ఆచితూచి అడుగేయండి | From September 12 to 18 | Sakshi
Sakshi News home page

ఆచితూచి అడుగేయండి

Published Sat, Sep 12 2015 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

ఆచితూచి అడుగేయండి

ఆచితూచి అడుగేయండి

సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు
 
 
టారో బాణి

 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
సంతోషకరమైన సమయం రానుంది. అన్ని విషయాల్లోనూ దృఢచిత్తంతో ఉండండి. ప్రశంసలు, బహుమానాలు, ఇంక్రిమెంటులు పొందే సమయం ఇది. మీకు, మీ భాగస్వామికి మధ్య అప్యాయతానురాగాలు ఇనుమడిస్తాయి. వారమంతా దాదాపు ప్రశాంతంగానే గడుస్తుంది. మరింత ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. కలసివచ్చే రంగు: తెలుపు
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)

ఓపికగా ఉండటం అవసరం. ఏ పని చేసినా లాభనష్టాలను బేరీజు వేసుకోండి. ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో ప్రాక్టికల్‌గా ఆలోచించి చేయండి. మీలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇదో గొప్ప తరుణం. బాంధవ్యాలు సంతోషాన్ని కలిగిస్తాయి. కాకపోతే చిన్నపాటి అనారోగ్యాలు విసిగించే అవకాశం ఉంది. కలసివచ్చే రంగు: వంకాయ రంగు
 
జెమిని (మే 21-జూన్ 21)

ఇది మీకు కీలక సమయం. మీలోని నాయకత్వ లక్షణాలను బహిర్గత పర్చాల్సిన తరుణం. సమస్యలను ఛేదించడానికి సమాయత్తమవ్వండి. మీలో ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా పెరుగుతాయి. కొత్త వాహనాన్ని కొంటారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కలసివచ్చే రంగు: కాషాయం
 
 క్యాన్సర్ (జూన్22-జూలై 23)
ఈ వారం మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీ ఆలోచనలు సంచలన విజయాలను రుచి చూపిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. వృత్తిపరంగా దూసుకుపోతారు. వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలు కూడా పరిష్కార దశకు చేరుకుంటాయి. కలసివచ్చే రంగు: పసుపు
 
 లియో (జూలై 24-ఆగస్టు 23)
 కొత్త ప్రదేశాలు చూడటానికి, మీ కలలు నెరవేర్చుకోవడానికి, లక్ష్యాలు అందుకోవడానికి కూడా ఇది తగిన సమయం. కొత్తగా ప్రారంభించే వ్యాపారాలు లాభాల బాట పట్టిస్తాయి. అయితే కొన్ని బంధాల విషయంలో అభద్రతాభావానికి లోనవుతారు. దక్షిణ దిశలో రెండు ఎరుపురంగు కొవ్వొత్తులను వెలిగించి పెడితే మంచి జరుగుతుంది. కలసివచ్చే రంగు: గులాబి
 
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)

ఎప్పటినుంచో అనుకుంటోన్న కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. మీ తెలివితేటలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. అయితే ఆలోచనలను అమలకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రేమ వ్యవహారాలు చేదును మిగల్చవచ్చు. మీకు తగిన వ్యక్తి తప్పకుండా వస్తారన్న నమ్మకంతో ఆ బాధను అధిగమించండి. కలసివచ్చే రంగు: సీ గ్రీన్
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
వృత్తిపరంగా ఒడిదుడుకులు వస్తాయి. చేసే పనిలో నిరాసక్తత ఏర్పడుతుంది. ఓ మంచి అవకాశం చేజారిపోతుంది. మరో నెల రోజుల్లో మంచి సమయం వస్తుంది, కాబట్టి నిరుత్సాహపడకండి. మీ ఆఫీసులో ఉత్తరం వైపున గోల్డ్‌ఫిష్ ఉన్న బౌల్‌ని పెట్టుకుంటే పరిస్థితులు మెరుగుపడటంతో పాటు ఆర్థికంగా బలోపేతమవుతారు. కలసివచ్చే రంగు: లేత నారింజరంగు
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)

ఈవారం చాలావరకూ విహార, వినోదయాత్రలతో కాస్త సరదాగానే గడిచిపోతుంది. డబ్బులు బాగానే ఖర్చు చేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా విసుగులు చోటు చేసుకుంటాయి. చిన్న చిన్న విషయాలకే మనసు కష్టపెట్టుకోకండి. కలసివచ్చే రంగు: చాకొలెట్ బ్రౌన్
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
పని చేసే చోట మీతోపాటు మీ స్నేహితుడు కూడా కష్టాలను ఎదుర్కొంటారు. మీ ఇద్దరి మధ్య పొడసూపిన అపార్థాల వల్లే ఆ కష్టాలు వస్తాయి. ఆర్థికంగా బలపడతారు కానీ అది మెల్లగా జరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి మీ పట్ల ఉన్న ప్రేమ రెట్టింపవుతుంది. తనతో గడిపే మధుర క్షణాలను ఆనందమయం చేసుకోండి. కలసివచ్చే రంగు: సన్‌షైన్ యెల్లో
 
అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19)

ఊహించని గొప్ప అవకాశమొకటి మీ తలుపు తడుతుంది. దాన్ని వీలైనంత త్వరగా అందిపుచ్చుకుని పనిలో దిగండి. ఎప్పటి నుంచో ఉన్న ఓ బలమైన కోరిక నెరవేరుతుంది. గతంలో మీ జీవితంలో ఉండి వెళ్లిన ఓ వ్యక్తి మీకు మళ్లీ తారసపడతారు. వారితో మీ బంధాన్ని పునరుద్ధరించుకోవాలని మీరు ప్రయత్నిస్తారు. కలసివచ్చే రంగు: గోల్డెన్ బ్రౌన్
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
పెద్దమొత్తంలో లాభాలు వచ్చే సమయం. విజయం మీకు దగ్గరలోనే ఉంది. దాన్ని అందిపుచ్చుకోవాలంటే మీలోని సృజనాత్మకతను వెలికి తీయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు కూడా ఇది కలసివచ్చే సమయం. నిజాయతీగా ఉండే ఓ వ్యక్తితో ప్రేమలో పడతారు. మీకు తనపై ఉన్న నమ్మకం, ప్రేమలను మరింత బలపర్చుకోండి. కలసివచ్చే రంగు: లేత గులాబి
 
ఇన్సియా కె.
టారో అండ్  ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
 
 సౌర వాణి

 ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
మీ మాట నేర్పరితనం, నిజాయితీల వల్ల శత్రుబాధ తొలగుతుంది. కుటుంబంలో ఐకమత్యం కారణంగా మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. మరింత బలంగా కనిపిస్తున్న రవి (సూర్యగ్రహం) మీకు కొత్తవైన ఆలోచనలనిస్తూ సాధారణ పరిస్థితులను తెచ్చేస్తాడు. అనుభవజ్ఞులూ, పెద్దలూ అయినవారి పరిచయాలను పొందే కారణంగా సుఖంగా గడుపుతారు.
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
అనుకోకుండా వ్యయం నెత్తినపడే కారణంగా ఆర్థికమైన అంచనాలు తప్పుతూ కొంత మానసికమైన వ్యధకి గురికావచ్చు. ముందుజాగ్రత్తతో వ్యవహరించడం మంచిది. కుజుని మార్పు కన్పిస్తున్న కారణంగా మనస్తాపపడే సందర్భాలు రావచ్చు. కాబట్టి తొందరపడి మాట అనవద్దు, అనిపించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు.
 
 జెమిని(మే 21-జూన్ 21)
మీరు ప్రయత్నిస్తున్న పనులు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ ధైర్యంతో ప్రయత్నాలు చేయడం మానవద్దు. గతంలో పడ్డ మనోవేదనని గుర్తుంచుకుని పని విషయంలో తగినంత శ్రద్ధ చూపుతూ ఉండండి. పన్ను చెల్లింపులు, సమాధానం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న పత్రాల విషయంలో శ్రద్ధ చూపండి.
 
 క్యాన్సర్(జూన్22-జూలై 23)
వివాహేతర సంబంధాల విషయంలో ఇబ్బంది పడే సూచనలున్నాయి కాబట్టి పరిచయాలను తెంచుకోండి. అవసరానికి సరిపోయినంత ఆదాయం ఉంటుంది. మరింత పొదుపు చేయాలనే ఆలోచన సరికాదని గుర్తించండి. శత్రువులతో చనువూ, విరోధమూ రెండూ వద్దు. ఉదాసీనంగా ఉండండి. సాధ్యమైనంతవరకు విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.
 
లియో (జూలై 24-ఆగస్టు 23)

ఎదుటివారు చేసిన వాగ్దానాలను నమ్మి కార్యరంగంలోకి దూకవద్దు. నిస్వార్థంగా మీ విషయంలో ఎవరు సహకరిస్తున్నారో వారే మీకు సహాయపరులని గుర్తించండి తప్ప, తప్పకుండా సహకరిస్తారని ఎవరి గురించి మీరు అనుకుంటున్నారో వారిని విశ్వసించకండి. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకండి.
 
 వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23)

తెలియని ఓ అనారోగ్యం మిమ్మల్ని పీడిస్తూ వుండే అవకాశముంది కాబట్టి, వైద్యపరీక్షలు అవసరమని గ్రహించండి. కుటుంబంలోని వ్యక్తులు, మీ తోటి ఉద్యోగులు మీకు సహకరించని పరిస్థితి కనిపిస్తోంది. వాళ్లని నిలదీయడం మాని, మీ పని మీరు చేసుకువెళ్లండి. మీ మాట గురితప్పని బాణంలా ప్రయాణించబోతోంది కాబట్టి, ఎంత అవసరమో అంతే మాట్లాడండి.
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

ఎదుటివారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ‘మీ మాటే మీది’గా వ్యవహరిస్తూ వచ్చారు ఇప్పటికి. గాలిలోకి ఎగిరిన రాయి ఎప్పుడు ఎక్కడ ఎంత బలంగా పడుతుందో వేచిచూడాల్సిన సమయం ఇది. సమీప బంధువుల ఆరోగ్యం కొంత ఆందోళన కల్గించవచ్చు కాబట్టి తరచూ వారిని పరామర్శిస్తూ వుండండి.
 
 స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22)

నమ్ముకున్న వ్యవసాయం, చేస్తున్న వ్యాపారం, ఉద్యోగం... క్రమంగా అగమ్యగోచరంగా అనిపించి, నిరుత్సాహాన్ని, నిరాసక్తతనీ మీలో కలిగించవచ్చు. ప్రస్తుతం మీరు ఎత్తుని ఎక్కుతున్నారనే ఊహలో ఉండండి. ఇంతకష్టమూ ఒక్కసారిగా తొలగిపోయే అవకాశం బలీయంగా ఉంది కాబట్టి కొన్నాళ్లపాటు ఆ సమయం కోసం ఎదురుచూస్తూ ఉండండి.
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)

వాయిదాపడ్డ పనులను, బద్దకించి చేసుకోలేకపోయిన పనులను ఈవారంలో కొంతవరకు పూర్తి చేయడం గానీ, పూర్తి చేసుకోగలననే నమ్మకాన్ని గానీ పొందుతారు. దానధర్మాలు, సహాయాలు చేయడం మంచిదేకానీ, ప్రస్తుతం సరికాదని గ్రహించండి. ఎవరి విషయాలనో తెలుసుకుని, వాటికి పరిష్కారాలు ఆలోచించడం మాని, మీ గురించి మీరు శ్రద్ధ వహించండి.
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)

తేలికగా ముగియవలసిన పని ఎంతోశ్రమతో మాత్రమే పూర్తికాగలదు. ‘దీనికింత శ్రమపడాలా?’ అని ఎవరైనా గేలిచేస్తే, సమాధానం చెప్పి నోరు మూయించాలనే ఆలోచనకి రాకండి. కుటుంబంలోని వాళ్లు అసంతృప్తిగా వున్నా, మీకున్న సహజకోపంతో వాళ్లని కడిగేయాలనుకోకండి. నష్టపోతారు.
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
ఏదోఒక పని కారణంగా మీ పనులను మీరు పర్యవేక్షించుకోలేకపోవచ్చు. మీ పర్యవేక్షణ లేని కారణంగా వచ్చిన నష్టాన్ని లెక్కచేయకండి. ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో, ఎవరు అనుకూలంగా పైకి కన్పించే శత్రువులో, ఎవరు మార్గదర్శకులో... స్వయంగా గ్రహించుకో గలుగుతారు.
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
మీకు సంబంధించిన అపరిష్కృత ఆర్థికసమస్యల పరిష్కారానికి, మరేదో ముఖ్యమైన విచారణకి మీ తల్లిదండ్రులు లేదా అత్తమామలు రావచ్చు. వారి ముందు జంకులేకుండా నిఆన్ని నిజంగానే చెప్పండి తప్ప, బాంధవ్యం వంకతో మౌనంగా, లేదా తటస్థంగా వుంటే మీరు ఓడిపోయేందుకు సిద్ధపడిన సైనికుడే అవుతారు.
మైలవరపు శ్రీనివాసరావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement