిన వాస్తవాలను మరుగున పడేస్తున్నాయి. సమాజం మగాళ్లను ఒక స్టీరియోటైప్‌లో ఊహించుకుని, వాళ్లను అలాగే తయారు చేయాలనుకుంటుంది. అందుకు భిన్నంగా ఉన్నవాళ్లను ఎద్దేవా చేసి, వాళ్లకు మనశ్శాంతి నశించేంత వరకు హింసిస్తుంది. సమాజం దృష్టిలో మగాడంటే కండరగండడు. మగాడంటే ధీరగంభీరుడు. మగాడికి కన్నీళ్లుండరాదు. మగాడనే వాడు కష్టాలకు చలించరాదు. మనసుకు కష్టం కలిగి కళ్లల్లో నీళ్లు చిప్పిల్లినప్పుడు వాటినెవరి కంటా పడనీయకుండా ముఖం పక్కకు తిప్పేసుకోవాలి. కళ్లు చెమ్మగిల్లిన ముఖాన్ని ఎవరైనా గమనిస్తే ‘వాడేం మగాడ్రా.. కాసింత కష్టానికే ఏడ్చేస్తున్నాడు’ అని అలవోకగా అనేసి బహిరంగంగా చులకన చేసేస్తారు. సమాజానికి సూక్ష్మరూపం కుటుంబం. సమాజంలో ఉన్న అపోహలకూ భ్రమలకూ కుటుంబాలు అతీతం కావు. సమాజంలో తరతరాలుగా పాతుకుపోయి ఉన్న అభిప్రాయాలకు అనుగుణంగా మగపిల్లలను తీర్చిదిద్దడానికి కుటుంబాలు శాయశక్తులా ప్రయత్నిస్తాయి. మగపిల్లలు ఎప్పుడైనా ఏడిస్తే, ‘మగాళ్లు ఎప్పుడైనా ఏడుస్తారా?’ అని గద్దించి, వాళ్ల నోళ్లు మూయిస్తారు. మగాళ్లు ఎలా ఉండాలో అమ్మానాన్నలు చిన్నప్పటి నుంచే మగపిల్లలకు నూరిపోస్తారు. బడుల్లో చేరినా మగపిల్లల బతుకులకు కాస్త తెరిపి ఉండదు. మగాళ్లూ ఉద్యమిస్తున్నారు హక్కుల కోసం మగాళ్లూ ఉద్యమిస్తు న్నారు. మన దేశంలో పురుషులు కాస్త ఆలస్యంగా మేల్కొన్నారు. నవ శతాబ్ది ప్రారంభమైనది మొదలుకొని హక్కుల సాధన కోసం ఉద్యమాల బాట పట్టారు. న్యాయమైన హక్కుల కోసం పురుషుల ఉద్యమాలు ప్రారంభమై దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నా, వారి ఉద్యమాలకు తగిన ప్రచారం దక్కడం లేదు. గుర్తించకపోయినా, పురుషులు మాత్రం ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ముంబై నుంచి రుడాల్ఫ్ డిసౌజా పురుషుల హక్కుల ఉద్యమాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. భార్యల నుంచి మానసిక, శారీరక వేధింపులకు గురవుతున్న పురుషులకు చట్టపరంగా ఆదుకోవడానికి 2005లో ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’ సంస్థను ప్రారంభించి, జాతీయ స్థాయిలో పురుషుల సమస్యలపై పోరాటం సాగిస్తున్నారు. ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’ తరఫున తొలిసారిగా 2007 నవంబరు 19న ‘అంతర్జాతీయ పురుషుల దినోత్సవం’ సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహించారు. మన దేశంలో వరకట్న నిరోధక చట్టాలు వివక్షతో కూడుకుని ఉంటున్నాయని, చాలామంది అమాయకులు ఈ చట్టాల కారణంగా తప్పుడు కేసుల్లో చిక్కుకుని నానా అగచాట్లు పడుతున్నారని రుడాల్ఫ్ డిసౌజా చెబుతున్నారు. రుడాల్ఫ్ డిసౌజా కంటే ముందుగా 1988లోనే సుప్రీంకోర్టు న్యాయవాది రామ్‌ప్రకాశ్ చుగ్ ‘సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు హజ్బండ్స్’ అనే సంస్థను ప్రారంభించారు. ‘‘దేశంలోని వరకట్న నిరోధక చట్టాలన్నీ మహిళలకు అనుకూలంగానే ఉన్నాయి. భార్యల నుంచి హింసను, బెదిరింపులను ఎదుర్కొనే భర్తలను కాపాడేందుకు ఎలాంటి చట్టాలూ లేవు. వరకట్న నిరోధక చట్టాలను అడ్డుపెట్టుకుని భర్తలను బెదిరించి, కేసుల్లో ఇరికించి అధిక మొత్తంలో డబ్బును రాజీ రూపంలో వసూలు చేసుకోవాలనుకునే భార్యల నుంచి అమాయక భర్తలకు ఎలాంటి రక్షణ లేదు. ఈ పరిస్థితి వైవాహిక సామరస్యాన్నే కాదు, కుటుంబ వ్యవస్థనే దెబ్బతీస్తోంది’’ అని చుగ్ అభిప్రాయపడుతున్నారు. పురుషుల హక్కులకు కూడా రక్షణ కల్పించే చట్టాల కోసం ఆయన చాలాకాలంగా పోరాటం సాగిస్తున్నారు. గృహహింస చట్టాలను ‘చట్టపరమైన ఉగ్రవాదం’గా ‘సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్’కు చెందిన స్వరూప్ సర్కార్ వ్యాఖ్యానించారు. ‘‘ఈ చట్టపరమైన ఉగ్రవాదాన్ని రూపుమాపాలంటే దేశంలో ఎందరు భగత్‌సింగ్‌లు, ఎందరు నేతాజీలు పుట్టుకు రావాలో నాకు తెలియదు’’ అని కూడా స్వరూప్ సర్కార్ వ్యాఖ్యానించారు. స్వరూప్ సర్కార్‌కు మద్దతుగా సచిన్ దలాల్ అనే వ్యక్తి ‘‘ఇక దేశంలో వివాహ వ్యవస్థకు శిలువ వేసినట్లే.. 498–ఏ సెక్షన్‌తో సంతృప్తి చెందని వారు చట్టపరంగా భర్తను, కుటుంబాన్ని లూటీ చేయడానికి గృహహింస చట్టాన్ని కూడా తెచ్చారు’’ అని విమర్శిస్తూ రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాశారు. మహిళలకో కమిషన్ ఉంది.. మరి పురుషులకేదీ? మహిళల హక్కుల పరిరక్షణ కోసం, వారికి జరిగే అన్యాయాలను అరికట్టడం కోసం జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటైంది. మరి పురుషులకు అలాంటి కమిషన్ ఏదీ? అని లక్నోకు చెందిన ‘నేషనల్ కోయలిషన్ ఆఫ్ మెన్’ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. జాతీయ స్థాయిలో పురుషుల కోసం కూడా ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలేవీ పురుషుల పక్షం తీసుకోకుంటే, పురుషుల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీని పురుషులే ఏర్పాటు చేసుకోవాలని కూడా డిమాండ్ చేస్తోంది. పురుషుల దినోత్సవం చరిత్ర అంతర్జాతీయ మహిళా దినోత్సవం మొదలైన తొంభై ఏళ్లకు గాని అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకోవడం అధికారికంగా మొదలవలేదు. మొదటిగా థామస్ ఓస్టర్ అనే అమెరికాలోని మిసోరి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ 1992 ఫిబ్రవరి 7న పురుషుల దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. మాల్టా దీవిలో 1994 నుంచి ఏటా ఫిబ్రవరి 7వ తేదీనే పురుషుల దినోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని యూనివర్సిటీ ఆఫ్ వెస్టిండీస్‌కు చెందిన హిస్టరీ ప్రొఫెసర్ జిరోమ్ తీలక్సింగ్ 1999 నవంబరు 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు ఎనభై దేశాలు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషుల హక్కులు, పురుషుల ఆరోగ్యం, పురుషులు ఎదుర్కొంటున్న వివక్ష తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇదిలా ఉంటే, నవంబరు నెలను పురుషుల మాసంగా కూడా అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. భారత్‌లో 2007 నుంచి నవంబరు 19న అంతర్జాతీయ పురుషుల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం మొదలైంది. అయితే, అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలకు లభిస్తున్న ప్రాధాన్యం అంతర్జాతీయ పురుషుల దినోత్సవ కార్యక్రమాలకు రావడం లేదు. ‘మగా’నుభావురాలు స్వాతంత్య్రానికి మునుపటి కాలంలో మహిళల హక్కుల కోసం కొందరు పురుషులు పోరాటాలు చేశారు. రాజా రామ్మోహన్రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు నాటి సమాజంలో మహిళల పట్ల సాగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపారంటే, అప్పటి సమాజంలో మహిళల దుస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే రీతిలో నేటి సమాజంలో ఒక మహిళ స్వయంగా ముందుకు వచ్చి పురుషుల హక్కుల కోసం పోరాడుతుంది. అలాగని వర్తమాన సమాజంలో మహిళల పట్ల అన్యాయాలేవీ జరగడం లేదని చెప్పడానికి లేదు. ‘‘దేశంలో సగటున ప్రతి 15 నిమిషాలకు ఒక మగువపై అత్యాచారం జరుగుతోంది. ప్రతి 69 నిమిషాలకు ఒక మహిళ వరకట్న దాహానికి బలైపోతోంది. ఏటా లక్షలాది ఆడశిశువులు గర్భస్థ స్థితిలోనే భ్రూణహత్యలకు గురవుతున్నారు. ఇలాంటి అఘాయిత్యాలపై మహిళలు పోరాటాలు సాగిస్తున్నారు. వీటిపై కచ్చితంగా పోరాటాలు సాగాల్సిందే. అయితే, మగాళ్లు మాత్రం మనుషులు కాదా? సమాజంలో వారు మాత్రం వివక్షను ఎదుర్కోవడం లేదా? కొన్ని నేరాలకు వారు మాత్రం బాధితులు కావడం లేదా?’ అని ప్రశ్నిస్తున్నారు సామాజిక కార్యకర్త, పాత్రికేయురాలు దీపికా నారాయణ్ భరద్వాజ్. ‘‘మహిళల హక్కుల కోసం మగాళ్లు పోరాడటం లేదా? మరి మగాళ్ల హక్కుల కోసం మహిళలు పోరాడితే తప్పేముంది?’’ అని ప్రశ్నిస్తున్నారామె. ‘‘మాట్రీర్స్ ఆఫ్ మ్యారేజ్’’ పేరిట ఒక స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి, 498–ఎ సెక్షన్ కింద తప్పుడు కేసుల్లో ఇరుక్కున్న పురుషుల తరఫున పోరాటం సాగిస్తున్నారు. ‘‘మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై నేను మాట్లాడను. ఇప్పటికే వాటిపై లక్షలాది మంది మాట్లాడుతున్నారు’’ అని అంటారామె. ఆయుర్దాయంలో వెనుకబాటు మగాళ్లు కండరగండలు. మగాళ్లు బలాఢ్యులు. మగాళ్లు మొండిఘటాలు... ఇలాంటి అభిప్రాయాలన్నీ మగాళ్ల గురించి లోకంలో ప్రచారంలో ఉన్నవి. ఇవి అర్ధసత్యాలు మాత్రమే. నిజానికి మగాళ్లు అంతటి బలాఢ్యులైతే, అంతటి మొండిఘటాలైతే వాళ్ల ఆయువు తొందరగా ఎందుకు తీరిపోతోంది. మహిళలతో పోల్చుకుంటే పురుషుల సగటు ఆయుర్దాయం తక్కువగా ఉంటున్న సంగతి జాతీయ, అంతర్జాతీయ గణాంకాలు తేటతెల్లం చేస్తున్న వాస్తవం. ‘స్టీరియో టైప్’ మగలక్షణాలను పంటిబిగువున భరించి, భరించి అలసి సొలసిన మగాళ్ల గుండెలు తొందరగా ఆగిపోతున్నాయి. సమాజం అప్రకటితంగా విధించిన మగ లక్షణాలను ప్రదర్శించుకునే ప్రయత్నంలో అమాయక పురుషులు తమ ఆయువునే పణంగా పెడుతున్నారు. ఐక్యరాజ్య సమితి వెల్లడించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మహిళల సగటు ఆయుర్దాయం 71.1 ఏళ్లుగా ఉంటే, పురుషుల సగటు ఆయుర్దాయం 67 ఏళ్లు మాత్రమే. మన భారత్‌లో మహిళల సగటు ఆయుర్దాయం 67.5 ఏళ్లు అయితే, పురుషుల సగటు ఆయుర్దాయం 63.2 ఏళ్లు మాత్రమే. కుటుంబభారం నిర్వహించడంలో పురుషులు కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నారు. అందుకు వాళ్లకు ఎలాంటి గుర్తింపూ ఉండదు. కుటుంబభారాన్ని మోసే మహిళల పట్ల సమాజంలో ఉండే సానుభూతి పురుషులపై మచ్చుకైనా కనిపించదు. ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ అనే దురభిప్రాయం సమాజంలో తరతరాలుగా పాతుకుపోయి ఉంది. ఇదే అభిప్రాయాన్ని నరనరాన జీర్ణించుకున్న ‘మగా’నుభావులు చిన్నా చితకా నొప్పులను పెద్దగా పట్టించుకోరు. వాటిని మౌనంగానే భరిస్తారే తప్ప వెంటనే వైద్య సహాయం కోసం ఆస్పత్రులకు వెళ్లరు. ఒక్కోసారి ఇలాంటి చిన్నా చితకా నొప్పులే ప్రాణాంతకంగా పరిణమించి, పురుషుల ఆయుర్దాయాన్ని అర్ధంతరంగా కబళిస్తున్నాయి. -
‘కేజ్రీవాల్.. మీరు మెన్స్ డే స్టార్ట్ చేయండి’
న్యూఢిల్లీ: పురుషులకు కూడా ప్రత్యేకంగా ఒక రోజును అంకితం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖా మంత్రి మేనకాగాంధీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సూచించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎన్నో కొత్తకొత్త కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఆయన ఇప్పుడు ఢిల్లీలో పురుషుల దినోత్సవం పాటించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది చాలా ముఖ్యమైన రోజు. అయితే, పురుషులకు కూడా ఏడాదిలో ఒక ప్రత్యేకమైన రోజు అంటూ అంకింతం చేస్తే న్యాయం చేసినట్లవుతుందని నేను భావిస్తాను’ అంటూ చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ఢిల్లీలోని మహిళా కమిషన్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లోని ఐయామ్ ఈక్వల్ అనే పేరుతో జరుగుతున్న ప్రచారంలో దేశంలోని మహిళలంతా చేరాలని విజ్ఞప్తి చేశారు. ‘మనమంతా ఒక్కటే అని చెప్పడం ప్రతి ఒక్కరూ ప్రారంభించాలి. ఏదో ఒక రోజు సమానత్వం వస్తుందని నేను బలంగా చెప్పగలను’ అని అన్నారు. అంతకుముందు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేజ్రీవాల్ ట్విట్టర్లో పలు ట్వీట్లు చేశారు. మహిళలపై వేధింపులకు పాల్పడేవారిని అన్‌ఫాలో చేయాలని, మహిళలపై బెదిరింపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలకోసం ఒక రోజు మాత్రమే జరుపుకుంటుంటే మిగితా 364 రోజులు పురుషుల దినోత్సవాల్లాగా కనిపిస్తోందని, మొత్తం 365 రోజులు కూడా మహిళలకే ఉండాలంటూ కూడా ఆయన ట్వీట్లలో పేర్కొన్నారు. అయితే, ఢిల్లీ యూనివర్సిటీలో ఇటీవల ఏబీవీపీ విద్యార్థులు, ఏఐఎస్ఎఫ్ విద్యార్థుల మధ్య రేగిన వివాదం నేపథ్యంలో ఆయన ట్వీట్లు చేసినట్లు పలువురు విమర్శించడంతో కేజ్రీవాల్‌కు ప్రత్యేకంగా మెన్స్ డే జరపాలని సూచించినట్లు తెలుస్తోంది. -
పురుషుల దినోత్సవం గుర్తుందా?
మెన్‌టోన్ మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సంగతి కొత్తగా చెప్పాలేంటి? మాకు తెలీదూ! అని విసుక్కోకండి. మహిళా దినోత్సవం మొదలైన అచిరకాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతి సాధించింది. అది మహిళల ఘనతకు నిదర్శనం. కాదనలేం. ఆకాశంలో సగమైన వారికి ప్రత్యేకించి ఒక రోజు ఉండటం సమంజసమే! మరి జనాభాలో మిగిలిన సగమైన మగాళ్ల సంగతేమిటి? వాళ్లకూ ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలి కదా! ఔను! ఉండాలి కూడా! అందుకే, ‘మగా’నుభావులకూ ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నవంబర్ 19న వస్తుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏ రోజు వస్తుందో ఆడా మగా అందరికీ తెలుసు గానీ, అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఎప్పుడొస్తుందనేది చాలామంది పురుషులకు కూడా తెలీదు. పురుషాధముల జనరల్ నాలెడ్జి ఈ స్థాయిలో తగలడిందని విసుక్కోకండి. కారణాలను తరచి చూసేందుకు ప్రయత్నించండి. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం గురించి పురుషులకు కూడా పెద్దగా తెలియకపోవడానికి పెద్దపెద్ద కారణాలేవీ లేవు. అవన్నీ చాలా చిన్నవే. వాటిలో ప్రచారలోపం ముఖ్య కారణం. పురుషులలో సంఘటిత శక్తి లోపించడం, చట్టాలు, ప్రభుత్వాలకు అనాదిగా గల మహిళా పక్షపాతం కూడా ఇందుకు కారణాలే! అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోనున్న సందర్భంగా మహిళలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేయడం విజ్ఞత గల జంటిల్మన్ లక్షణం. వారిదైన ప్రత్యేక దినోత్సవాన్ని ఎంత సంబరంగా, అర్థవంతంగా జరుపుకొంటున్నారో చూసైనా పురుషపుంగవులు ఎంతో కొంత నేర్చుకుంటే మంచిది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా అదే రీతిలో జరుపుకొనేలా చిత్తశుద్ధితో ప్రయత్నాలు మొదలుపెడితే ఇంకా మంచిది. మన దేశంలో ఇలాంటిదేదీ తలపెట్టే ఉద్దేశం మన ప్రభుత్వాలకు ఉంటుందనుకోవడం భ్రమే గానీ, కొన్నింటిని పోరాటంతోనైనా సాధించుకోవాల్సి ఉంటుంది. పురుషుల పట్ల సానుకూలంగా ఉండటంలో మనవాళ్లు రుమేనియా ప్రభుత్వాన్ని చూసైనా నేర్చుకోవాలి. అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని కూడా ఇక నుంచి అధికారికంగా నిర్వహించాలని రుమేనియా పార్లమెంటు ఇటీవలే తీర్మానాన్ని ఆమోదించింది. అయినా, మన పార్లమెంటులో ఇలాంటి చిన్నా చితకా అంశాలపై చర్చలెందుకు జరుగుతాయిలెండి? -
మీకు తెలుసా?
మహిళల కోసం ప్రత్యేక దినం ఉన్నట్లే పురుషుల కోసం కూడా ఒక రోజుంది. ప్రతి సంవత్సరం నవంబర్ 19న పురుష దినోత్సవ వేడుకలు సుమారు 60 దేశాల్లో ఘనంగా జరుగుతాయి. ఇంటర్నేషనల్ మెన్స్ డే (ఐయండి) వేడుకలు 1999లో తొలిసారిగా ప్రారంభమయ్యాయి. ‘‘లింగ వివక్షను రూపుమాపడానికి ఇలాంటి రోజు ఒకటి కావాలి’’ అని వక్తలు బల్లగుద్ది మరీ చెప్పారు. లింగసమానత్వానికి ప్రచారం కల్పించడం, ఆదర్శప్రాయులైన పురుషుల గొప్పదనాన్ని వివరించడం, మగవారి పట్ల వివక్షను ఖండించడం, సమాజానికి పురుషులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం, సరికొత్త లక్ష్యాలను నిర్దేశించు కోవడంతో పాటు మగవారి ఆరోగ్యానికి ప్రాధాన్యమిచ్చే కార్యక్రమాలను రూపొందించడం కూడా ఈ ‘మెన్స్ డే’ ఉద్దేశం. -
మగాళ్లు, పెళ్లి చేసుకోబోతున్నారా!
-
'ఆడవాళ్ల నుండి రక్షణ కావాలి'