'ఫేస్బుక్' ద్వారా అసభ్య మెసేజ్లు, అరెస్ట్ | student arrested after facebook messages to classmate | Sakshi
Sakshi News home page

'ఫేస్బుక్' ద్వారా అసభ్య మెసేజ్లు, అరెస్ట్

Published Fri, Sep 12 2014 8:36 AM | Last Updated on Fri, Nov 9 2018 5:06 PM

'ఫేస్బుక్' ద్వారా అసభ్య మెసేజ్లు, అరెస్ట్ - Sakshi

'ఫేస్బుక్' ద్వారా అసభ్య మెసేజ్లు, అరెస్ట్

హైదరాబాద్ : సోషల్ మీడియా (పేస్బుక్) ద్వారా అసభ్యకర మెసేజ్లు పంపి విద్యార్థినిని వేధిస్తున్న ఆకతాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ నరేష్ కథనం ప్రకారం రాజేంద్రనగర్కు చెందిన విద్యార్థిని హనుమాన్ టెకిడీలోని ఓ ప్రయివేట్ కళాశాలలో బీయస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. 

అంబర్పేటకు చెందిన ఉదయ్ కుమార్ అనే సహచర విద్యార్థి...... విద్యార్థినికి ఫేస్బుక్ ద్వారా అసభ్యకర మెసేజ్లు పంపుతున్నాడు. ఈ విషయమై విద్యార్థిని అతడిని నిలదీయగా ...దుర్భాషలాడటంతో పాటు ఆమెను బెదిరించాడు. దీంతో బాధితురాలు, కుటుంబ సభ్యులతో కలిసి సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉదయ్ కుమార్ ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement