ఫేస్బుక్లో హెలికాప్టర్ సేల్... ధరెంతో తెలుసా?
ఫేస్బుక్లో హెలికాప్టర్ సేల్... ధరెంతో తెలుసా?
Published Mon, Jan 23 2017 5:37 PM | Last Updated on Thu, Oct 4 2018 4:27 PM
వెరైటీ బ్యాంగిల్స్, డిజైనర్ డ్రస్లు వంటి వాటిని ఫేస్బుక్లో అమ్మకానికి పెడుతుండటం మనం చూస్తుటాం. కాని కొత్తగా దేశ రాజధాని పరిధిలో ఓ ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్ డైరెక్ట్గా హెలికాప్టర్నే అమ్మకానికి పెట్టింది. ఫ్లాట్స్, ఫ్లాట్మేట్స్ పేరు మీదున్న ఈ ఫేస్బుక్ గ్రూప్లో 2009 మోడల్కు చెందిన హెలికాప్టర్ను అమ్మకానికి పెట్టారు. దీని ధర రూ.2.8 కోట్లగా ప్రకటించారు. ఆరు సీటర్లున్న ఈ హెలికాప్టర్, గంటకు 200-300 కిలోమీటర్లు పయనిస్తుందట. గంటలకు 60 లీటర్ల వరకు ఇంధనం ఖర్చువుతుందట. ఆసక్తి ఉన్న కస్టమర్లు వయా ఫేస్బుక్ ద్వారా తమ ఇన్బాక్స్లో నమోదుచేసుకోవాలని విక్రయదారుడు కోరాడు.
సామాజిక మాధ్యమంగా ఎక్కువగా పాపులర్ అయిన ఫేస్బుక్, వినియోగదారులను, అమ్మకందారులను అనుసంధానం చేయడానికి మార్కెట్ ప్లేస్ను ఇటీవలే ప్రవేశపెట్టింది. చాలామందికి ఈ పేజీ వివరాలు తెలియనప్పటికీ, ఫేస్బుక్ ద్వారా ఇప్పటికే అమ్మక, కొనుగోలు జరుగుతున్నాయి. గుర్గావ్ నివాసితులకు సమీపవారు ఫ్లాట్స్ అండ్ ఫ్లాట్మేట్ ఫేస్బుక్ గ్రూప్ను ప్రారంభించారు. ఎలాంటి బ్రోకరేజ్ చార్జీలు చెల్లించకుండా ఫ్లాట్లను అద్దెకు ఇచ్చేందుకు, తీసుకునేందుకు ఈ పేజీ ఎంతో సహకరిస్తోందని గ్రూప్ ఓనర్లు చెబుతున్నారు. ఈ గ్రూప్లో ఇప్పటివరకు 65,131 సభ్యులున్నారు. ఫ్లాట్లను అద్దెకిచ్చే ఈ గ్రూప్లో హెలికాప్టర్ విక్రయానికి పెట్టడం విశేషం.
Advertisement
Advertisement