ఫేస్బుక్కే మీ పిల్లల టీచర్!!
మీ పిల్లలు ఎక్కువ సేపు ఫేస్బుక్ చూస్తున్నారా? అయినా సరే ఇప్పుడు మీరు వాళ్లను తిట్టాల్సిన అవసరం అంతగా లేదు. అదే వాళ్లకు టీచర్లా ఉపయోగపడుతుందట. సోషియాలజీ క్లాసులో భాగంగా ఫేస్బుక్ ఎక్కువగా ఉపయోగించిన యూనివర్సిటీ విద్యార్థులు వాళ్ల ఎసైన్మెంట్లను చాలా బాగా పూర్తిచేశారు. ఫేస్బుక్ గ్రూపు రూపొందించుకున్న విద్యార్థులు దానిద్వారా గ్రూప్ స్టడీ లాంటివి చేసుకుని, ఎసైన్మెంట్లు బాగా రాశారని బేలర్ యూనివర్సిటీ కాలేజి ఆఫ్ ఆర్ట్స్లో సోషియాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ కెవిన్ డౌర్టీ తెలిపారు.
ఉన్నత విద్యకు వచ్చేసరికి ఎక్కువ మంది పిల్లలకు బోధించడం చాలా కష్టంగా ఉంటుందని, ఆ సవాళ్లను విద్యార్థులు ఇలా ఫేస్బుక్ లాంటి వాటితో అధిగమిస్తున్నారని అదే వర్సిటీలో పీహెచ్డీ చేస్తున్న బ్రిటా ఆండర్చెక్ అభిప్రాయపడ్డారు. 218 మంది విద్యార్థులతో కూడిన బృందాన్ని ఈ వర్సిటీ గమనించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించింది.