సాక్షి, హైదరాబాద్: తొలి తరంలో గృహాలంటే పూరి గుడిశెలు. రెండో తరంలో ఇటుక, సిమెంట్‌తో చేసినవి! ఆ తర్వాత కిటికీలున్నవి మూడో తరానికి. ఇకిప్పుడు ప్రకృతి, కళాత్మకం రెండింటి కలయికతో నాల్గో తరం గృహాలొచ్చేశాయి. ఇంట్లోకి వాయు, ధ్వని కాలుష్యాన్ని రాకుండా నివారించి ఇంటిని, అందులోని నివాసితుల్ని ఆరోగ్యకరంగా ఉంచడమే వీటి ప్రత్యేకత! రెండు దశాబ్దాల క్రితమే విదేశాల్లో ప్రారంభమైన ఈ తరహా గృహాలను ఇప్పుడు హైదరాబాద్‌లో నిర్మిస్తోంది గిరిధారి హోమ్స్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో బిజీ బిజీ. ఎడతెరిపి లేని మీటింగ్స్, ఫోన్ కాల్స్, ఈ–మెయిల్స్, వాట్సాప్. ఆఫీసు పూర్తయి ఇంటికెళ్దామని బయల్దేరితే బయటేమో పద్మవ్యూహంలాంటి ట్రాఫిక్. వాయు, ధ్వని కాలుష్యాలు. వీటన్నింటినీ ఛేదించుకొని ఇంటికొస్తే.. ఒక్కసారిగా చుట్టూ పచ్చని ప్రకృతి, కిటికీ, ద్వారం గుండా ఆరోగ్యకరమైన గాలి, హుషారెత్తించే పచ్చిక బయళ్లు, నీటి కొలనులుంటే ఆ అనుభూతే వేరు కదూ!
ఇలాంటి ప్రాజెక్ట్‌లనే నాల్గో తరం గృహాలంటారు. అంటే బయటి నుంచి ఇంట్లోకి గాలి వీచే ప్రదేశాల్లో ఆరీకా పామ్, మథరిన్ లా టంగ్, మనీ ప్లాంట్ వంటి వాయు, ధ్వని కాలుష్యాన్ని నివారించే మొక్కలను ఏర్పాటు చేస్తారు. ఇవి కార్బన్‌డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మారుస్తాయి. ధ్వని కాలుష్యాన్ని తగ్గించి ఆహ్లాద, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగిస్తాయన్నమాట. అమెరికా, సింగపూర్, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా గృహాలు రెండు దశాబ్ధాల క్రితమే ప్రారంభమయ్యాయి. దీన్నే ఆదర్శంగా తీసుకొని భాగ్యనగరవాసులకు కూడా నాల్గో తరం గృహాలను అందించే లక్ష్యంతో ‘ది ఆర్ట్’ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామని గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. ప్రకృతిని, కళాత్మకత సమ్మేళనమే ది ఆర్ట్.
►ప్రతి ప్రాజెక్ట్‌ను వినూత్నంగా, ల్యాండ్‌మార్క్‌లా తీర్చిదిద్దే గిరిధారి.. ది ఆర్ట్ ప్రాజెక్ట్ డిజైన్‌లోనూ ప్రస్తుత జీవన శైలి, ట్రెండ్స్‌కు అద్దంపడుతుంది. సింగపూర్, హాంకాంగ్, చైనా వంటి దేశాల్లో పర్యటించాం. అక్కడి స్ట్రక్చరల్ ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లను సంప్రదించి 15 నెలల పాటు దీర్ఘంగా పరిశోధన చేసిన తర్వాత ది ఆర్ట్ డిజైన్‌ను ఎంపిక చేశాం. ఇప్పటికే 25 శాతం అమ్మకాలు కూడా పూర్తయ్యాయంటే ది ఆర్ట్ డిజైన్, వసతులు, ప్రత్యేకతలు, ధర, ప్రాంతం అభివృద్ధి ప్రధాన కారణాలు.
►టీఎస్‌పీఏ జంక్షన్ (అప్పా జంక్షన్) దగ్గర్లోని బండ్లగూడ జాగీర్‌లో 4 ఎకరాల్లో ది ఆర్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 272 ఫ్లాట్లు. 1,171 నుంచి 1,328 వరకు 2 బీహెచ్‌కే, 1,579 నుంచి 1,857 వరకు 3 బీహెచ్‌కే, 1,550 నుంచి 1,708 వరకు విల్లామెంట్ గృహాలుంటాయి. ధర రూ.52 లక్షల నుంచి రూ.75 లక్షలు.
►ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇస్టా, విల్లా ఓనిక్స్, ఐసోలా, అవిజ్ఞ, మురారి, ఎగ్జిక్యూటివ్ పార్క్ వంటి 7 ప్రాజెక్ట్‌లల్లో వెయ్యి గృహాలను నిర్మిం చాం. వచ్చే మూడేళ్లలో మరో వెయ్యి గృహాలను నిర్మించాలని లకి‡్ష్యంచాం. త్వరలోనే 2 ఎకరాల్లో వ్యూ, 2 ఎకరాల్లో పలేషియా ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నాం. ది ఆర్ట్ ప్రాజెక్ట్ ప్రాంతం అభివృద్ధి గురించి చెప్పాలంటే.. ప్రతిపాదిత బుద్వేల్ ఐటీ పార్క్‌కు కూతవేటు దూరంలో ఉంది. టైమ్, శ్రీనిధి, ఓక్రిడ్జ్, డీపీఎస్, ఇందు వంటి ఇంటర్నేషనల్ స్కూల్స్, షాదన్, వాసవి, జేబీ, సీబీఐటీ వంటి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలున్నాయి. 10 కి.మీ. పరిధిలో షాపింగ్ మాల్స్ అండ్ మల్టీప్లెక్స్‌లతో పాటూ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, బాపూ ఘాట్, చిలుకూరి బాలాజీ, గోల్కొండ కోట, తారామతి బారాదరి వంటి దర్శనీయ ప్రదేశాలూ ఉన్నాయి.
ది ఆర్ట్‌లో 72 రకాల వసతులు!
గ్రాండ్ ఎంట్రెన్స్ లాబీ నుంచి మొదలుపెడితే పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు ప్రత్యేకంగా పూల్స్, పార్టీ లాన్, మెడిటేషన్ జోన్, ఇండోర్, ఔట్‌డోర్ గేమ్ ఏరియా, ఫార్మసీ, లైబ్రరీ, మినీ థియేటర్, బాంక్విట్ హాల్, జిమ్, ఏటీఎం, కాఫీషాప్, ఆర్ట్ గ్యాలరీ వంటి 72 రకాల వసతులుంటాయి. 20 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్ విస్తరించి ఉంటుంది.
►వంద శాతం వాస్తు నిర్మిత ది ఆర్ట్ వసతుల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది నక్షత్ర గార్డెన్, నెగిటీవ్ అయాన్ జోన్స్ గురించే. ఒక్కో రాశి వారికి ఒక్కో చెట్టు ఉంటుందని పద్మ పురాణం చెబుతుంది. జాతకం ప్రకారం సంబంధిత రాశి వాళ్లు ఆయా చెట్టు కింద కూర్చుంటే మనలోని శక్తి ప్రేరేపితమవుతుంది. పురాణాలు చెబుతున్నాయి. దీన్ని ఆధారంగా తీసుకొని 27 నక్షత్రాలతో కూడిన గార్డెన్‌ను ఏర్పాటు చేశాం. దీంతో నివాసితులు నిత్యం ఆరోగ్యవంతంగా, సిరి సంపదలను కలిగి ఉంటారని నమ్మకం. అలాగే ది ఆర్ట్ ప్రాజెక్ట్‌లో నెగిటీవ్ అయాన్ జోన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. హాఫ్ ఒలంపిక్ సైజ్ పూల్‌లో 30 అడుగుల వెడల్పుతో 30 అడుగుల ఎత్తు నుంచి వాటర్‌ఫాల్స్ పడుతుంటాయి. ఇందులో నుంచి వెలువడే రేణువులు, నీటి శబ్దం మెదడుకు పూర్తి స్థాయి ఆక్సిజన్‌ను అందించి మరింత ఉత్సాహభరితం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment