గ్రూప్‌స్టడీస్...
‘‘ఎక్కడికి వెళ్దాం రా... బీచ్‌కా..? సినిమాకా?’’ అడిగాడు మహేష్
‘‘చదువు ముఖ్యం కాబట్టి గ్రూప్‌స్టడీస్‌కి వెళ్దాం రా!!’’ అన్నాడు సురేష్.
‘‘అయితే ఒక పనిచేద్దాం. బొమ్మా, బొరుసు వేసి చూసి బొమ్మ పడితే బీచ్‌కు, బొరుసు పడితే సినిమాకు... నాణెం ఎటూ కాకుండా నిలబడితే గ్రూప్‌స్టడీస్‌కి వెళ్దాం ఏమంటావు?’’ తెలివిగా చెప్పాడు రమేష్. ఏం జరుగుతుందో...
‘‘ఏంట్రా ఈ రోజు ఇంత డల్‌గా ఉన్నావు.. ఏమైంది’’ ఆరా తీశాడు గిరి.
‘‘మరేం లేదురా నా లవర్ నిన్నటి నుంచి నాతో ఎలాంటి పేచీ పెట్టకుండా చాలా బుద్దిగా ఉంటోంది. ఏం జరుగుతుందోనని భయంగా ఉందిరా...!’’ దిగులుగా చెప్పాడు రవి.
సర్‌ప్రైజ్...
‘‘అంత బాగా బైక్ నడిపేవాడివి, కారునెలా గుద్దేశావురా....?!!’’ హాస్పిటల్ బెడ్‌పైన ఉన్న సుబ్బూను అడిగాడు చిట్టిబాబు
‘‘చీకట్లో దూరం నుంచి చూస్తే రెండు బైకుల్లా కనిపించాయి రా.. ! వాటి మధ్య నుంచి వెళ్లి సర్‌ప్రైజ్ చేద్దామనుకుని ముందుకెళ్తేగానీ తెలీలేదు అది.. కారని!’’ బాధగా చెప్పాడు సుబ్బూ.
ఫన్ స్పేస్
Published Thu, Apr 30 2015 11:34 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM
Advertisement
Advertisement