Theodore Roosevelt
-
గుర్రం దింపుతున్నారు!
న్యూయార్క్‌లోని అమెరికన్ మ్యూజియం ముఖద్వారంలో ఉన్న థియోడర్ రూజ్వెల్ట్ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించబోతున్నారు. అయితే ఎక్కడికి తరలించాలన్న దానిపై సిటీ మేయర్‌కు ఆలోచన తెగటం లేదు. 1940 నుంచీ ఆ విగ్రహం అక్కడ ఉంది. అప్పటి నుంచీ ఆ విగ్రహంపై నల్లజాతీయులకు అభ్యంతరం ఉంది. రూజ్వెల్ట్ గుర్రం ఎక్కి ఉంటాడు. గుర్రానికి ఒకవైపు ఆదివాసీ అమెరికన్, ఇంకోవైపు ఆఫ్రికా జాతీయుడు నిలబడి ఉంటారు. శ్వేతసౌధ సార్వభౌమాధికారానికి చిహ్నంగా ఉన్న ఆ విగ్రహాన్ని తొలగించాలని నల్లజాతీయులు చేస్తున్న డిమాండ్ ఏళ్లుగా పట్టించుకోని అధికారులు ఇప్పటికి కదిలారు. అదీ ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం తీవ్రం అవుతుండటంతో. 2017లో ఒకసారి నిరసనకారులు విగ్రహానికి ఎర్ర ఇంకును పులిమారు. జాత్యహంకారానికి వ్యతిరేకంగా రక్తం చిందిస్తామని చెప్పడం అది. ఆ పరిస్థితిని రానివ్వకూడదనే ప్రస్తుత మేయర్ బిల్ డే బ్లాసియో ఆ విగ్రహాన్ని తీయించబోతున్నారు. ‘అవునా! అర్ధం లేని పని కదా. అలా చెయ్యొద్దు..’ అని ట్రంప్ మాత్రం మేయర్ గారికి ఒక ట్వీట్ ఇచ్చారు. -
టెడ్డీబేర్‌తో సరదాగా ఓరోజు...!
పేద్ద తల... చిన్ని కళ్లు.... గుండ్రటి ముక్కు... చూడగానే హత్తుకోవాలి అనిపించే ‘సుతిమెత్తని’ రూపం.. ప్రేయసి అలకను తీర్చేందుకు ప్రియుడు... పిల్లల మారాన్ని ఇట్టే మాయం చేసేందుకు పెద్దలు.. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా ఎవరినైనా ఆకట్టుకునే.. అందరికీ అందుబాటులో ఉండే ముచ్చటైన బహుమతి బుజ్జి ఎలుగుబంటి అదేనండీ టెడ్డీబేర్. సాక్షి, వెబ్ప్రత్యేకం : చిన్నా, పెద్దా అందరికీ ప్రియనేస్తంగా మారిన టెడ్డీబేర్ గుర్తుగా జూలై 10న కెనడా, యూరప్, ఆస్ట్రేలియా దేశాల్లో ప్రత్యేకంగా టెడ్డీబేర్ పిక్నిక్ డేని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బోలెడన్నీ టెడ్డీబేర్ల మధ్య తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి కిండర్‌గార్డెన్‌లో టీ పార్టీ చేసుకుని సరదాగా గడుపుతారు. 1988 నుంచి వివిధ దేశాల్లో దీనిని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. దాదాపుగా ప్రతీ చిన్నారి చేతిలో కనిపించే ఈ టెడ్డీబేర్ పుట్టుక, టెడ్డీబేర్ పిక్నిక్ డే వెనుక పెద్ద చరిత్రే ఉంది తెలుసా!! మనసొప్పక వదిలేశారు! 1902 నవంబరులో నాటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్.. మిసిసిపీ, లూసియానాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యని తీర్చడానికి వెళ్లారు. ఈ క్రమంలో వేటకు వెళ్లిన సమయంలో అక్కడి ప్రజలు ఆయనకు ఓ గాయపడిన ఎలుగుబంటిని బహూకరించారు. చెట్టుకు కట్టేసి దానిని కాల్చాలని కోరారు. అయితే బుజ్జి పిల్ల అయిన ఆ ఎలుగుబంటి ప్రాణాలు తీయడానికి రూజ్వెల్ట్కు మనసొప్పక.. జాలితో దానిని విడిచిపెట్టేశారు. ఈ సంఘటన గురించి క్లిఫార్డ్ బెర్రీమ్యాన్ అనే కార్టూనిస్టు చక్కని కార్టూన్ రూపొందించారు. ఓ పత్రికలో ప్రచురితమైన ఈ కార్టూన్ ఆధారంగా బొమ్మల షాపు యజమానులు రోజ్, మోరిస్ మిచ్‌టమ్ ఎలుగుబంటి బొమ్మను తయారు చేసి అధ్యక్షుడి అనుమతితో దానికి ‘టెడ్డీబేర్’ అని నామకరణం చేశారు. ఈ విధంగా ‘నిన్ను నేను సంరక్షిస్తాను’ అనే భావనకు ప్రతిరూపంగా ‘టెడ్డీ బేర్’ అనే బొమ్మ ప్రపంచానికి పరిచయమైంది. అలా మొదలైంది!! జాన్ వాల్టర్ అనే అమెరికన్ మ్యూజిక్ కంపోజర్ 1907లొ ది టెడ్డీ బియర్స్ పిక్నిక్ అనే పాటను రాశారు. ఎంతో హృద్యంగా సాగిపోయే ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత 1932లో జేమ్స్ కెన్నడీ మరో రైటర్ ఇదే పాటను కాస్త మార్చి చిన్నారుల గుండె తాకేలా కంపోజ్ చేశారు. ఇక అప్పటి నుంచి టెడ్డీబేర్స్ సాంగ్‌ను దాదాపుగా అందరూ టాప్ మ్యూజిషియన్స్ సరికొత్తగా రూపొందించడం మొదలుపెట్టారు. కొన్ని దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన ఈ పాట అందరి మనుస్సుల్లో చెరగని ముద్ర వేసింది. ఈ క్రమంలో టెడ్డీబేర్స్ పిక్నిక్ ఆధారంగా1988లో కలెక్టిబుల్స్(వివిధ రకాల వస్తువుల సేకరించే) డీలర్ రాయల్ సెలాంగర్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన కంపెనీ జ్యువెల్లరీ బాక్సులు, ఆట వస్తువుల విడుదల సందర్భంగా టెడ్డీబేర్ పిక్నిక్ డే పేరిట వినోద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో భాగంగా కేరింతలు కొడుతున్న చిన్నారులను చూసిన చాలా మంది తల్లిదండ్రులు.. వారి పిల్లల పుట్టినరోజున ఇదే థీమ్‌తో పార్టీలు ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఈ విధంగా అనతికాలంలోనే టెడ్డీబేర్ పిక్నిక్ డే బాగా ప్రాచుర్యం పొందింది. ఈ క్రమంలో జూలై 10 ను జాతీయ టెడ్డీబేర్ పిక్నిక్ డేగా యునైటెట్ స్టేట్స్ ప్రకటించింది. క్రమేపీ కెనడా, యూరోప్, ఆస్ట్రేలియాల్లో కూడా ఈరోజును హాలీడేగా ప్రకటించి.. కిండర్గార్డెన్లలో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందంచడం మొదలుపెట్టాయి. అలా కిండర్గార్డెన్లలో తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు ఆడుకునేలా సరికొత్త సంప్రదాయానికి తెరతీశాయి. ఇక ఆనాటి బుజ్జి ఎలుగుబంటి పుణ్యమాని నేటికీ చిన్నారుల కోసం తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఓ రోజును కేటాయిస్తూ వారితో గడిపే అవకాశం దక్కింది. ఒక్కోచోట ఒక్కోలా... టెడ్డీబేర్ పిక్నిక్ డేను ఒక్కో దేశంలో ఒక్కోలా జరుపుకొంటారు. కెనడాలో చిన్నా, పెద్దా అంతా తమ టెడ్డీలతో కలిసి ‘ది టెడ్డీబేర్ మ్యాన్’ను చూసేందుకు వెళ్తారు. అనంతరం అతడితో కలిసి డ్యాన్స్ చేస్తారు. ఇక ఆస్ట్రేలియాలోని వెస్ట్మీడ్లో సిటీ అంతటా పిక్నిక్ డే కార్యక్రమం ఏర్పాటు చేసి నామమాత్రపు ఫీజు వసూలు చేస్తారు. తద్వారా వచ్చిన డబ్బును చిన్నారుల ఆస్పత్రికి విరాళంగా ఇస్తారు. ఇలా చేయడం వల్ల బాల్యం నుంచే పిల్లల్లో సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించడం వారి ఉద్దేశం. ఇదండీ.... చుట్టూ ఎవరూ లేనప్పుడు మన భావోద్వేగాలకు సాక్షీభూతంగా నిలిచే ప్రియనేస్తం టెడ్డీబేర్ కథాకమామీషు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా టెడ్డీబేర్‌ను తీసుకుని ప్రియమైన వారితో కలిసి మీకు ఇష్టమైన చోటికి వెళ్లి హాయిగా గడపండి!! - సుష్మారెడ్డి యాళ్ల -
టెడ్డీబేర్ అలా పుట్టింది...
పిల్లల బొమ్మ చిన్నారులను అమితంగా ఆకట్టుకొనే టెడ్డీబేర్ పుట్టుక ఇలా జరిగింది: అమెరికాకు చెందిన మోరిస్ మిచ్థమ్ టెడ్డీబేర్ సృష్టికర్త. అయితే, 1901 నుంచి 1909 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉండిన థియోడర్ రూజ్వెల్ట్ ఈ బొమ్మ పుట్టుకకు కారణం! అమెరికా 26వ అధ్యక్షుడైన ఆయనను ‘టెడ్డీ’ రూజ్వెల్ట్ అని కూడా పిలుస్తారు. స్వతహాగా మంచి షూటర్‌గా పేరున్న టెడ్డీకి వేట అంటే ఆసక్తి. ఒకసారి ఆయన తన పరివారంతో కలసి వేటకు వెళ్లారు. ఒక ఎలుగుబంటి వారి మీద దాడి చేసింది. చేతిలో పిస్టల్ ఉన్నా కాల్చకుండా, దాన్ని తరిమికొట్టారు. ఈ ఎలుగుబంటి అనుభవం అమెరికా మీడియాలో బాగా ప్రచారానికి నోచుకొంది. ఈ సంఘటన స్ఫూర్తితో కార్టూన్లు, కామిక్స్ పుట్టుకొచ్చాయి. ఇదే ఊపులో మోరిస్ మిచ్థమ్ ఎలుగుబంటిని ఒక సాఫ్ట్‌టాయ్ రూపంలో తయారు చేసి, దానికి ‘టెడ్డీ’ బేర్ అని పేరు పెట్టాడు. అది బ్రహ్మాండమైన ఆదరణకు నోచుకొంది. కాలక్రమంలో ఐకానిక్ టాయ్లలో ఒకటిగా నిలిచింది. -
టెడ్డీ టేల్
బేర్‌మంటూ మారాం చేసే పిల్లలను ఊరుకోపెట్టాలంటే కావాలొక టెడ్డీబేర్. ముచ్చటైన అమ్మాయిలు ఎత్తుకుని ఆడించేందుకు వారికీ కావాలొక టెడ్డీబేర్. చిన్నారులైనా, ఆరిందాలైనా.. నిద్రపోయేటప్పుడు వెచ్చగా హత్తుకోవడానికి వారికీ కావాలొక నిలువెత్తు టెడ్డీబేర్. ఇంపైన ఇళ్లలో తీర్చిదిద్దిన డ్రాయింగ్ రూముల్లోని షోకేసుల్లో ఒక టెడ్డీబేర్ అయినా కనిపించి తీరుతుంది. అది లేకుంటే ఆ అలంకరణలోనే ఏదో లోటు కనిపిస్తుంది. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బొవ్మును సిటీవాసులు ఏనాడో రెడ్‌కార్పెట్ పరచి ఆహ్వానించారు. తవు ఇళ్లలో చోటిచ్చి ఆనందిస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనతికాలంలోనే అందరి బంధువుగా మారిన టెడ్డీబేర్ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’ ప్రత్యేక కథనం. అమెరికా అధ్యక్షుడిగా థియోడర్ రూజ్వెల్ట్ కొనసాగుతున్న కాలం. మిసిసిపీలో భల్లూకాల బెడద ఎక్కువగా ఉండేది. వాటిని అరికట్టేందుకు వేటకు రావాలంటూ గవర్నర్ ఆండ్రూ హెచ్ లాంగినో 1902 నవంబర్‌లో రూజ్‌వెల్ట్‌ను ఆహ్వానించాడు. వేటగాళ్ల బృందంతో కలసి రూజ్వెల్ట్ అడవికి వెళ్లాడు. బృందంలోని చాలామంది వేటగాళ్లు దొరికిన జంతువునల్లా వేటాడుతూ ముందుకు సాగుతుండగా వారికొక ఎలుగు పిల్ల చిక్కింది. దానిని ఉచ్చువేసి బంధించారు. దానిని కాల్చి చంపాల్సిందిగా రూజ్‌వెల్ట్‌ను కోరితే, పసితనం వీడని జంతువును వేటాడటం వేటగాడి లక్షణం కాదంటూ ఆయన కాల్పులు జరిపేందుకు నిరాకరించాడు. ‘వాషింగ్టన్ పోస్ట్’ ఈ ఉదంతాన్ని 1902 నవంబర్ 16 సంచికలో ప్రముఖంగా ప్రచురించింది. కథనానికి అనుబంధంగా కార్టూన్‌ను వేసింది. ఇది ఆకట్టుకోవడంతో టాయ్స్ కంపెనీ మోరిస్ అండ్ రోజ్ మిక్టమ్ ఎలుగు పిల్ల బొమ్మను రూపొందించింది. దానికి ‘టెడ్డీబేర్’గా నామకరణం చేసేందుకు రూజ్వెల్ట్ అనుమతి కోరడంతో, ఆయన అంగీకరించారు. ఇక అప్పటి నుంచి టెడ్డీబేర్ బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. హైదరాబాద్ సహా భారత్‌లోని నగరాల్లోనూ టెడ్డీబేర్ బొమ్మలకు దశాబ్దాలుగా విపరీతమైన క్రేజ్ ఉంది. టెడ్డీబేర్ తర్వాత మార్కెట్లోకి చాలారకాల సాఫ్ట్‌టాయ్స్ వచ్చినా, వాటి స్థానం టెడ్డీబేర్ తర్వాతే. టెడ్డీబేర్ డే... అమెరికాలో కొందరు సెప్టెంబర్ 9న టెడ్డీబేర్ డే జరుపుకుంటూ వస్తున్నారు. మిగిలిన దేశాల్లోనూ చాలామంది ఇదేరోజును అనుసరిస్తున్నారు. వాలెంటైన్స్ డే తర్వాత తొమ్మిదోరోజు.. ఫిబ్రవరి 22న కూడా కొందరు టెడ్డీబేర్ డే జరుపుకుంటున్నారు. అమెరికాలోని టెడ్డీబేర్ బొమ్మలు తయారు చేసే వెర్మంట్ టెడ్డీబేర్ కంపెనీ నవంబర్ 13వ తేదీని జాతీయ టెడ్డీబేర్ డేగా ప్రకటించింది. టెడ్డీబేర్ డేను జరుపుకోవడానికి ప్రత్యేక కారణాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలూ లేవు. అయితే, ఇలాంటి రోజులు చిన్నారులు కాస్త ఉత్సాహంగా ఉల్లాసంగా, గడపడానికి దోహదపడతాయి. మరిన్ని.. టెడ్డీబేర్ బొమ్మల వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా లాభసాటి వ్యాపారాల్లో ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 2006 నాటికి ఈ వ్యాపారం టర్నోవర్ 1,300 కోట్ల డాలర్లకు పైమాటే. 1980ల తర్వాత టెడ్డీబేర్ బొమ్మల వ్యాపారం విపరీతంగా పుంజుకుంది. టెడ్డీబేర్ల కోసం తొలిసారిగా 1984లో ఇంగ్లండ్‌లో హాంప్‌షైర్ ప్రాంతంలోని పీటర్స్ఫీల్డ్లో మ్యూజియం వెలిసింది. ఇది 2006లో మూతబడింది. అయితే, ఈలోగా ప్రపంచంలో చాలాచోట్ల టెడ్డీబేర్ మ్యూజియంలు మొదలయ్యాయి. విపత్తులు, ప్రమాదాలు తలెత్తినప్పుడు విధులు నిర్వర్తించే పోలీసులకు అమెరికా ప్రభుత్వం టెడ్డీబేర్ బొమ్మలను ఇస్తుంది. విపత్తుల్లో చిక్కుకున్న చిన్నారులకు ఈ బొమ్మలు ఇస్తే, వారు తేలికగా ఊరట చెందుతారనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. - పన్యాల జగన్నాథదాసు