statue collapse
-
ఛత్రపతి పాదాల వద్ద తలవంచి క్షమాపణ కోరుతున్నా..
పాల్ఘార్: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఇటీవల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన పట్ల శివాజీని, శివాజీ అభిమానులను క్షమాపణ కోరుతున్నట్లు చెప్పారు.. శివాజీ అంటే కేవలం ఒక పేరు, ఒక పాలకుడు కాదని అన్నారు. ఆయన మనకు ఒక దైవం అని స్పష్టంచేశారు. ఈ రోజు ఛత్రపతి పాదాల వద్ద తలవంచి క్షమాపణ కోరుతున్నానని తెలిపారు. విగ్రహం కూలిపోవడం పట్ల శివాజీ అభిమానుల మనసులు గాయపడ్డాయని, వారందరినీ క్షమాపణ ఆర్థిస్తున్నానని అన్నారు. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో రూ.76,000 కోట్లతో నిర్మించే వాద్వాన్ ఓడరేవు ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శుక్రవారం పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ప్రసంగించారు. మనం పాటించే విలువలను చాలా భిన్నమైనవని పేర్కొన్నారు. దైవంలాంటి ఛత్రపతి శివాజీ కంటే మనకు ఇంకేదీ గొప్ప కాదని స్పష్టంచేశారు. పదేళ్ల క్రితం బీజేపీ ప్రధానమంత్రి అభ్యరి్థగా తన పేరు ఖరారు కాగానే మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ను సందర్శించానని, శివాజీ సమాధి వద్ద ధ్యానం చేశానని మోదీ గుర్తుచేసుకున్నారు. మరాఠా వీరుడు వీర సావర్కార్‌ను కొందరు వ్యక్తులు ఇష్టారాజ్యంగా దూషిస్తున్నారని, అవమానిస్తున్నారని ఆరోపించారు. వారు ఆయనకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా లేరని విమర్శించారు. పదేళ్లలో చేపల ఉత్పత్తి రెట్టింపు ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మన లక్ష్య సాధనలో ‘అభివృద్ధి చెందిన మహారాష్ట్ర’ ఒక కీలక భాగమని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రగతి కోసం గత పదేళ్లుగా అనేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మహారాష్ట్ర శక్తిసామర్థ్యాలు, సంపదతో రాష్ట్ర ప్రజలే కాకుండా దేశమంతా ప్రయోజనం పొందాలన్నదే తమ ఉద్దేశమని వెల్లడించారు. తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. మత్స్యకారుల సహకార సంఘాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. వెనుకబడిన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పూర్తి అంకితభావం, నిజాయితీతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. చేపల పరిశ్రమలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలన్నారు. ‘ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన’ ద్వారా వేలాది మంది మహిళల సాధికారతకు చేయూత అందించామని వివరించారు. చేపల ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశంగా రికార్డుకెక్కిందని హర్షం వ్యక్తం చేశారు. 2014లో మన దేశంలో చేపల ఉత్పత్తి కేవలం 8 మిలియన్ టన్నులుగా ఉందని, ఇప్పుడు 17 మిలియన్ టన్నులకు చేరిందని వెల్లడించారు. పదేళ్లలో ఉత్పత్తి రెట్టింపు అయ్యిందన్నారు. రూ.76,000 కోట్లతో వాద్వాన్ పోర్టు నిర్మిస్తున్నామని, ఇది దేశంలోనే అతిపెద్ద కంటైనర్ పోర్టు అవుతుందని చెప్పారు. అభివృద్ధి దిశగా భారతదేశ ప్రయాణంలో ఇదొక చరిత్రాత్మకమైన రోజు అని మోదీ వ్యాఖ్యానించారు. రూ.1,560 కోట్లతో నిర్మించే 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు సైతం ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.360 కోట్లతో రూపొందించిన వెస్సెల్ కమ్యూనికేషన్, సపోర్టు సిస్టమ్ ప్రారంభించారు. బానిసత్వపు సంకెళ్లు తెంచుకున్న ‘నూతన భారత్’కు దేశ శక్తిసామర్థ్యాలు ఏమిటో పూర్తిగా తెలుసని స్పష్టంచేశారు. -
వైఎస్సార్ విగ్రహాలు, శిలాఫలకాలపై అక్కసు
నరసాపురం రూరల్/వెంట్రప్రగడ (పెదపారుపూడి) /అమలాపురం రూరల్ : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని సారవ గ్రామంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వైఎస్సార్ విగ్రహాన్ని, శిలాఫలకాలను ధ్వంసం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, అప్పటి ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు హయాంలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం, వైఎస్సార్ హెల్త్ క్లినిక్ భవనాలను గ్రామంలో నిర్మించారు. వీటి ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాలను, అక్కడే ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో అలజడి రేగింది. ఈ విధ్వంసానికి పాల్పడిన దోషులను శిక్షించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు కడలి రాంబాబు ఆధ్వర్యంలో శనివారం పెద్దఎత్తున ఆందోళనకు సమాయత్తమయ్యారు. గ్రామ కార్యదర్శి యర్రంశెట్టి సత్యనారాయణ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విధ్వంసానికి పాల్పడిన దోషులను వెంటనే అరెస్టుచేయాలని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు దొంగ మురళీకృష్ణ డిమాండ్ చేశారు. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలంలో..అలాగే, కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలంలోని వెంట్రప్రగడ శివారు శివాపురం వద్ద రోడ్డు పక్కనున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని కూడా శుక్రవారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ పార్టీ గ్రామ కన్వీనర్ మండవ జానకరామయ్య (మున్నా) మాట్లాడుతూ.. అర్థరాత్రి సమయంలో ఎవరో వైఎస్సార్ విగ్రహం చేతుల భాగం విరగ్గొట్టారన్నారు. ఈ ఘటనను మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామంలో పార్టీల పరంగా పరస్పర ఆరోపణలు మినహా ఎప్పుడూ ఇటువంటి చిల్లర రాజకీయాలు జరగలేదన్నారు.సచివాలయ శిలాఫలకం ధ్వంసం..ఇదిలా ఉంటే.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం రెడ్డిపల్లిలో గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని కూడా గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సచివాలయ నూతన భవనాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. దీనిని అప్పటి రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఈ ఏడాది మార్చిలో ప్రారంభించి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీనిని గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేయగా.. శనివారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సచివాలయ ఉద్యోగులు దీనిని గుర్తించారు. వెంటనే సర్పంచ్ కరాటం ప్రసన్న, కార్యదర్శి కట్టా సత్తిబాబు దృష్టికి విషయం తీసుకెళ్లగా వారిరువురూ అమలాపురం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్సై శేఖర్‌బాబు పరిశీలించి గ్రామంలో విచారణ జరిపారు. గ్రామంలో ఇటువంటి సంఘనలు గతంలో ఎప్పుడూ జరగలేదని, బయటి నుంచి వచ్చిన వ్యక్తులే చేసి ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తంచేశారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని ఎస్సై శేఖర్‌బాబు తెలిపారు. -
గుర్రం దింపుతున్నారు!
న్యూయార్క్‌లోని అమెరికన్ మ్యూజియం ముఖద్వారంలో ఉన్న థియోడర్ రూజ్వెల్ట్ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించబోతున్నారు. అయితే ఎక్కడికి తరలించాలన్న దానిపై సిటీ మేయర్‌కు ఆలోచన తెగటం లేదు. 1940 నుంచీ ఆ విగ్రహం అక్కడ ఉంది. అప్పటి నుంచీ ఆ విగ్రహంపై నల్లజాతీయులకు అభ్యంతరం ఉంది. రూజ్వెల్ట్ గుర్రం ఎక్కి ఉంటాడు. గుర్రానికి ఒకవైపు ఆదివాసీ అమెరికన్, ఇంకోవైపు ఆఫ్రికా జాతీయుడు నిలబడి ఉంటారు. శ్వేతసౌధ సార్వభౌమాధికారానికి చిహ్నంగా ఉన్న ఆ విగ్రహాన్ని తొలగించాలని నల్లజాతీయులు చేస్తున్న డిమాండ్ ఏళ్లుగా పట్టించుకోని అధికారులు ఇప్పటికి కదిలారు. అదీ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం తీవ్రం అవుతుండటంతో. 2017లో ఒకసారి నిరసనకారులు విగ్రహానికి ఎర్ర ఇంకును పులిమారు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా రక్తం చిందిస్తామని చెప్పడం అది. ఆ పరిస్థితిని రానివ్వకూడదనే ప్రస్తుత మేయర్ బిల్ డే బ్లాసియో ఆ విగ్రహాన్ని తీయించబోతున్నారు. ‘అవునా! అర్ధం లేని పని కదా. అలా చెయ్యొద్దు..’ అని ట్రంప్ మాత్రం మేయర్ గారికి ఒక ట్వీట్ ఇచ్చారు. -
హింసా రాజకీయాలకు శ్రీరామ్ కుట్రలు
సాక్షి, అనంతపురం : టీడీపీ నాయుడు పరిటాల శ్రీరామ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తండ్రి బాటలో హింసా రాజకీయ చేయాలని పరిటాల శ్రీరామ్ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సోమవారం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల తలలు నరుకుతామంటూ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యాల వీడియో ఫుటేజీని ఎస్పీకి అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్ దౌర్జన్యాలను ఖండిస్తున్నామన్నారు. రామగిరిలో వైఎస్సార్ విగ్రహన్ని ధ్వంసం చేశారని శ్రీరామ్ స్వయంగా అంగీకరించరన్నారు. మా జోలికొస్తే తలలు నరుకుతామని శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. ‘చంద్రబాబుకు కరోనా వైరస్ సోకిందా..!) ఏపీలోకరోనా వైరస్ లేదని, ఎల్లో వైరస్ ఉందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైరస్ ప్రభావం రాష్ట్ర ఎన్నికల సంఘంపై చూపుతోందన్నారు. ఎన్నికల అధికారి రమేష్ చౌదరి కూతురుకి చంద్రబాబు ఆర్థిక మండలి డైరెక్టర్ పదవి ఇచ్చారని, రమేష్ చౌదరి చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోందని, ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ అరికట్టారని తెలిపారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఏపీకి రూ. 5000 కోట్లు రాకూడదనే బాబు కుయుక్తులు పన్నుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టావా అని ప్రశ్నించారు.(‘ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు’) పది చోట్ల వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం స్థానిక ఎన్నికలపై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వైఎస్సార్సీపీ నేతలు ప్రసాద్ రెడ్డి, శివారెడ్డి, కేశవరెడ్డి హత్య కేసుల్లో పరిటాల శ్రీరామ్ పాత్ర ఉందని ఆరోపించారు. తమ మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దని శ్రీరామ్‌ను హెచ్చరించారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వందలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో 10 చోట్ల వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యుల అరాచకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.(ఫలించిన తోపుదుర్తి కృషి) బాబు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి చంద్రబాబు కుట్ర రాజకీయాల వల్లే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఉందని పార్లమెంటు వాయిదా వేయలేదని, లక్షల మంది కలిసే జాతరలు వాయిదా వేయలేదని అన్నారు. అలాగే ‘కేంద్రం నుంచి రావాల్సిన రూ. 5000 కోట్లు అడ్డుకుంటున్న దుర్మార్గుడు చంద్రబాబు. గ్రామాలు, పట్టాణాలకు నిధులు రాకుండా అడ్డుకోవడం చంద్రబాబుకు తగదు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి. ఏపీ అభివృద్ధికి సహకరించాలి. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలి. స్థానిక ఎన్నికలు వెంటే జరపాలి’ అని టీడీపీపై విమర్శలు సంధించారు. -
కొవ్వూరులో దేవుళ్ల విగ్రహాలు పునఃప్రతిష్ట
-
తూప్రాన్‌లో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
తుప్రాన్: మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో శనివారం వెలుగు చూసింది. గ్రామంలోని కూడలిలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇది గుర్తించిన గ్రామస్థులు పోలీసులుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.