రూజ్వెల్ట్ విగ్రహం
న్యూయార్క్‌లోని అమెరికన్ మ్యూజియం ముఖద్వారంలో ఉన్న థియోడర్ రూజ్వెల్ట్ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించబోతున్నారు. అయితే ఎక్కడికి తరలించాలన్న దానిపై సిటీ మేయర్‌కు ఆలోచన తెగటం లేదు. 1940 నుంచీ ఆ విగ్రహం అక్కడ ఉంది. అప్పటి నుంచీ ఆ విగ్రహంపై నల్లజాతీయులకు అభ్యంతరం ఉంది. రూజ్వెల్ట్ గుర్రం ఎక్కి ఉంటాడు. గుర్రానికి ఒకవైపు ఆదివాసీ అమెరికన్, ఇంకోవైపు ఆఫ్రికా జాతీయుడు నిలబడి ఉంటారు. శ్వేతసౌధ సార్వభౌమాధికారానికి చిహ్నంగా ఉన్న ఆ విగ్రహాన్ని తొలగించాలని నల్లజాతీయులు చేస్తున్న డిమాండ్ ఏళ్లుగా పట్టించుకోని అధికారులు ఇప్పటికి కదిలారు. అదీ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం తీవ్రం అవుతుండటంతో. 2017లో ఒకసారి నిరసనకారులు విగ్రహానికి ఎర్ర ఇంకును పులిమారు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా రక్తం చిందిస్తామని చెప్పడం అది. ఆ పరిస్థితిని రానివ్వకూడదనే ప్రస్తుత మేయర్ బిల్ డే బ్లాసియో ఆ విగ్రహాన్ని తీయించబోతున్నారు. ‘అవునా! అర్ధం లేని పని కదా. అలా చెయ్యొద్దు..’ అని ట్రంప్ మాత్రం మేయర్ గారికి ఒక ట్వీట్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment