స్వదేశాన్ని మాతృభూమి అంటారు. అంటే దేశం జన్మనిచ్చిన తల్లితో సమానం. దేశపౌరులంతా కలసికట్టుగా ఉంటే ఎంతో బలం. ఇప్పుడు ప్రపంచం కుగ్రామం అయింది. ప్రపంచీకరణ పేరిట, దేశాలు ఇతర దేశాల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. దేశాల మధ్య సత్‌సంబంధాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిణామంలో మాతృదేశాన్ని ఎలా గౌరవిస్తున్నామో అలానే ఇతర దేశాలపై వ్యతిరేక భావం ఏర్పరచుకోకుండా ఉంటే బాగుంటుంది కదా! మీలో దేశభక్తితో పాటు విదేశాలపై ఎలాంటి భావన కలిగి ఉన్నారో తెలుసుకోవాలని ఆసక్తి ఉందా?
1. దేశభక్తి మీలో చాలా ఎక్కువగా ఉంటుంది. మాతృదేశాన్ని పూజ్యభావంతో చూస్తారు.
ఎ. కాదు బి. అవును
2. దేశం నాకేమి ఇచ్చింది? అని ఎప్పుడూ ప్రశ్నించుకోరు.
ఎ. కాదు బి. అవును
3. దేశ ఔన్నత్యాన్ని గురించి అందరితో చెప్తారు.
ఎ. కాదు బి. అవును
4. దేశానికి స్వాతంత్య్రాన్ని తెచ్చిన మహనీయులను మరచిపోరు. వారి గౌరవం తగ్గేలా ఎప్పుడూ మాట్లాడరు.
ఎ. కాదు బి. అవును
5. దేశసమగ్రతను కోరుకుంటారు. అందరూ సమానమేనన్న భావన పెంపొందించుకుంటారు.
ఎ. కాదు బి. అవును
6. దేశ విశేషాలతోపాటు ప్రపంచంలో జరిగే విషయాలనూ తెలుసుకుంటారు.
ఎ. కాదు బి. అవును
7. దేశాల మధ్య అసమానతలు రాకుండా ఉండాలని గట్టిగా కోరుకుంటారు.
ఎ. కాదు బి. అవును
8. ప్రపంచమంతా ఒకతాటిపై నడిస్తే బాగుంటుందనుకుంటారు.
ఎ. కాదు బి. అవును
9. ఇతర దేశాలను సందర్శించాలంటే మీకు ఇష్టం. అలానే వాటి సంస్కృతిని కూడ తెలుసుకోవాలనుకుంటారు.
ఎ. కాదు బి. అవును
10. ఇతర దేశాలపై కారణం లేకుండా వ్యతిరేకత పెంచుకోరు.
ఎ. కాదు బి. అవును
మొదటి ఐదు సమాధానాలు ‘బి’ లు వస్తే మీలో దేశభక్తి పూర్తి స్థాయిలో ఉంటుంది. ‘బి’ లు ఎనిమిది దాటితే విదేశాలనీ ఇష్టపడతారు. ప్రపంచ విషయాలు తెలుసుకోవటానికి ఆసక్తి చూపుతారు. ‘ఎ’ లు ఎక్కువ వస్తే దేశభక్తి మీలో తక్కువ ఉంటుంది. ప్రపంచం గురించి తెలుసుకోవాలనే కుతూహలం మీలో అంతగా ఉండదు.
జగమంతా నా కుటుంబమే అనుకుంటారా..?
Published Thu, Mar 8 2018 1:04 AM | Last Updated on Thu, Mar 8 2018 1:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment