తెలివితేటలను పెంచే విటమిన్-సి | Exam Tips | Sakshi
Sakshi News home page

తెలివితేటలను పెంచే విటమిన్-సి

Published Tue, Mar 1 2016 11:21 PM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

తెలివితేటలను పెంచే  విటమిన్-సి - Sakshi

తెలివితేటలను పెంచే విటమిన్-సి

ఎగ్జామ్ టిప్స్
 
చదవాలంటే మూడ్ లేదా? అసలు బుర్రలో మట్టి పెట్టుకు తిరుగుతున్నావా? చదివినవి మీ పిల్లలు మర్చిపోతున్నారా? అయితే ఆసక్తికరమైన ఈ విటమిన్ గురించి తెలుసుకోవాల్సిందే. ఒక శాస్త్రీయ సర్వే ప్రకారం విటమిను సి సప్లిమెంట్ల వల్ల పిల్లల్లో ఐక్యూ పెరుగుతుందని తేలింది.మన శరీరం విటమిన్-సి ని తయారు చేసుకోలేదు అలాగే నిల్వ కూడా ఉంచుకోలేదు. కాబట్టి మనం ప్రతిరోజూ విటమిన్ సి ని ఏదో ఒక విధంగా ఆహారం ద్వారానే తీసుకోవాలి. ఆహారంలో నియమిత లేక సరైన మోతాదులో (45 మి.గ్రా) విటమిన్-సి తీసుకోవడం చాలా అవసరం. అలాగని ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్య సమస్యే. మామూలుగా పొగతాగే వారిలో పళ్లు, కూరగాయలు తక్కువగా తినే వారిలో, పిల్లలు పుట్టకుండా పిల్స్ వాడే వారిలో ఈ విటమిన్ తక్కువగా ఉంటుంది.చెర్రీ, జామ, బొప్పాయి, కివి, కమలాలు, ద్రాక్ష, పైనాపిల్, మామిడి లాంటి పుల్లని పళ్లలో, కాప్సికం, బ్రకోలి, టొమేటోలలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది.
     
వేడికి, వెలుగుకి, గాలికి వుండడం వల్ల, యాంటిబయాటిక్స్ వాడడం వల్ల, పొగ, మందు తాగే వారిలో ఇనుము, రాగి పాత్రలలోవండినా తీవ్రమైన జ్వరంతో బాధపడినా విటమిన్-సి నాశనమౌతుంది. కావున విటమిన్-సి మెదడు చురుగ్గా, చలాకీగా ఉండేలా చేయడమే కాక గ్రాహ్యకశక్తిని పెంచి మతిమరుపు పోగొట్టి వ్యాధి నిరోధకతను పెంచి పరీక్షా సమయంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement