group studies
-
ఫన్ స్పేస్
గ్రూప్స్టడీస్... ‘‘ఎక్కడికి వెళ్దాం రా... బీచ్కా..? సినిమాకా?’’ అడిగాడు మహేష్ ‘‘చదువు ముఖ్యం కాబట్టి గ్రూప్స్టడీస్కి వెళ్దాం రా!!’’ అన్నాడు సురేష్. ‘‘అయితే ఒక పనిచేద్దాం. బొమ్మా, బొరుసు వేసి చూసి బొమ్మ పడితే బీచ్‌కు, బొరుసు పడితే సినిమాకు... నాణెం ఎటూ కాకుండా నిలబడితే గ్రూప్స్టడీస్కి వెళ్దాం ఏమంటావు?’’ తెలివిగా చెప్పాడు రమేష్. ఏం జరుగుతుందో... ‘‘ఏంట్రా ఈ రోజు ఇంత డల్‌గా ఉన్నావు.. ఏమైంది’’ ఆరా తీశాడు గిరి. ‘‘మరేం లేదురా నా లవర్ నిన్నటి నుంచి నాతో ఎలాంటి పేచీ పెట్టకుండా చాలా బుద్దిగా ఉంటోంది. ఏం జరుగుతుందోనని భయంగా ఉందిరా...!’’ దిగులుగా చెప్పాడు రవి. సర్ప్రైజ్... ‘‘అంత బాగా బైక్ నడిపేవాడివి, కారునెలా గుద్దేశావురా....?!!’’ హాస్పిటల్ బెడ్‌పైన ఉన్న సుబ్బూను అడిగాడు చిట్టిబాబు ‘‘చీకట్లో దూరం నుంచి చూస్తే రెండు బైకుల్లా కనిపించాయి రా.. ! వాటి మధ్య నుంచి వెళ్లి సర్ప్రైజ్ చేద్దామనుకుని ముందుకెళ్తేగానీ తెలీలేదు అది.. కారని!’’ బాధగా చెప్పాడు సుబ్బూ. -
ఫేస్బుక్కే మీ పిల్లల టీచర్!!
మీ పిల్లలు ఎక్కువ సేపు ఫేస్బుక్ చూస్తున్నారా? అయినా సరే ఇప్పుడు మీరు వాళ్లను తిట్టాల్సిన అవసరం అంతగా లేదు. అదే వాళ్లకు టీచర్లా ఉపయోగపడుతుందట. సోషియాలజీ క్లాసులో భాగంగా ఫేస్బుక్ ఎక్కువగా ఉపయోగించిన యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ల ఎసైన్‌మెంట్లను చాలా బాగా పూర్తిచేశారు. ఫేస్బుక్ గ్రూపు రూపొందించుకున్న విద్యార్థులు దానిద్వారా గ్రూప్ స్టడీ లాంటివి చేసుకుని, ఎసైన్మెంట్లు బాగా రాశారని బేలర్ యూనివర్సిటీ కాలేజి ఆఫ్ ఆర్ట్స్‌లో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ కెవిన్ డౌర్టీ తెలిపారు. ఉన్నత విద్యకు వచ్చేసరికి ఎక్కువ మంది పిల్లలకు బోధించడం చాలా కష్టంగా ఉంటుందని, ఆ సవాళ్లను విద్యార్థులు ఇలా ఫేస్బుక్ లాంటి వాటితో అధిగమిస్తున్నారని అదే వర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న బ్రిటా ఆండర్చెక్ అభిప్రాయపడ్డారు. 218 మంది విద్యార్థులతో కూడిన బృందాన్ని ఈ వర్సిటీ గమనించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది.