మంచి నిద్ర కోసం...
స్లీప్ హైజీన్
నిద్రలేమితో బాధపడుతున్నవాళ్లు ఈ కింది జాగ్రత్తలు తీసుకుంటే మంచి నిద్రపట్టేందుకు అవకాశాలెక్కువ.ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను పెంపొందించుకోవాలి. అంటే... క్రమబద్ధంగా ఒకే వేళకు నిద్రపోవడం, ఉదయం మళ్లీ వేళకు నిద్రలేవడం వంటివి.బెడ్‌రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. వురీ చల్లగానూ, వురీ వేడిగా కాకుండా ఉండాలి. నిద్రపోతున్న సమయంలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. ఈ మసక చీకట్లోనే నిద్ర వచ్చేందుకు తోడ్పడే మెలటోనిన్ రసాయనం విడుదల అవుతుంది. వెలుతురు ఎక్కువగా ఉంటే ఇది వెలువడదు. అందుకే నిద్రపోవడాలనుకున్నవారు కళ్లపై ఏదైనా కప్పుకుంటారు. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి.
రాత్రి భోజనం త్వరగా పూర్తి చేయండి. కడుపు నిండుగా తినకండి.నిద్రకు వుుందు టీవీలో ఉద్విగ్నత, ఉద్వేగం కలిగించే దృశ్యాలున్న సినివూలూ, సీరియుళ్లు చూడొద్దు. వీలైతే బెడ్‌రూమ్‌లో టీవీ లేకుండా చూసుకోండి. బెడ్‌రూమ్‌ను కేవలం నిద్ర కోసం మాత్రమే ఉపయోగించండి. దాన్ని వర్క్‌ప్లేస్‌గా మార్చవద్దు.రాత్రి వేళ వుంచి నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పూర్తిస్థారుు పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. వుసక వెలుగున్న రూమ్‌లలో గడపడం తగదు.నిద్రకు వుుందు ఆహ్లాదకరమైన వుూ్యజిక్‌ను వినండి. రణగొణధ్వని ల్లాంటి వుూ్యజిక్ వద్దు.
నిద్రకు వుుందు కొన్ని రకాల పుస్తకాలు చదివితే నిద్ర వస్తుంది కానీ... అందులో ఉత్కంఠకు గురిచేసే ఆసక్తికరమైన విషయాలున్న పుస్తకాలు చదవద్దు. కేవలం నిద్రపట్టడానికి ఉపకరించేలా మాత్రమే మీ పుస్తకపఠనం ఉండాలి.బెడ్‌రూమ్‌లో ఆహ్లాదకరమైన లైట్ మ్యూజిక్ వినడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఊపిరితిత్తులు, కిడ్నీల జబ్బులు ఉండి, వాటికోసం మందులు ఉపయోగించేవాళ్లు డాక్టర్ సలహా మేరకు వాటిని పగటి పూట వాడేలాగా మార్పు చేసుకోవచ్చు. ఇక నొప్పుల సమస్యలు (పెయిన్ డిజార్డర్స్) ఉన్నవాళ్లు డాక్టర్‌ను సంప్రతించి వాటికి సంబంధించిన మందులు వాడాలి.
వాకింగ్ వంటి వ్యాయమాలు చేయాలి. అయితే వాటిని ఉదయం వేళ చేయడం మంచిది. ఒకవేళ ఉదయం వీలు కాకపోతే రాత్రి మాత్రం నిద్రపోయే ముందు తీవ్రమైన వ్యాయామాలు చేయవద్దు. నిద్రకు ముందు చేసే తీవ్రమైన వ్యాయామాలు ఒక్కోసారి నిద్రపట్టకుండా చేయవచ్చు.మంచి నిద్ర పట్టడానికి చేసే పైన పేర్కొన్న మంచి అలవాట్లను ‘స్లీప్ హైజీన్’ నిర్వహణగా పేర్కొంటారు. ఈ ‘స్లీప్ హైజీన్’ను నిత్యం ఆచరించడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
డా. బి. చంద్రశేఖర్ రెడ్డి
సీనియర్ న్యూరాలజిస్ట్
సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం.12, బంజారాహిల్స్ హైదరాబాద్